8k budget - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 17 May 2023 16:05:40 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 రూ.8,000 లోపు ధరలో లభించే స్మార్ట్‌ఫోన్లు https://www.91mobiles.com/telugu/smartphones-under-8-thousand-rupees-budget/ Wed, 17 May 2023 16:05:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=6359 ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల కాలం నడుస్తోంది. ఏ పనులైనా దాదాపుగా ఫోన్ల ద్వారా జరిగిపోతున్నాయి. కీప్యాడ్ ఫోన్ల నుంచి స్మార్ట్ ఫోన్లకు మారుతున్న వారు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. వారికి మార్కెట్లో వివిధ కంపెనీలకు చెందిన స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే యూజర్లకు కావాల్సిన ధరల్లో కూడా ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి, ఫోన్లను తమకు నచ్చిన బడ్జెట్ లో కొనుగోలు చేయడం ఇప్పుడు తేలికైన విషయం. ఎంట్రీ లెవెల్ ఫోన్లు కొనాలని భావించే వారి కోసం […]

The post రూ.8,000 లోపు ధరలో లభించే స్మార్ట్‌ఫోన్లు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చవకైన మన్నికైన ఫోన్లకు మార్కెట్లో మంచి డిమాండ్
  • అందుబాటులో ఉన్న వివిధ కంపెనీల బడ్జెట్ శ్రేణి ఫోన్లు
  • రూ.8 వేల లోపు బడ్జెట్ లో లభించే ఫోన్ల జాబితా మీకోసం

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల కాలం నడుస్తోంది. ఏ పనులైనా దాదాపుగా ఫోన్ల ద్వారా జరిగిపోతున్నాయి. కీప్యాడ్ ఫోన్ల నుంచి స్మార్ట్ ఫోన్లకు మారుతున్న వారు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. వారికి మార్కెట్లో వివిధ కంపెనీలకు చెందిన స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే యూజర్లకు కావాల్సిన ధరల్లో కూడా ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి, ఫోన్లను తమకు నచ్చిన బడ్జెట్ లో కొనుగోలు చేయడం ఇప్పుడు తేలికైన విషయం.

ఎంట్రీ లెవెల్ ఫోన్లు కొనాలని భావించే వారి కోసం రూ.8,000 లోపు ధరలో లభిస్తోన్న ఫోన్ల జాబితాను ఇక్కడ అందిస్తున్నాం. ఒకసారి చెక్ చేయండి. అలాగే మీకు నచ్చిన డివైజ్ ని ఎంచుకునే ప్రయత్నం చేయండి.

రూ.8 వేల లోపు ధరలో లభిస్తోన్న స్మార్ట్‌ఫోన్లు

  • POCO C51
  • Realme Narzo 50i Prime
  • Tecno Spark Go 2023
  • Motorola e13
  • Nokia C12 Pro
  • Samsung M04

POCO C51

ఈ స్మార్ట్ ఫోన్ 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.7249 గా ఉంది. మీడియాటెక్ హీలియో జీ36 చిప్సెట్, 8ఎంపి మెయిన్ కెమెరా, ఆండ్రాయిడ్ 13 గో ఓఎస్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

Realme Narzo 50i Prime

రియల్మీ నార్జో 50ఐ ప్రైమ్ ఫోన్ 3జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.7,664 గా ఉంది. ఈ ఫోన్ లో యూనిసాక్ చిప్సెట్, 8ఎంపి మెయిన్ కెమెరా, 4జీ కనెక్టివిటీ ఉన్నాయి.

Tecno Spark Go 2023

టెక్నో స్పార్క్ గో 2023 స్మార్ట్ ఫోన్ 3జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.7046 గా ఉంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ చిప్, 13ఎంపి మెయిన్ కెమెరా, 4జీ కనెక్టివిటీ ఉన్నాయి.

Motorola e13

మోటోరోలా ఈ13 స్మార్ట్ ఫోన్ 2జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.6,999 గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ లో యూనిసాక్ చిప్, 13ఎంపి ప్రైమరీ కెమెరా, 4జీ కనెక్టివిటీ ఉన్నాయి.

Nokia C12 Pro

నోకియా సీ12 ప్రో స్మార్ట్ ఫోన్ లో 2జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.7,698 గా ఉంది. ఈ ఫోన్ లో ఇంటెల్ చిప్, 8ఎంపి ప్రైమరీ కెమెరా, 4జీ కనెక్టివిటీ ఉన్నాయి.

Samsung Galaxy M04

శాంసంగ్ గెలాక్సీ ఎమ్04 స్మార్ట్ ఫోన్ ధర 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.8,069 గా ఉంది. 8 వేలకు కేవలం రూ.69 మాత్రమే ఎక్కువ ఉన్నందున ఈ ఫోన్ ని కూడా ప్రయత్నించవచ్చు. తక్కువ ధరలో శాంసంగ్ బ్రాండ్ ఫోన్ కావాలని భావించే వారికి ఈ ఫోన్ మంచి ఎంపిక.

The post రూ.8,000 లోపు ధరలో లభించే స్మార్ట్‌ఫోన్లు first appeared on 91Mobiles Telugu.

]]>