Adani Group - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 06 Jan 2023 08:03:45 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 2023 లో 5జీ సేవలను లాంచ్ చేయనున్న Adani Group https://www.91mobiles.com/telugu/adani-group-5g-services-enterprises-2023/ Fri, 06 Jan 2023 08:03:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=4364 హైలైట్స్ ఈ ఏడాది ఎంటర్‌ప్రైజెస్ కి 5జీ సేవలు అందించనున్న అదాని గ్రూప్ ఇదే సంవత్సరంలో కన్జూమర్ అప్లికేషన్స్ ని తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోన్న అదాని గ్రూప్ ఇంకా ఇండస్ట్రియల్ క్లౌడ్ లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతోన్న అదాని గ్రూప్ ఎంటర్‌ప్రైజెస్ కి అదాని గ్రూప్ 5జీ సేవలను అందించేందుకు సిద్ధమవుతోంది. తన డిజిటల్ స్ట్రేటజీలో భాగంగా కన్జూమర్ల కోసం యాప్స్ లాంచ్ చేయబోతున్నట్లు సదరు కంపెనీ వెల్లడించింది. అంటే ఇప్పుడప్పుడే టెలీకామ్ వైపు అడుగులు […]

The post 2023 లో 5జీ సేవలను లాంచ్ చేయనున్న Adani Group first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • ఈ ఏడాది ఎంటర్‌ప్రైజెస్ కి 5జీ సేవలు అందించనున్న అదాని గ్రూప్
  • ఇదే సంవత్సరంలో కన్జూమర్ అప్లికేషన్స్ ని తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోన్న అదాని గ్రూప్
  • ఇంకా ఇండస్ట్రియల్ క్లౌడ్ లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపుతోన్న అదాని గ్రూప్

ఎంటర్‌ప్రైజెస్ కి అదాని గ్రూప్ 5జీ సేవలను అందించేందుకు సిద్ధమవుతోంది. తన డిజిటల్ స్ట్రేటజీలో భాగంగా కన్జూమర్ల కోసం యాప్స్ లాంచ్ చేయబోతున్నట్లు సదరు కంపెనీ వెల్లడించింది. అంటే ఇప్పుడప్పుడే టెలీకామ్ వైపు అడుగులు వేసే అవకాశం లేదని పరోక్షంగా కంపెనీ తెలిపినట్లు అర్థమవుతోంది. ప్రస్తుతం టెలీకామ్ రంగంలో రిలయన్స్ జియో మరియు ఎయిర్టెల్ సంస్థలు అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి.

కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని, గౌతమ్ అదాని తన ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ఏడాది కొన్ని రంగాల్లో తమ కంపెనీ పెట్టుబడులు పెట్టనుందని గౌతమ్ అదాని తెలిపారు. ఇండస్ట్రియల్ క్లౌడ్ కేపబులిటీస్, 5జీ రోలౌట్ సర్వీసెస్, డేటా సెంటర్స్ నెట్వర్క్, బిల్డింగ్ ఏఐ-ఎంఎల్, బీ2సీ యాప్స్ వంటి వాటిలో పెట్టుబడులు పెట్టనున్నట్లు అదాని వెల్లడించారు.

Adani Group 5G స్పెక్ట్రమ్ వివరాలు

అదాని డేటా నెట్వర్క్ 20 గిగాహెర్ట్జ్ మిల్లీమీటర్ బ్యాండ్ లో 400 మెగాహెర్ట్జ్ విలువగల స్పెక్ట్రమ్ ని 20 ఏళ్ళ కాలపరిమితికి గాను కొనుగోలు చేసింది. 5జీ బ్యాండ్స్ కొనుగోలు కోసం అదాని గ్రూప్ రూ.211 కోట్లు వెచ్చించింది. డిజిటల్ ఇన్ఫాస్ట్రక్చర్ పోర్ట్‌ఫోలియోని క్రియేట్ చేసేందుకు అదాని గ్రూప్ స్పెక్ట్రమ్ ని కొనుగోలు చేసింది. యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేయడంలో తమ కంపెనీ స్పెక్ట్రమ్ గా నిలుస్తుందని అదాని గ్రూప్ ప్రకటించింది.

అదాని గ్రూప్ vs ఎయిర్టెల్ vs జియో

ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, అదాని గ్రూప్ యాప్ సెగ్మెంట్ లోకి ప్రవేశించనుంది. అయితే టెలీకామ్ సర్వీసెస్ లోకి వస్తున్నట్లు మాత్రం ప్రకటించలేదు. అయినప్పటికీ ఇప్పటికే మార్కెట్ లో ఉన్న టెలీకామ్ సంస్థలకు అదాని రాక కష్టాలను తేచ్చే అవకాశం ఉంది.

జియో మరియు ఎయిర్టెల్ 5జీ నెట్వర్క్ లో భారీ పెట్టుబడులు పెట్టాయి. ఈ ఏడాది ముగిసే నాటికి 5జీ విస్తరణలో భాగంగా రూ.2 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు జియో ప్రకటించింది.

దేశంలోని 26 నగరాల్లో 5జీ సేవలను లాంచ్ చేసిన జియో, గుజరాత్ లోని 33 జిల్లాల్లో 5జీ సేవలను ప్రారంభించింది. 2023 చివరి కల్లా, దేశం మొత్తం 5జీ నెట్వర్క్ ని విస్తరింపజేయాలని జియో లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు ఎయిర్టెల్ సంస్థ ఇప్పటికే 21 నగరాలకు 5జీ సేవలు అందిస్తోంది. 2024 కల్లా పూర్తి స్థాయిలో దేశ వ్యాప్తంగా 5జీ సేవలను విస్తరింపజేయాలని ఎయిర్టెల్ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇక్కడ అదాని గ్రూప్ యూనిఫైడ్ లైసెన్స్ తీసుకున్న సంగతిని మరిచిపోవద్దు. అంటే, దేశంలో టెలీకామ్ సేవలను అందించేందుకు అదాని గ్రూప్ యాక్సెస్ పొందింది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 2023 లో 5జీ సేవలను లాంచ్ చేయనున్న Adani Group first appeared on 91Mobiles Telugu.

]]>