Allu Arjun - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 15 Sep 2023 14:06:09 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 పుష్ప 2 (Pushpa 2) రిలీజ్‌కి ముందు Disney+ Hotstar లో ఉన్న అల్లు అర్జున్ సినిమాలు చూడండి; లిస్ట్ చెక్ చేయండి! https://www.91mobiles.com/telugu/allu-arjun-movies-on-disney-plus-hotstar/ Fri, 15 Sep 2023 14:00:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=6961 DJ (Duvvada Jagannadham) S/O Satyamurthy Julai Yevadu టాప్ టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మంచి పేరుంది. అలాగే, ఉత్తరాదిన కూడా ఐకన్ స్టార్ కి మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బన్నీ చిత్రాలకు నార్త్ బెల్ట్ లో ఎనలేని క్రేజ్ ఉంది. హిందీలోకి అనువదించబడిన అల్లు అర్జున్ సినిమాలు ఆయనకు అక్కడ అభిమానులు ఏర్పడటంలో కీలక పాత్ర పోషించాయి. ప్యాన్ ఇండియా చిత్రం […]

The post పుష్ప 2 (Pushpa 2) రిలీజ్‌కి ముందు Disney+ Hotstar లో ఉన్న అల్లు అర్జున్ సినిమాలు చూడండి; లిస్ట్ చెక్ చేయండి! first appeared on 91Mobiles Telugu.

]]>

  1. DJ (Duvvada Jagannadham)
  2. S/O Satyamurthy
  3. Julai
  4. Yevadu

టాప్ టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మంచి పేరుంది. అలాగే, ఉత్తరాదిన కూడా ఐకన్ స్టార్ కి మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బన్నీ చిత్రాలకు నార్త్ బెల్ట్ లో ఎనలేని క్రేజ్ ఉంది. హిందీలోకి అనువదించబడిన అల్లు అర్జున్ సినిమాలు ఆయనకు అక్కడ అభిమానులు ఏర్పడటంలో కీలక పాత్ర పోషించాయి.

ప్యాన్ ఇండియా చిత్రం పుష్ప తో అల్లు అర్జున్ ఇటు సౌత్, అటు నార్త్ లో ప్రభంజనం సృష్టించారు. ఉత్తరాది ప్రేక్షకులు పుష్ప చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. ఇక తెలుగు రాష్ట్రాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కేరళ లో బన్నీ స్టార్డమ్ గురించే మరి. ఎందుకుంటే మనోడికి అక్కడ ఆర్య సినిమాతో వచ్చిన క్రేజ్ ఇప్పటికీ అలాగే ఉంది.

అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘పుష్ప 2-ది రూల్’ విడుదల తేదీ వెల్లడైంది. ఈ చిత్రం 2024 ఆగష్టు 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రం రావడం ఇంకా ఆలస్యం అయినప్పటికీ మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అల్లు అర్జున్ యొక్క అనేక యాక్షన్-కామెడీ సినిమాలు OTTలో అందుబాటులో ఉన్నాయి, వీటిని మీరు ఇంట్లో కూర్చొని టీవీలో చూడవచ్చు. ఈ ఆర్టికల్ లో Disney+ Hotstar ఓటీటీ లో ఉన్న అల్లు అర్జున్ సినిమాల జాబితాను అందిస్తున్నాం. ఈ జాబితాలో సినిమాల పేర్లు, వాటి ఐఎండిబి రేటింగ్, నటీనటులు తదితర వివరాలను కూడా ఇస్తున్నాం. ఓసారి చదివేయండి మరి.

డీజే: దువ్వాడ జగన్నాథమ్

దువ్వాడ జగన్నాథమ్ చిత్రంలో ఐకన్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకత్వం వహించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. 2017 జూన్ 23 న ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది.

  • థియెటర్ రిలీజ్: జూన్ 23, 2017
  • ఐఎండిబి రేటింగ్: 5.9/10
  • నటీనటులు: అల్లు అర్జున్, పూజా హెగ్డే
  • ఓటీటీ: డిస్నీ+ హాట్‌స్టార్

S/O సత్యమూర్తి

సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో అల్లు అర్జున్, సమంతా జంటగా నటించారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకం పై ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రసాద్ మూరెళ్ళ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్ గా పని చేశారు.

  • థియెటర్ రిలీజ్: ఏప్రిల్ 8, 2015
  • నటీనటులు: అల్లు అర్జున్, సమంతా
  • ఐఎండిబి రేటింగ్: 7/10
  • ఓటీటీ: డిస్నీ+ హాట్‌స్టార్

జులాయి

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జులాయి చిత్రంలో అల్లు అర్జున్, ఇలియాన ప్రధాన పాత్రలు పోషించారు. సోను సూద్ విలన్ గా చేశారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. చోటా కే నాయుడు, శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫర్లుగా చేశారు.

  • థియెటర్ రిలీజ్: ఆగస్టు 9, 2012
  • నటీనటులు: అల్లు అర్జున్, ఇలియాన
  • ఐఎండిబి రేటింగ్: 7.2/10
  • ఓటీటీ: డిస్నీ+ హాట్‌స్టార్

ఎవడు

ఎవడు చిత్రంలో రామ్ చరణ్, శృతి హాసన్, అమీ జాక్సన్ ప్రధాన పాత్రలు పోషించారు. అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తారు. జయసుధర, సాయి కుమార్, రాహుల్ దేవ్, బ్రహ్మానందం సహాయక పాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి సీ రాంప్రసాద్ సినిమాటోగ్రఫర్ గా చేశారు.

  • థియెటర్ రిలీజ్: జనవరి 14, 2014
  • నటీనటులు: రాం చరణ్, శృతి హాసన్, అల్లు అర్జున్
  • ఐఎండిబి రేటింగ్: 5.8/10
  • ఓటీటీ: డిస్నీ+ హాట్‌స్టార్

The post పుష్ప 2 (Pushpa 2) రిలీజ్‌కి ముందు Disney+ Hotstar లో ఉన్న అల్లు అర్జున్ సినిమాలు చూడండి; లిస్ట్ చెక్ చేయండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Zee5 లో అందుబాటులో ఉన్న అల్లు అర్జున్ సినిమాలు https://www.91mobiles.com/telugu/allu-arjun-movies-on-zee5-ott-platform/ Tue, 22 Nov 2022 12:14:44 +0000 https://www.91mobiles.com/telugu/?p=3584 ఐకన్ స్టార్ అల్లు అర్జున్ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మంచి పేరుంది. మరొక విషయం ఏంటంటే, ఉత్తరాదిన కూడా బన్నీకి మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్టైలిష్ స్టార్ చిత్రాలకు నార్త్ బెల్ట్ లో ఎనలేని క్రేజ్ ఉంది. హిందీలోకి అనువదించబడిన బన్నీ చిత్రాలు ఆయనకు అక్కడ అభిమానులు ఏర్పడటంలో కీలక పాత్ర పోషించాయి. దీంతో ప్యాన్ ఇండియా చిత్రం పుష్ప తో అల్లు అర్జున్ ఇటు సౌత్, అటు నార్త్ […]

The post Zee5 లో అందుబాటులో ఉన్న అల్లు అర్జున్ సినిమాలు first appeared on 91Mobiles Telugu.

]]>

ఐకన్ స్టార్ అల్లు అర్జున్ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మంచి పేరుంది. మరొక విషయం ఏంటంటే, ఉత్తరాదిన కూడా బన్నీకి మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్టైలిష్ స్టార్ చిత్రాలకు నార్త్ బెల్ట్ లో ఎనలేని క్రేజ్ ఉంది. హిందీలోకి అనువదించబడిన బన్నీ చిత్రాలు ఆయనకు అక్కడ అభిమానులు ఏర్పడటంలో కీలక పాత్ర పోషించాయి. దీంతో ప్యాన్ ఇండియా చిత్రం పుష్ప తో అల్లు అర్జున్ ఇటు సౌత్, అటు నార్త్ లో ప్రభంజనం సృష్టించారు. ఉత్తరాది ప్రేక్షకులు పుష్ప చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. ఇక తెలుగు రాష్ట్రాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కేరళ లో బన్నీ స్టార్డమ్ గురించే మరి. ఎందుకుంటే మనోడికి అక్కడ ఆర్య సినిమాతో వచ్చిన క్రేజ్ ఇప్పటికీ అలాగే ఉంది.

సరే, ప్రస్తుతం మ్యాటర్ లోకి వద్దాం. ఇటీవలి కాలంలో ఓటీటీ లు జనాలకు అమితమైన వినోదాన్ని పంచుతున్నాయి. తమ అభిమాన నటుల చిత్రాలను ఇంట్లో కూర్చొని తమకు కవాల్సినప్పుడల్లా ఓటీటీ లో చూస్తూ ఎంజాయ్ చేయడం కామన్ అయిపోయింది. మరి ZEE5 ఓటీటీలో అందుబాటులో ఉన్న అల్లు అర్జున్ చిత్రాలేంటో తెలుసుకుందాం పదండి.

ZEE5 లో అల్లు అర్జున్ సినిమాలు ఇవే

  •  నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా
  •  Dj దువ్వాడ జగన్నాథమ్
  •  ఇద్దరమ్మాయిలతో

 

1. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా (2018)

అనుమానమే అక్కర్లేదు. ఇది కచ్చితంగా అల్లు అర్జున్ నటించిన ఉత్తమ చిత్రాల్లో ఒకటి. ఆవేశంలో ఊగిపోయే జవాను పాత్రలో అల్లు అర్జున్ నటన అద్భుతమని చెప్పాలి. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయింది. కానీ, ఈ చిత్రంలో అల్లు అర్జున్ నటనకు వందకు వంద మార్కులు పడ్డాయి. సినిమా కోసం అల్లు అర్జున్ తనని తాను పూర్తిగా సోల్జర్ గా మార్చుకున్న తీరు ఎక్స్‌లెంట్ అని చెప్పాలి. వెండితెరపై చూస్తుంటే, నిజంగా ఒక సైనికుడే కనిపిస్తాడు. అంతలా బన్నీ తన పాత్రలో జీవించారు. ఎవరి సంగతి ఎలా ఉన్నా బన్నీ అభిమానులు మాత్రం కచ్చితంగా ఈ సినిమా చూడాల్సిందే. జీ5 లో అందుబాటులో ఉన్న ఈ చిత్రాన్ని ఓసారి చూసేయండి మరి.

2. Dj- దువ్వాడ జగన్నాథమ్ (2017)

ఈ చిత్రంలో అల్లు అర్జున్ స్టైలిష్ లుక్ లో ఉండే రోల్ తో పాటు, బ్రాహ్మణుడి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. దువ్వాడ జగన్నాథం శాస్త్రి అనే వంటవాడి పాత్రలో కనిపిస్తూ హాస్యాన్ని పంచిన బన్నీ, మరోవైపు డీజే అనే పేరుతో స్టైలిష్ గా కనిపిస్తూ విలన్స్ ని మట్టుపెడుతుంటారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే కథానాయికగా చేసింది. రొయ్యల నాయుడిగా విలన్ పాత్రలో రావు రమేశ్ మెప్పించారు. ఈ చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకుడు. దువ్వాడ జగన్నాథం చిత్రం జీ5 లో అందుబాటులో ఉంది.

3. ఇద్దరమ్మాయిలతో (2013)

డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇద్దరమ్మాయిలతో చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఎంతో స్టైలిష్ గా కనిపించారు. ప్రత్యేకించి ఫైట్స్ ఎంతో స్టైలిష్ గా తెరకెక్కించారు. బన్నీ కూడా తనదైన శైలిలో పోరాట సన్నివేశాల్లో నటించి మెప్పించారు. ఈ చిత్రంలో సంజు రెడ్డి అనే గిటారిస్ట్ గా అల్లు అర్జున్ నటించారు. ఈ సినిమాలో అమలా పాల్, కేథరిన్ ట్రెసా కథానాయికలుగా చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం జీ5 లో అందుబాటులో ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Zee5 లో అందుబాటులో ఉన్న అల్లు అర్జున్ సినిమాలు first appeared on 91Mobiles Telugu.

]]>