Aha - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 01 Feb 2023 14:25:32 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Netflix, Aha ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో స్ట్రీమ్ అవుతోన్న 18 Pages https://www.91mobiles.com/telugu/18-pages-film-streaming-on-netflix-aha/ Wed, 01 Feb 2023 14:24:51 +0000 https://www.91mobiles.com/telugu/?p=4739 2022 డిసెంబర్ 23 న 18 Pages సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా నిడివి 137 నిమిషాలు. ఈ చిత్రానికి క్రిటిక్స్ నుంచి మిశ్రమం నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. 16 కోట్ల బడ్జెట్ తో 18 Pages చిత్రం రూపొందింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ.25 కోట్లు వసూలు చేసింది. సినిమా చిత్రీకరణ అప్పుడెప్పుడో 2020 డిసెంబర్ లో మొదలై, కరోనా కారణంగా ఆలస్యంగా పూర్తై, ఇటీవలె థియేటర్లలోకి వచ్చింది. థియెట్రికల్ రన్ […]

The post Netflix, Aha ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో స్ట్రీమ్ అవుతోన్న 18 Pages first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • రెండు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో ప్రసారమవుతోన్న తెలుగు రొమాంటిక్ కామెడీ చిత్రం 18 పేజెస్
  • ఆహా, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీల్లో స్ట్రీమ్ అవుతోన్న సినిమా; 18 పేజెస్ లో ప్రధాన పాత్రలు పోషించిన నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్
  • 2023 జనవరి 27 న ఓటీటీలో విడుదలైన 18 పేజెస్ చిత్రం

2022 డిసెంబర్ 23 న 18 Pages సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా నిడివి 137 నిమిషాలు. ఈ చిత్రానికి క్రిటిక్స్ నుంచి మిశ్రమం నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. 16 కోట్ల బడ్జెట్ తో 18 Pages చిత్రం రూపొందింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ.25 కోట్లు వసూలు చేసింది. సినిమా చిత్రీకరణ అప్పుడెప్పుడో 2020 డిసెంబర్ లో మొదలై, కరోనా కారణంగా ఆలస్యంగా పూర్తై, ఇటీవలె థియేటర్లలోకి వచ్చింది.

థియెట్రికల్ రన్ ముగించుకున్న 18 Pages చిత్రం విడుదలైన నెల రోజులకు డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. 2023 జనవరి 27 న ఈ సినిమా ఓటీటీలో విడుదలైంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ మరియు ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో 18 Pages చిత్రం ప్రసారమవుతోంది.

18 Pages సినిమా ఓటీటీ హక్కులను రెండు ప్రముఖ ఓటీటీ సైట్స్ దక్కించుకున్నాయి. 18 Pages చిత్రం నెట్‌ఫ్లిక్స్, ఆహా ఓటీటీల్లో స్ట్రీమ్ అవుతోంది. జనవరి 27, 2023 నుంచి రెండు ప్లాట్ఫామ్స్ లో 18 Pages ప్రసారమవుతోంది.

18 Pages నటీనటులు, సాంకేతిక బృందం

ఈ రొమాంటిక్ కామెడీకి ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథను సమకూర్చారు. పల్నాటి సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. బన్నీ వాస్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాడు. సుకుమార్ రైటింగ్స్ మరియు జీఏ2 పిక్చర్స్ బ్యానర్స్ పై సినిమా రూపొందింది. నిఖిల్ సిద్ధార్థ, అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు.

దినేశ్ తేజ్, అజయ్, సరయు రాయ్, రాజ్ తీరందాస్, మౌనికా రెడ్డి, గోల్డీ నిస్సీ, బ్రహ్మాజీ, పోసాని కృష్ణ మురళి ఈ చిత్రంలో ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. అల్లు అరవింద్ ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించారు.

18 Pages చిత్ర కథ

18 Pages చిత్ర కథ సిద్ధు (నిఖిల్ సిద్దార్థ), నందిని (అనుపమ పరమేశ్వరన్) పాత్రల చుట్టూ తిరుగుతుంది. నందిని షార్ట్-టర్మ్ మెమొరీ లాస్ తో బాధపడుతుంటుంది. కాబట్టి, తనకు సంబంధించిన అన్ని విషయాలను గుర్తు పెట్టుకునేందుకై ఒక డైరీని మెయింటైన్ చేస్తుంటుంది. అయితే నందిని తన డైరీని పోగొట్టుకోగా, అది కాస్తా సిద్ధ వద్దకు చేరుతుంది. డైరీని చదవడం ప్రారంభించిన సిద్ధు, మెల్లగా నందినికి ఎట్రాక్ట్ అవుతాడు. ఇక అంతే ఆమె కోసం వెతకడం మొదలెడతాడు. స్టోరీలోని అసలు విషయం డైరీలోని 18 పేజీల్లో దాగి ఉంటుంది. మరి చివరకు సిద్దు, నందిని కలుస్తారా? అనేది చిత్ర మిగతా కథ.

ఎంతో సరదాగా అలాగే ఎమోషనల్ గా సాగే ఈ చిత్రాన్ని మీ కుటుంబ సభ్యులతో కలిసి చూసేయండి. సినిమా చూడాలంటే మీరు నెట్‌ఫ్లిక్స్ లేదా ఆహా సబ్‌స్క్రిప్షన్ ని తీసుకోవాల్సి ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Netflix, Aha ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో స్ట్రీమ్ అవుతోన్న 18 Pages first appeared on 91Mobiles Telugu.

]]>