5G Rollout - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 04 Oct 2022 05:30:22 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 వచ్చే కొన్నేళ్ళలో అందుబాటులోకి రానున్న Vodafone Idea 5G సేవలు https://www.91mobiles.com/telugu/vodafone-idea-5g-rollout-next-few-years/ Tue, 04 Oct 2022 05:30:22 +0000 https://www.91mobiles.com/telugu/?p=2725 హైలైట్స్: రానున్న కొన్ని సంవత్సరాల్లో 5జీ నెట్వర్క్ ని రోలౌట్ చేస్తామని ప్రకటించిన వొడాఫోన్ ఐడియా తమ భాగస్వాములు, ఇకో సిస్టమ్ ప్లేయర్స్ తో కలిసి ఇండియా-స్పెసిఫిక్ యూజ్ కేసెస్ ని అభివృద్ధి పరిచిన వొడాఫోన్ ఐడియా శాంసంగ్, వన్‌ప్లస్, ఒప్పో, వివో, రియల్మీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ తో చేతులు కలిపిన వొడాఫోన్ ఐడియా ఇటీవలె ఎయిర్టెల్, జియో సంస్థలు 5జీ రోలౌట్ ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరొక టెలీకామ్ కంపెనీ వొడాఫోన్ […]

The post వచ్చే కొన్నేళ్ళలో అందుబాటులోకి రానున్న Vodafone Idea 5G సేవలు first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • రానున్న కొన్ని సంవత్సరాల్లో 5జీ నెట్వర్క్ ని రోలౌట్ చేస్తామని ప్రకటించిన వొడాఫోన్ ఐడియా
  • తమ భాగస్వాములు, ఇకో సిస్టమ్ ప్లేయర్స్ తో కలిసి ఇండియా-స్పెసిఫిక్ యూజ్ కేసెస్ ని అభివృద్ధి పరిచిన వొడాఫోన్ ఐడియా
  • శాంసంగ్, వన్‌ప్లస్, ఒప్పో, వివో, రియల్మీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ తో చేతులు కలిపిన వొడాఫోన్ ఐడియా

ఇటీవలె ఎయిర్టెల్, జియో సంస్థలు 5జీ రోలౌట్ ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరొక టెలీకామ్ కంపెనీ వొడాఫోన్ ఐడియా రానున్న కొన్నేళ్ళలో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. అయితే ఎయిర్టెల్, జియో ల మాదిరి వీఐ టైమ్ ని పేర్కొనలేదు. కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ని ట్రాన్స్‌ఫార్మ్ చేసి బిజినెస్ పెర్ఫామెన్స్ ని పెంచుతామని వీఐ సీఈవో అక్షయ మూంద్రా చెప్పారు. మరోవైపు 2024 మార్చి కల్లా 5జీ రోలౌట్ ని పూర్తి చేస్తామని ఎయిర్టెల్ చెప్పగా, 2023 డిసెంబర్ కల్లా పూర్తి చేస్తామని జియో ప్రకటించింది. జియో సేవలు దీపావళి నుంచి అందుబాటులోకి వస్తున్నాయి. ఇక ఎయిర్టెల్ 5జీ సేవలు తొలిదశ లో 8 నగరాల్లో ప్రారంభం అవ్వబోతున్నాయి.

అక్టోబర్ 1 న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇండియా మొబైల్ కాంగ్రెస్ లో 5జీ సేవలను ప్రారంభించారు. పార్ట్నర్షిప్స్, ఇకో సిస్టమ్ ప్లేయర్లతో కలిసి కన్జూమర్లు, ఎంటర్‌ప్రైజెస్ కోసం ఇండియా-స్పెసిఫిక్ యూజ్ కేసెస్ అభివృద్ధి పరిచినట్లు వీఐ సీఈవో మూంద్రా చెప్పారు.

Vi 5G రోలౌట్ ప్లాన్స్

“వొడాఫోన్ 5జీ నెట్వర్క్, సేవలు రానున్న కొన్ని ఏళ్ళలో విస్తరించాక, మా యొక్క 5జీ సొల్యూషన్స్ ఉత్తమమైన భవిష్యత్తుని అందిస్తాయి. అది కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ని మార్చి, బిజినెస్ పెర్ఫామెన్స్ ని మెరుగు పరచనుంది. దేశంలో డిజిటల్ ఎకానమీని నడిపే ప్రజలపై సానుకూల ప్రభావం చూపుతాం,” అని సీఈవో అక్షయ మూంద్రా అన్నారు.

తాము కస్టమర్లు, కంపెనీల కోసం ఇండియా-స్పెసిఫిక్ యూజ్ కేసెస్ ని డెవలప్ చేశామని వొడాఫోన్ ఐడియా తెలిపింది. “అపరిమిత డిజిటల్ సొల్యూషన్స్ తో కనెక్ట్ అయిన ప్రపంచంలో 5జీ టెక్నాలజీతో తన వృద్ధి ప్రయాణాన్ని సాగించేందుకు వొడాఫోన్ ఐడియా సిద్ధంగా ఉంది. వివిధ డొమెయిన్స్ ద్వారా అపరిమితమైన అవకాశాలతో కూడిన సరికొత్త ప్రపంచాన్ని వీఐ 5జీ టెక్నాలజీ సొల్యూషన్స్ తీసుకొస్తాయి. ఇది భారతదేశంలో సాంకేతిక అభివృద్ధి యొక్క కొత్త శకానికి నాంది పలుకుతుంది,” అని మూంద్రా అన్నారు.

ఇక 5జీ ఇకోసిస్టమ్ అభివృద్ధి కోసం, వొడాఫోన్ ఐడియా స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ అయిన శాంసంగ్, వన్‌ప్లస్, ఒప్పో, వివో, రియల్మీ లతో జట్టు కట్టింది. ఇతర అగ్ర సంస్థలతో కలిసి తన యూజర్ల కి 5జీ రోలౌట్ ని అందించేందుకు వీఐ అడుగులు వేస్తోంది. ఎల్ అండ్ టీ స్మార్ట్ వరల్డ్ తో కలిసి హెల్త్ కేర్ వంటి ఇండస్ట్రీ యూజ్ కేసెస్ ని వీఐ డెవలప్ చేస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post వచ్చే కొన్నేళ్ళలో అందుబాటులోకి రానున్న Vodafone Idea 5G సేవలు first appeared on 91Mobiles Telugu.

]]>
అక్టోబర్ 1 న 5G నెట్వర్క్ లాంచ్ అవుతుందా? https://www.91mobiles.com/telugu/5g-launch-india-timeline-details/ Mon, 26 Sep 2022 15:53:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=2584 హైలైట్స్: 5జీ నెట్వర్క్ లాంచ్ కోసం ఎదురు చూస్తోన్న యావత్ దేశం మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న 5జీ సేవలు తొలి దశలో ప్రధాన నగరాలకు మాత్రమే పరిమితం కానున్న 5జీ నెట్వర్క్ యావత్ దేశం 5జీ లాంచ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తోంది. అయితే ఆ ఎదురు చూపులకు ఎండ్ కార్డ్ పడనుంది. మరొక నాలుగు రోజుల్లో దేశంలో 5జీ సేవలు మొదలు కానున్నాయి. అక్టోబర్ 1 న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ […]

The post అక్టోబర్ 1 న 5G నెట్వర్క్ లాంచ్ అవుతుందా? first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • 5జీ నెట్వర్క్ లాంచ్ కోసం ఎదురు చూస్తోన్న యావత్ దేశం
  • మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న 5జీ సేవలు
  • తొలి దశలో ప్రధాన నగరాలకు మాత్రమే పరిమితం కానున్న 5జీ నెట్వర్క్

యావత్ దేశం 5జీ లాంచ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తోంది. అయితే ఆ ఎదురు చూపులకు ఎండ్ కార్డ్ పడనుంది. మరొక నాలుగు రోజుల్లో దేశంలో 5జీ సేవలు మొదలు కానున్నాయి. అక్టోబర్ 1 న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 5జీ నెట్వర్క్ ని ప్రారంభించనున్నారు. అక్టోబర్ 1 న జరిగే ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ లో 5జీ నెట్వర్క్ అందుబాటులో ఉంటుందని నేషనల్ బ్రాడ్ బ్యాండ్ మిషన్ తన ట్విట్టర్ హ్యాండిల్ పై ప్రకటించింది.

దీపావళి నాటికి ఎయిర్టెల్ 5జీ, జియో 5జీ, వీఐ 5జీ సేవలు కూడా ప్రారంభమవుతాయని అంచనా వేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఎన్బీఎస్ తన ట్వీట్ ని ఓ రోజు తర్వాత తొలగించింది. దీంతో అసలు గందరగోళం మొదలైంది. 5జీ సేవలు అక్టోబర్ 1 నే మొదలవుతాయా? లేక ఇంకా జాప్యమవుతుందా అని అందరిలో ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.

అక్టోబర్ 1 న 5G సేవలు లాంచ్ అవుతాయా?

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అక్టోబర్ 1 న జరిగే ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ లో 5జీ సేవలను ప్రారంభిస్తారని నేషనల్ బ్రాడ్‌బ్యాండ్ మిషన్ తన ట్వీట్ లో తెలిపింది. కానీ ఆ ట్వీట్ ని తర్వాత ఎన్బీఎస్ తొలగించింది. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ నుంచి కూడా 5జీ లాంచ్ కి సంబంధించి ఎటువంటి సంకేతాలు రాలేదు. దీని బట్టి దేశంలో 5జీ సేవలు అక్టోబర్ 1 న ప్రారంభమవుతాయన్న విషయం నిరాధారమైనదిగా భావిస్తున్నారు.

అక్టోబర్ 12 న లాంచ్ కానున్న 5G

అక్టోబర్ 12 న దేశంలో 5జీ నెట్వర్క్ లాంచ్ అవుతుందని, అందుకోసం టెలీకామ్ ఆపరేటర్లు సిద్ధమవుతున్నారని కేంద్ర టెలీకామ్ మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్ చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో అక్టోబర్ 12 న 5జీ లాంచ్ అవుతుందని, తర్వాత దేశ వ్యాప్తంగా ఉన్న నగరాలు, పట్టణాలకు విస్తరిస్తుందని భావిస్తున్నారు. రానున్న రెండు మూడేళ్ళలో దేశంలో ఉన్న అన్ని మారుమూల ప్రాంతాలకు 5జీ సేవలు వ్యాపించాలని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

5జీ సేవలు భారత్ లో 2022 ఆగస్టు 15 వ తేదీన లాంచ్ అవుతాయని 5జీ స్పెక్ట్రమ్ వేలం ముగిసాక వార్తలు వచ్చాయి. కానీ, అది జరగలేదు. అదే విధంగా జియో, ఎయిర్టెల్ సంస్థలు దీపావళి కి 5జీ నెట్వర్క్ లాంచ్ చేస్తామని తెలిపాయి. మరి ఇది జరుగుతుందో లేదో చూడాలి.

తొలి దశలో 5జీ సేవలు పొందే నగరాలివే

తొలిదశలో దేశంలోని 13 ప్రధాన నగరాలకు 5జీ సేవలు ప్రారంభమవుతాయని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ వెల్లడించింది. దాని ప్రకారం, 2022 లో హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చంఢీఘర్, గాంధీనగర్, గురుగ్రామ్, జామ్ నగర్, కోల్‌కతా, చెన్నై, లక్నో, పూణె, ఢిల్లీ, ముంబై నగరాలకు 5జీ సేవలు అందనున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఆటోమొబైల్, టెక్నాలజీ, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post అక్టోబర్ 1 న 5G నెట్వర్క్ లాంచ్ అవుతుందా? first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్ లో 4G ధరల మాదిరే ఉండనున్న 5G సేవల ధరలు https://www.91mobiles.com/telugu/5g-roll-out-india-5g-prices/ Fri, 23 Sep 2022 05:44:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=2528 హైలైట్స్: లాంచ్ సమయంలో 4జీ ధరలతో సమానంగానే ఉండనున్న 5జీ ధరలు అక్టోబర్ నుంచి మొదలుకానున్న 5జీ సేవలు, తొలి దశలో ప్రధాన నగరాలకు మాత్రమే ఇప్పటికే 5జీ సేవల రోలౌట్ ను ప్రకటించిన జియో, ఎయిర్టెల్ వచ్చే నెలలో భారతదేశంలో 5జీ నెట్వర్క్ లాంచ్ అవుతోంది. వచ్చే నెల నుంచి 5జీ సేవలు ప్రారంభిస్తామని ప్రముఖ టెలీకామ్ కంపెనీలు ఎయిర్టెల్, జియో ప్రకటించాయి. దీంతో దేశ ప్రజల్లో 5జీ రీచార్జ్ ప్లాన్ ధరలు ఏ విధంగా […]

The post భారత్ లో 4G ధరల మాదిరే ఉండనున్న 5G సేవల ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • లాంచ్ సమయంలో 4జీ ధరలతో సమానంగానే ఉండనున్న 5జీ ధరలు
  • అక్టోబర్ నుంచి మొదలుకానున్న 5జీ సేవలు, తొలి దశలో ప్రధాన నగరాలకు మాత్రమే
  • ఇప్పటికే 5జీ సేవల రోలౌట్ ను ప్రకటించిన జియో, ఎయిర్టెల్

వచ్చే నెలలో భారతదేశంలో 5జీ నెట్వర్క్ లాంచ్ అవుతోంది. వచ్చే నెల నుంచి 5జీ సేవలు ప్రారంభిస్తామని ప్రముఖ టెలీకామ్ కంపెనీలు ఎయిర్టెల్, జియో ప్రకటించాయి. దీంతో దేశ ప్రజల్లో 5జీ రీచార్జ్ ప్లాన్ ధరలు ఏ విధంగా ఉంటాయనే ఆసక్తి మొదలైంది. 5జీ సేవలకు కూడా 4జీ మాదిరే వసూలు చేస్తారని సమాచారం.

ఎకనమిక్స్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం, రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్ సంస్థలు 4జీ సేవలను అందిస్తున్న ధరలకే, 5జీ సేవలను అందించనున్నాయట. తొలి దశలో 5జీ సేవలను 4జీ సేవల ధరలోనే అందించడం వల్లన చాలామంది 5జీ నెట్వర్క్ కి మారేందుకు అవకాశాలు చాలా ఉంటాయని రిపోర్ట్ పేర్కొంది.

5జీ నెట్వర్క్ ని లాంచ్ చేసిన తొలినాళ్ళలో 5జీ సేవలకు టెలీకామ్ సంస్థలు ప్రీమియమ్ ప్రైస్ పెట్టే చాన్స్ లేదని తెలుస్తోంది. అనుకున్న యూజర్ బేస్ వచ్చాక, 5జీ సేవలకు ఎక్కువ ధరలను పెట్టాలని టెలీకామ్ కంపెనీలు భావిస్తున్నట్లు పలువురు ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఇది అంత త్వరగా జరిగే అవకాశం లేదు. ఎందుకంటే, జనాలందరి దగ్గర ఇంకా 5జీ ఫోన్లు లేవు. ఇప్పుడిప్పుడే 5జీ ఫోన్లను కొనేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నారు. 5జీ ఫోన్ల ధరలు కూడా తగ్గడం మొదలైంది. రూ.15,000 లోపు అందుబాటులో ఉన్న 5జీ ఫోన్లు చాలా తక్కువగా ఉన్నాయి. రూ.10,000 ధర లోపైతే అసలు లేవు. కాబట్టి టెలీకామ్ సంస్థలు అప్పుడే 5జీ సేవలకు ఓ రేంజ్ లో వసూలు చేయరు.

భారత్ లో 5G ధరలు: నిపుణులు చెబుతున్నదేంటి?

“5జీ ఆపరేటర్లు 4జీ కంటే ఎక్కువ ధరలను వసూలు చేసే అవకాశం లేదు. వారి యొక్క సత్వర లక్ష్యం జనాలు 5జీ కి మారడం, ఎక్కువ మంది 5జీ కస్టమర్లను సంపాదించడం. జనాలు ఎంత ఎక్కువ డేటా వినియోగిస్తే అంత లాభం. ఏఆర్పీయూ వృద్ధి ముఖ్యం.” అని ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్ రోహన్ ధమిజా అన్నారు.

అలాగే ధమీజా యూకే ని ఉదాహరణగా చూపారు. తొలుత 5జీ సేవలను ప్రీమియమ్ ధరకు లాంచ్ చేశారు. వారి ఎత్తుగడ బెడిసి కొట్టడంతో, మళ్ళీ ఆ ఆలోచనను విరమించుకుని 4జీ ధరలకే 5జీ సేవలను అందించారని ధమీజా తెలిపారు.

5జీ సేవలకు ఎక్కువగా డబ్బులు డిమాండ్ చేస్తే, యూజర్లను పొందడం కంపెనీలకు కష్టంగా మారుతుంది. ప్రస్తుతం 5జీ యూస్ కేస్ సింగిల్ డిజిట్స్ కే పరిమితం కానుంది. అని బీఎన్పీ పరిబాస్ ఈక్వైట్ రీసెర్చ్ హెడ్ ఆఫ్ ఇండియా, కునాల్ వోరా అన్నారు.

4జీ ధరల మాదిరే 5జీ ధరలు ఉంటాయని గతంలో 91మొబైల్స్ తో ఎయిర్టెల్ సీటీవో రణదీప్ సెఖాన్ తెలిపారు.

అక్టోబర్ లో లాంచ్ కానున్న 5G సేవలు, కొన్ని ప్రాంతాలకే పరిమితం

తొలి దశలో 5జీ సేవలు కొన్ని ప్రాంతాలకే పరిమితం కానున్నాయని ET రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. అక్టోబర్ లో తమ 5జీ సేవలను లాంచ్ చేస్తామని ఎయిర్టెల్, జియో ప్రకటించాయి. ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న వొడాఫోన్ ఐడియా ఇంకా 5జీ రోలౌట్ కి టైమ్ లైన్ నిర్దేశించుకోలేదు.

లేటెస్ట్ టెలీకామ్, స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post భారత్ లో 4G ధరల మాదిరే ఉండనున్న 5G సేవల ధరలు first appeared on 91Mobiles Telugu.

]]>