100W Fast Charging - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 24 Sep 2024 13:28:00 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 OnePlus 13: 100W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోన్న వన్‌ప్లస్ 13 https://www.91mobiles.com/telugu/oneplus-13-to-come-with-100w-fast-charging-support-know-details/ https://www.91mobiles.com/telugu/oneplus-13-to-come-with-100w-fast-charging-support-know-details/#respond Tue, 24 Sep 2024 13:28:00 +0000 https://www.91mobiles.com/telugu/?p=13717 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో తన తదుపరి ఫ్లాగ్షిప్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. OnePlus 13 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ చైనాకు చెందిన 3సీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించింది. దీంతో డివైజ్ యొక్క కీలక సమాచారం బయటకు వచ్చింది. 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో ఈ ఫోన్ రానున్నట్లు 3సీ ద్వారా తెలిసింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి. OnePlus 13 […]

The post OnePlus 13: 100W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోన్న వన్‌ప్లస్ 13 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OnePlus 13 విడుదల
  • 3సీ సైట్ పై లిస్టైన డివైజ్
  • 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో తన తదుపరి ఫ్లాగ్షిప్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. OnePlus 13 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ చైనాకు చెందిన 3సీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై కనిపించింది. దీంతో డివైజ్ యొక్క కీలక సమాచారం బయటకు వచ్చింది. 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో ఈ ఫోన్ రానున్నట్లు 3సీ ద్వారా తెలిసింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

OnePlus 13 3సీ సర్టిఫికేషన్ వివరాలు

OnePlus 13 స్మార్ట్‌ఫోన్ 3సీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై PJZ110 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

OnePlus 13 స్మార్ట్‌ఫోన్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుందని 3సీ సర్టిఫికేషన్ ద్వారా తెలుస్తోంది. అంటే ఏ విధమైన అప్‌గ్రేడ్ లేదని తెలుస్తోంది. గత మోడల్ OnePlus 12 కూడా 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.

లేటెస్ట్ ప్రాసెసర్ తో రానున్న OnePlus 13 శక్తివంతమైన ఫోన్ గా నిలవనుంది.

బ్యాటరీ విభాగం విషయానికి వస్తే, OnePlus 13 డివైజ్ లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది గత మోడల్ (5,500mAh) తో పోల్చితే 500ఎంఏహెచ్ ఎక్కువ. అలాగే OnePlus 13 డివైజ్ 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ తో వస్తున్నట్లు సమాచారం.

OnePlus 13 స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: OnePlus 13 లో 6.82-ఇంచ్ 2కే ఓఎల్ఈడీ స్క్రీన్, 10-బిట్ ఎల్టీపీవో బీఓఈ ఎక్స్2 మైక్రో-కర్డ్ ప్యానెల్ ఉంటుంది. డిస్ప్లే వివరాలను వన్‌ప్లస్ ఇప్పటికే కన్ఫర్మ్ చేసింది.

ప్రాసెసర్: OnePlus 13 డివైజ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ తో లాంచ్ కానుంది. ఈ చిప్సెట్ అక్టోబర్ లో విడుదలవుతుంది.

కెమెరా: OnePlus 13 స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో రానుంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ808 ప్రైమరీ కెమెరా, 50ఎంపి ఎల్‌వైటీ600 పెరిస్కోప్ లెన్స్, 50ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి.

బ్యాటరీ, చార్జింగ్: OnePlus 13 లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో రానుంది. వన్‌ప్లస్ 13 డివైజ్ 6,100 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోందని కొన్ని లీక్స్ ద్వారా తెలుస్తోంది.

అక్టోబర్ నెలలో OnePlus 13 చైనాలో లాంచ్ అవుతుంది. తర్వాత గ్లోబల్ మార్కెట్స్ లోకి ఈ ఫోన్ ఎంట్రీ ఇవ్వనుంది. భారత్ లో OnePlus 13 స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాది ఆఖర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

The post OnePlus 13: 100W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోన్న వన్‌ప్లస్ 13 first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oneplus-13-to-come-with-100w-fast-charging-support-know-details/feed/ 0
లాంచ్ అయిన Realme GT 2 Master Explorer ఎడిషన్ https://www.91mobiles.com/telugu/realme-gt2-master-explorer-edition-china-launch-100w-fast-charging-snapdragon-8plus-gen1-chipset/ Tue, 12 Jul 2022 11:57:34 +0000 https://www.91mobiles.com/telugu/?p=917 హైలైట్స్: * రియల్ మీ జీటీ 2 మాస్టర్ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్ చైనాలో లాంచ్ అయ్యింది. * స్నాప్ డ్రాగన్ 8+ జెన్1 చిప్సెట్, 50ఎంపి ట్రిపుల్ కెమెరాలు, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్ ప్రత్యేకతలు. * రియల్ మీ జీటీ 2 మాస్టర్ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్ ధర ఆర్ఎంబీ 3499 (దాదాపు రూ.41,500) అనుకున్నట్లుగానే, రియల్ మీ జీటీ 2 మాస్టర్ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్ చైనాలో లాంచ్ అయ్యింది. […]

The post లాంచ్ అయిన Realme GT 2 Master Explorer ఎడిషన్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

* రియల్ మీ జీటీ 2 మాస్టర్ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్ చైనాలో లాంచ్ అయ్యింది.

* స్నాప్ డ్రాగన్ 8+ జెన్1 చిప్సెట్, 50ఎంపి ట్రిపుల్ కెమెరాలు, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్ ప్రత్యేకతలు.

* రియల్ మీ జీటీ 2 మాస్టర్ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్ ధర ఆర్ఎంబీ 3499 (దాదాపు రూ.41,500)

అనుకున్నట్లుగానే, రియల్ మీ జీటీ 2 మాస్టర్ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్ చైనాలో లాంచ్ అయ్యింది. లేటెస్ట్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ తో వస్తోన్న తొలి రియల్ మీ ఫోన్ జీటీ 2 మాస్టర్ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్. గత రెండు జీటీ 2 మోడల్స్ ఉన్నట్లుగానే తాజాగా వచ్చిన జీటీ 2 మాస్టర్ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్ ఉంది. కానీ, గోల్డ్ కలర్ స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తోంది. ఉన్న మూడు ఆప్షన్స్ లో ఈ గోల్డ్ కలర్ ఎలిగంట్ మరియు ప్రీమియమ్ గా కనిపిస్తోంది. వెనుక ప్యానెల్ చూస్తే, ఫ్రేమ్ చుట్టూ డార్క్ బ్రౌన్ కేసింగ్ తో ఆకట్టుకుంటోంది.

సెల్ఫీ షూటర్ కోసం పంచ్-హోల్ కటౌట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, వెనుకాల ట్రిపుల్ కెమెరాలు ఉన్నాయి. స్నాప్ డ్రాగన్ చిప్సెట్, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరాలు, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఈ ఫోన్లో కీలక ఫీచర్లు.

Realme GT 2 Master Explorer ఎడిషన్ ధర

రియల్ మీ జీటీ 2 మాస్టర్ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్ 8జిబి+128జిబి వేరియంట్ ధర ఆర్ఎంబీ 3499 (రూ.41,500), 8జిబి+256జిబి వేరియంట్ ధర ఆర్ఎంబీ 3799 (రూ.45,000), 12జిబి+256జిబి వేరియంట్ ధర ఆర్ఎంబీ 3999 (రూ.47,300). ఇక ఈ ఫోన్ నలుపు, తెలుపు, బంగారు వర్ణాల్లో లభిస్తుంది.

రియల్ మీ జీటీ 2 మాస్టర్ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్ లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1000Hz టచ్ శాంప్లింగ్ రేట్, 100 శాతం P3 కలర్ గేముత్, 94.2 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, హెచ్డీఆర్10+, పంచ్ హోల్ కటౌట్, స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, అడ్రెనో జీపీయూ, 12జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్ మీ యూఐ 3.0, పిక్సెల్ వర్క్స్ ఎక్స్7 గ్రాఫిక్స్ చిప్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

కనెక్టివిటీ విషయానికి వస్తే, 5G, 4G LTE, Bluetooth, GPS, NFC, USB Type-C పోర్ట్ వంటి ఛార్జింగ్ మరియు డేటా ట్రాన్స్ ఫర్ ఫీచర్లున్నాయి. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, డాల్బీ అట్మాస్, హై-రెజుల్యూషన్ ఆడియో సపోర్ట్, 5,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఈ ఫోన్లో ఉన్నాయి. ఇక ఫోన్ వెడల్పు 8.17 మి.మీ కాగా, బరువు 195 గ్రాములు.

కెమెరాల విషయానికి వస్తే, రియల్ మీ జీటీ 2 మాస్టర్ ఎక్స్ ప్లోరర్ ఎడిషన్ లో 50MP సోనీ ఐఎంఎక్స్766 సెన్సర్, 50MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరా, 16MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

The post లాంచ్ అయిన Realme GT 2 Master Explorer ఎడిషన్ first appeared on 91Mobiles Telugu.

]]>