Alienware m15 R7 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 18 Oct 2022 12:08:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Alienware m15 R7 గేమింగ్ ల్యాప్‌టాప్ ని లాంచ్ చేసిన Dell https://www.91mobiles.com/telugu/dell-launched-alienware-m15-r7-gaming-laptop-in-india/ Tue, 18 Oct 2022 12:02:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=2942 హైలైట్స్ భారత్ లో Alienware m15 R7 గేమింగ్ ల్యాప్ టాప్ ని లాంచ్ చేసిన డెల్ AMD Ryzen 6000 H సిరీస్ ప్రాసెసర్, Nvidia GeForce RTX 30 సిరీస్ జీపీయూ తో లాంచ్ అయిన Alienware m15 R7 గేమింగ్ తో పాటు డెయిలీ టాస్క్స్ చేసుకోడానికి బాగా పని చేసే Alienware m15 R7 Dell కంపెనీ బ్రాండ్ న్యూ Alienware m15 R7 గేమింగ్ ల్యాప్ టాప్ ని భారత్ […]

The post Alienware m15 R7 గేమింగ్ ల్యాప్‌టాప్ ని లాంచ్ చేసిన Dell first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • భారత్ లో Alienware m15 R7 గేమింగ్ ల్యాప్ టాప్ ని లాంచ్ చేసిన డెల్
  • AMD Ryzen 6000 H సిరీస్ ప్రాసెసర్, Nvidia GeForce RTX 30 సిరీస్ జీపీయూ తో లాంచ్ అయిన Alienware m15 R7
  • గేమింగ్ తో పాటు డెయిలీ టాస్క్స్ చేసుకోడానికి బాగా పని చేసే Alienware m15 R7

Dell కంపెనీ బ్రాండ్ న్యూ Alienware m15 R7 గేమింగ్ ల్యాప్ టాప్ ని భారత్ లో లాంచ్ చేసింది. ఈ ప్రీమియమ్ గేమింగ్ ల్యాప్ టాప్ రెండు కన్ఫిగరేషన్స్ లో లభిస్తుంది. అద్భుతమైన పెర్ఫామెన్స్ ని అందించడానికి ఈ రెండు ల్యాప్ టాప్స్ లో పవర్ఫుల్ హార్డ్‌వేర్ ఉన్నాయి. Alienware m15 R7 ల్యాప్ టాప్ లో AMD Ryzen 6000 H సిరీస్ ప్రాసెసర్స్ వాడారు. అలాగే గ్రాఫిక్స్ కోసం Nvidia GeForce RTX 30 సిరీస్ జీపీయూ వినియోగించారు. అలాగే ఈ ల్యాప్ టాప్ క్లీన్ అండ్ స్లీక్ డిజైన్ తో వస్తోంది. గేమర్ ఫోకస్డ్ ఈస్తటిక్స్, పర్-కీ ఆర్జీబీ బ్యాక్‌లిట్ కీబోర్డ్ వంటి ఫీచర్లు ఈ ల్యాప్‌టాప్ లో ఉన్నాయి.

Alienware m15 R7 గేమింగ్ ల్యాప్‌టాప్ స్పెసిఫికేషన్స్, ధర

Alienware m15 R7 గేమింగ్ ల్యాప్‌టాప్ 15.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. ఏఎండీ రైజెన్ 7 6800హెచ్ ప్రాసెసర్, ఎన్విడియా జీఈఫోర్స్ ఆర్టీఎక్స్ 3060 జీపీయూ ఈ ల్యాప్ టాప్ లో ఉన్నాయి. Alienware m15 R7 లో 16జిబి DDR5 ర్యామ్, 512జిబి M.2 PCIe NVMe SSD స్టోరేజీ ఉన్నాయి. Alienware m15 R7 యొక్క మరొక వేరియంట్ లో Nvidia GeForce RTX 3070 Ti GPU మరియు 1TB M.2 PCIe NVMe SSD స్టోరేజీ ఉన్నాయి. మిగతా స్పెసిఫికేషన్స్ అన్నీ ఒకే విధంగా ఉన్నాయి.

Alienware m15 R7 గేమింగ్ ల్యాప్ టాప్ స్మూథ్ గేమ్ ప్లే అనుభూతిని అందించేందుకు Nvidia G-Sync మరియు Advanced Optimus టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. ఇవే కాకుండా, ఈ ల్యాప్ టాప్ లో డాల్బి విజన్, డాల్బి అట్మాస్ సపోర్ట్ ఉన్నాయి. ఈ ల్యాప్ టాప్ లో పర్-కీ ఆర్జీబీ ఏలియన్ఎఫ్ఎక్స్ బ్యాక్‌లిట్ కీబోర్డ్ ఉంది. ఏలియన్ కమాండ్ సెంటర్ ద్వారా ఈ కీబోర్డ్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు. థర్మల్స్ విషయానికి వస్తే, Alienware m15 R7 Cryo-Tech కూలింగ్ టెక్నాలజీతో వస్తోంది. ఇది మీరు చేసే పనిని బట్టి పవర్ సెట్టింగ్స్ ని అడ్జస్ట్ చేస్తూ పర్ఫామెన్స్ ని ఆప్టిమైజ్ చేస్తుంది.

ఇప్పుడే ఎవాల్స్ అవుతోన్న ఇండియన్ గేమింగ్ కమ్యూనిటీ కోసం Alienware m15 R7 గేమింగ్ ల్యాప్ టాప్ ని తీసుకొచ్చామని డెల్ కంపెనీ ప్రొడక్ట్-మార్కెటింగ్ ఇండియా కన్జూమర్ డైరెక్టర్ పుజన్ చడా చెప్పారు. ప్రీమియమ్ క్వాలిటీ, ఐకానిక్ డిజైన్, హై పెర్ఫామెన్స్ కలిగిన పవర్ఫుల్ గేమింగ్ ల్యాప్ టాప్స్ ని భవిష్యత్తులో మరిన్ని తీసుకొస్తామని పుజన్ తెలిపారు.

Alienware m15 R7 గేమింగ్ ల్యాప్ టాప్ యొక్క Nvidia GeForce RTX 3060 GPU మరియు 512GB SSD వేరియంట్ ధర రూ.1,59,990 గా ఉంది. ఇకపోతే, Nvidia GeForce RTX 3070 Ti GPU మరియు 1TB SSD వేరియంట్ ధర రూ.1,99,990 గా ఉంది. Alienware m15 R7 గేమింగ్ ల్యాప్ టాప్ డెల్ ఆన్‌లైన్ స్టోర్ తో పాటు, డెల్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్, ఇతర ఔట్‌లెట్స్ ద్వారా లభ్యమవుతుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Alienware m15 R7 గేమింగ్ ల్యాప్‌టాప్ ని లాంచ్ చేసిన Dell first appeared on 91Mobiles Telugu.

]]>