200W Fast Charging - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 11 Jul 2022 10:51:59 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 ప్రపంచపు తొలి 200W ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్ ‘iQOO 10 Pro’.. కన్ఫర్మ్ చేసిన కంపెనీ https://www.91mobiles.com/telugu/iqoo-10-pro-200w-fast-charging-confirmed-by-company/ Mon, 11 Jul 2022 10:51:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=881 హైలైట్స్: * జులై 19న చైనాలో ఐకూ 10 సిరీస్ స్మార్ట్ ఫోన్లు లాంచ్ అవుతున్నాయి * iQOO 10 Pro ఫోన్ 200 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు కన్ఫర్మ్ చేసిన కంపెనీ * ఐకూ 10 సిరీస్ లో స్టాండర్డ్ వేరియంట్ ఐకూ 10 కూడా ఉండనుంది. ఇది 120 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉండనుంది. ఐకూ 10 సిరీస్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసేందుకు ఐకూ కంపెనీ సిద్దమవుతోంది. […]

The post ప్రపంచపు తొలి 200W ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్ ‘iQOO 10 Pro’.. కన్ఫర్మ్ చేసిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

* జులై 19న చైనాలో ఐకూ 10 సిరీస్ స్మార్ట్ ఫోన్లు లాంచ్ అవుతున్నాయి

* iQOO 10 Pro ఫోన్ 200 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు కన్ఫర్మ్ చేసిన కంపెనీ

* ఐకూ 10 సిరీస్ లో స్టాండర్డ్ వేరియంట్ ఐకూ 10 కూడా ఉండనుంది. ఇది 120 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉండనుంది.

ఐకూ 10 సిరీస్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసేందుకు ఐకూ కంపెనీ సిద్దమవుతోంది. ఈ లైనప్ లో స్టాండర్డ్ వేరియంట్ ఐకూ 10 మరియు ఐకూ 10 ప్రో కూడా ఉంటాయి. చైనాలో ఈ ఫోన్లు 2022, జులై 19 న లాంచ్ అవుతాయి. ఇక లాంచ్ కు ముందు ఐకూ 10 ప్రో 200 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తున్నట్లు సదరు కంపెనీ వెల్లడించింది. ఇప్పటి హయ్యస్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన స్మార్ట్ ఫోన్ ఇదే అవ్వనుంది. ఇదిలా ఉంటే, ఐకూ 10 మాత్రం కేవలం 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

iQOO 10 Pro 200W ఫాస్ట్ ఛార్జింగ్ తో రావడం కన్ఫర్మ్

పైన చూస్తున్న ప్రమోషనల్ పోస్టర్ ప్రకారం, ఐకూ 10 ప్రో 200 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉండనుందని కన్ఫర్మ్ అయ్యింది. ప్రస్తుతం మార్కెట్ లో ఐకూ 10 ప్రో మాత్రమే ఇంతటి భారీ ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ కలిగి ఉండి, అగ్రస్థానంలో నిలిచింది. మరి సున్నా నుంచి వంద శాతం ఛార్జింగ్ పూర్తి చేసేందుకు ఈ కొత్త 200W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఎంత సమయం తీసుకుంటుందో చూడాలి.

అసలు ఫ్యాక్ట్ ఏంటంటే, 200 వాట్ ఫాస్ట్ ఛార్జర్ తో ఐకూ 10 ప్రో ని ఛార్జ్ చేస్తున్న పిక్స్ బయటకు వచ్చాయి. ఈ డివైజ్ 63 శాతం ఛార్జ్ అవ్వడానికి 5 నిమిషాలు సమయం తీసుకుంది. మరి 63 శాతం నుంచి 100 శాతం చేరుకునేందుకు ఎంత టైం పడుతుందో ఇంకా తెలియాల్సి ఉంది.

iQOO 10 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

ఐకూ 10 ప్రో 6.78 అంగుళాల 2కే+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 8+ జెన్1 చిప్సెట్, 16జిబి ఎల్పీడీడీఆర్5/ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి యూఎఫ్ఎస్3.1 స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12, ఒరిజిన్ ఓఎస్ స్కిన్ వంటి ఫీచర్లతో వస్తోంది.

ఇక కెమెరా విభాగాన్ని పరిశీలిస్తే, ఐకూ 10 ప్రో లో 50ఎంపి ప్రధాన కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 14.6ఎంపి టెలీఫోటో కెమెరా, 32ఎంపి సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఐకూ 10 ప్రో 4,550ఎంఏహెచ్ బ్యాటరీ, 200 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

The post ప్రపంచపు తొలి 200W ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్ ‘iQOO 10 Pro’.. కన్ఫర్మ్ చేసిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>