44w fast charging phones - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 13 Apr 2023 06:51:33 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 రూ.20,000 లోపు ధరలో లభించే 44W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ గల ఫోన్లు https://www.91mobiles.com/telugu/44w-fast-charging-smartphones-under-20-thousand-rupees-budget/ Wed, 12 Apr 2023 14:35:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=5857 స్మార్ట్ ఫోన్స్ లో జనాలు ప్రధానంగా చూసేది కెమెరా, బ్యాటరీ లైఫ్, చార్జింగ్ స్పీడ్, డిస్ప్లే, చిప్సెట్. ఇలా ఒక్కొక్కరి ప్రాధాన్యత వారి అభిరుచిని బట్టి మారుతుంది. చార్జింగ్ స్పీడ్ గురించి మాట్లాడితే, యూజర్స్ ఫోన్ కొనేముందు ఎంత వాటేజీకి ఫోన్ సపోర్ట్ చేస్తుందో తెలుసుకుంటారు. వాటేజీని బట్టే ఫోన్ బ్యాటరీ స్పీడ్ గా లేదా స్లో గా చార్జ్ అవుతుంది. మార్కెట్ లో రకరకాల చార్జింగ్ స్పీడ్ కలిగిన ఫోన్లు ఉన్నాయి. 33 వాట్, 44 […]

The post రూ.20,000 లోపు ధరలో లభించే 44W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ గల ఫోన్లు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • బాగా సేల్ అవుతోన్న ఫాస్ట్ చార్జింగ్ స్మార్ట్ ఫోన్లు
  • ఫాస్ట్ చార్జింగ్ ఫోన్లకు జనాల్లో అధిక ఆదరణ
  • 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేసే ఫోన్ల జాబితా మీకోసం

స్మార్ట్ ఫోన్స్ లో జనాలు ప్రధానంగా చూసేది కెమెరా, బ్యాటరీ లైఫ్, చార్జింగ్ స్పీడ్, డిస్ప్లే, చిప్సెట్. ఇలా ఒక్కొక్కరి ప్రాధాన్యత వారి అభిరుచిని బట్టి మారుతుంది. చార్జింగ్ స్పీడ్ గురించి మాట్లాడితే, యూజర్స్ ఫోన్ కొనేముందు ఎంత వాటేజీకి ఫోన్ సపోర్ట్ చేస్తుందో తెలుసుకుంటారు. వాటేజీని బట్టే ఫోన్ బ్యాటరీ స్పీడ్ గా లేదా స్లో గా చార్జ్ అవుతుంది. మార్కెట్ లో రకరకాల చార్జింగ్ స్పీడ్ కలిగిన ఫోన్లు ఉన్నాయి. 33 వాట్, 44 వాట్, 67 వాట్, 120 వాట్ ఇలా ఇంకా మరెన్నో చార్జింగ్ స్పీడ్స్ కి సపోర్ట్ చేసే ఫోన్లు ఉన్నాయి.

మరి అధికంగా ఫోన్ ని వాడే వారు ఎక్కువ సార్లు చార్జ్ చేయాల్సి ఉంటుంది. అయితే చార్జ్ చేస్తారు సరే, త్వరగా చార్జ్ కావాలంటే ఎక్కువ చార్జింగ్ స్పీడ్ కి ఫోన్ సపోర్ట్ చేయాలి. అప్పుడు ఫోన్ ని త్వరగా చార్జ్ చేసుకునే వీలుంటుంది. ఫోన్ల ధరను బట్టి వాటిలో చార్జింగ్ టెక్నాలజీ ఉంటుంది. ఈ ఆర్టికల్ లో మనం 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేసే రూ.20 వేల లోపు ధర కలిగిన ఫోన్ల జాబితాను తెలుసుకుందాం.

44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేసే రూ.20 వేల లోపు ధర గల ఫోన్లు

  • Vivo T1 44W
  • iQOO Z6 44W
  • iQOO Z7 5G
  • Vivo Y35

Vivo T1 44W

వివో టీ1 44వాట్ డివైజ్ లో 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుందని పేరులోనే తెలపబడింది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంది. 4జిబి ర్యామ్ వేరియంట్ ధర రూ.14,499 గా ఉంది.

iQOO Z6 44W

ఐకూ జెడ్ 6 44వాట్ స్మార్ట్ ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. 4జిబి/6జిబి/8జిబి మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో 8జిబి వేరియంట్ ధర రూ.17,990 గా ఉంది. మిగతా వేరియంట్స్ ధరలు మరింత తక్కువగా ఉంటాయి. ఈ ఫోన్ కూడా 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

iQOO Z7 5G

ఈ ఫోన్ 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ని కలిగి ఉంది. ఈ ఫోన్ ని కొనాలనుకుంటే అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.18,999 గా ఉంది.

Vivo Y35

వివో వై35 డివైజ్ 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర అమెజాన్ లో రూ.17,499 గా ఉంది. డాన్ గోల్డ్, అగేట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post రూ.20,000 లోపు ధరలో లభించే 44W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ గల ఫోన్లు first appeared on 91Mobiles Telugu.

]]>