8GB Variant - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 23 Oct 2023 16:31:00 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 8GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన Realme Narzo N53; ధర రూ.9,999 మాత్రమే! https://www.91mobiles.com/telugu/realme-narzo-n53-8gb-ram-variant-launched-india-price-specs-availability/ Mon, 23 Oct 2023 16:31:00 +0000 https://www.91mobiles.com/telugu/?p=8513 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme తాజాగా భారతీయ మార్కెట్ లో Realme Narzo N53 8జిబి ర్యామ్ వేరియంట్ ని లాంచ్ చేసింది. అయితే ఇదివరకే Realme Narzo N53 డివైజ్ 4జిబి/6జిబి ర్యామ్ మోడల్స్ తో లాంచ్ అయ్యింది. ఇప్పుడు 8జిబి ర్యామ్ వేరియంట్ ఎంట్రీ ఇచ్చింది. సరే, ఓసారి Realme Narzo N53 8జిబి ర్యామ్ మోడల్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. Realme Narzo N53 ధర Realme […]

The post 8GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన Realme Narzo N53; ధర రూ.9,999 మాత్రమే! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన Narzo N53 8జిబి ర్యామ్ మోడల్
  • ఇదివరకే లాంచైన 4జిబి/6జిబి ర్యామ్ మోడల్స్
  • Narzo N53 8జిబి ర్యామ్ వేరియంట్ ధర రూ.11,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme తాజాగా భారతీయ మార్కెట్ లో Realme Narzo N53 8జిబి ర్యామ్ వేరియంట్ ని లాంచ్ చేసింది. అయితే ఇదివరకే Realme Narzo N53 డివైజ్ 4జిబి/6జిబి ర్యామ్ మోడల్స్ తో లాంచ్ అయ్యింది. ఇప్పుడు 8జిబి ర్యామ్ వేరియంట్ ఎంట్రీ ఇచ్చింది. సరే, ఓసారి Realme Narzo N53 8జిబి ర్యామ్ మోడల్ ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Realme Narzo N53 ధర

Realme Narzo N53 డివైజ్ యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.11,999 గా నిర్ణయించారు. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.10,999 పెట్టారు. ఇకపోతే, బేస్ మోడల్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ ఫోన్ ధర రూ.8,999 గా ఉంది. అయితే Realme Narzo N53 యొక్క అన్ని ర్యామ్ వేరియంట్స్ పై కంపెనీ ఆఫర్లను ప్రకటించింది. దీంతో ఫోన్లపై కస్టమర్లకు మంచి డిస్కౌంట్ లభించనుంది. ఆ విశేషాలను క్రింద అందించాం. ఓసారి చదివేయండి.

Realme Narzo N53 ఆఫర్స్

  • దీపావళి పండుగ సందర్భంగా రియల్మీ సంస్థ Realme Narzo N53 స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ.2,000 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది.
  • 4జిబి ర్యామ్ వేరియంట్ పై రూ.1,000 డిస్కౌంట్, 6జిబి ర్యామ్ వేరియంట్ పై రూ.1,500 డిస్కౌంట్ లభిస్తుంది.
  • 8జిబి ర్యామ్ మోడల్ పై రూ.1,000 డిస్కౌంట్ మరియు రూ.1,000 కూపన్ వంటి ప్రయోజనాలు లభిస్తున్నాయి. దీంతో ఆఫర్ తర్వాత 8జిబి ర్యామ్ వేరియంట్ ని రూ.9,999 కే కొనుగోలు చేయవచ్చు.

Realme Narzo N53 స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Realme Narzo N53 లో 6.74-ఇంచ్ వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 450 నిట్స్ బ్రైట్నెస్, 16.7 మిలియన్ కలర్ సపోర్ట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Realme Narzo N53 లో యూనిఎస్ఓసీ టీ612 చిప్సెట్ వాడారు.
  • మెమొరీ: Realme Narzo N53 డివైజ్ గరిష్టంగా 4జిబి/6జిబి/8జిబి ర్యామ్ వేరియంట్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో వర్చువల్ ర్యామ్ ఫీచర్ కూడా ఉంది.
  • కెమెరా: Realme Narzo N53 లో 50ఎంపి మెయిన్ కెమెరా, 5పీ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
  • బ్యాటరీ, ఓఎస్: Realme Narzo N53 పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 4.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Realme Narzo N53 లో 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, డేటా సింక్ ఉన్నాయి.

The post 8GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన Realme Narzo N53; ధర రూ.9,999 మాత్రమే! first appeared on 91Mobiles Telugu.

]]>
Lava Blaze 5G: లాంచైన 8GB ర్యామ్‌ వేరియంట్‌; ధర రూ.12,999 మాత్రమే! https://www.91mobiles.com/telugu/lava-blaze-5g-8gb-ram-variant-launched-india-price-rs-12999/ Thu, 03 Aug 2023 09:10:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=7452 స్వదేశీ స్మార్ట్ ఫోన్ తయారీదారు అయిన Lava భారతీయ మార్కెట్ లో గతేడాది Lava Blaze 5G అనే డివైజ్ ని లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు ఈ డివైజ్ యొక్క 8జిబి ర్యామ్ పవర్ఫుల్ వేరియంట్ ని తీసుకొచ్చింది. అంతే కాదు, 8జిబి ఫిజికల్ ర్యామ్ తో పాటు, 8జిబి వర్చువల్ ర్యామ్ ని కూడా ఈ ఫోన్ లో ఆఫర్ చేస్తున్నారు. దీంతో యూజర్ కి మొత్తం 16జిబి ర్యామ్ లభించనుంది. సరే, ఓసారి […]

The post Lava Blaze 5G: లాంచైన 8GB ర్యామ్‌ వేరియంట్‌; ధర రూ.12,999 మాత్రమే! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 8జిబి వర్చువల్ ర్యామ్ తో వచ్చిన Lava Blaze 5G
  • డైమెన్సిటీ 700 చిప్ ని ఆఫర్ చేస్తున్న డివైజ్
  • ఆండ్రాయిడ్ 13 పై పని చేయనున్న Lava Blaze 5G

స్వదేశీ స్మార్ట్ ఫోన్ తయారీదారు అయిన Lava భారతీయ మార్కెట్ లో గతేడాది Lava Blaze 5G అనే డివైజ్ ని లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు ఈ డివైజ్ యొక్క 8జిబి ర్యామ్ పవర్ఫుల్ వేరియంట్ ని తీసుకొచ్చింది. అంతే కాదు, 8జిబి ఫిజికల్ ర్యామ్ తో పాటు, 8జిబి వర్చువల్ ర్యామ్ ని కూడా ఈ ఫోన్ లో ఆఫర్ చేస్తున్నారు. దీంతో యూజర్ కి మొత్తం 16జిబి ర్యామ్ లభించనుంది. సరే, ఓసారి Lava Blaze 5G ధర, స్పెసిఫికేషన్స్, లభ్యత తదితర వివరాలు తెలుసుకుందాం.

Lava Blaze 5G ధర, లభ్యత

Lava Blaze 5G డివైజ్ 8జిబి వేరియంట్ ధరను రూ.12,999 గా నిర్ణయించారు. అయితే లాంచ్ ఆఫర్ లో భాగంగా ఈ ఫోన్ ని రూ.12,499 కే కొనుగోలు చేయవచ్చు. కంపెనీ బ్యాంక్ ఆఫర్ ని రన్ చేస్తోంది. దీని ద్వారా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ మరియు ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ పై రూ.1000 వరకు డిస్కౌంట్ లభించనుంది. అంటే Lava Blaze 5G ఫోన్ ని కస్టమర్లు రూ.11,499 కే సొంతం చేసుకోవచ్చు. నేటి నుంచి అమెజాన్ ద్వారా Lava Blaze 5G డివైజ్ సేల్స్ మొదలయ్యాయి.

Lava Blaze 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Lava Blaze 5G లో 6.5-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ డిస్ప్లే, 1600*720 పిక్సెల్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • చిప్సెట్: Lava Blaze 5G డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్ వాడారు.
  • స్టోరేజీ: Lava Blaze 5G డివైజ్ 128జిబి స్టోరేజీ ఆఫర్ చేస్తోంది. ఇంకా 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఈ ఫోన్ లో ఉన్నాయి. దీంతో 16జిబి వరకు ర్యామ్ పవర్ యూజర్ కి లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.
  • బ్యాటరీ: Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కెమెరా: Lava Blaze 5G డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్, ఒక ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • ఓఎస్: Lava Blaze 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Lava Blaze 5G డివైజ్ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

The post Lava Blaze 5G: లాంచైన 8GB ర్యామ్‌ వేరియంట్‌; ధర రూ.12,999 మాత్రమే! first appeared on 91Mobiles Telugu.

]]>