Amazfit Band 7 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 03 Nov 2022 11:35:52 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 1.47-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 18 డేస్ బ్యాటరీ లైఫ్ తో వస్తోన్న Amazfit Band 7 https://www.91mobiles.com/telugu/amazfit-band-7-india-launch-teased-amazon/ Thu, 03 Nov 2022 11:31:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=3222 హైలైట్స్ 50 కి పైగా వాచ్ ఫేసెస్ తో వస్తోన్న Amazfit Band 7 అమోలెడ్ డిస్ప్లే, 18 డేస్ బ్యాటరీ లైఫ్, 120 బిల్ట్-ఇన్ స్పోర్ట్స్ మోడ్స్ ఈ బ్యాండ్ ప్రధాన ఫీచర్లు అమెజాన్ ఇండియా వెబ్ సైట్ లో కనిపించిన Amazfit Band 7 మైక్రో సైట్ Amazfit బ్రాండ్ త్వరలో Amazfit Band 7 ని లాంచ్ చేయబోతోంది. అమెజాన్ ఇండియా వెబ్ సైట్ లో Amazfit Band 7 కి సంబంధించిన […]

The post 1.47-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 18 డేస్ బ్యాటరీ లైఫ్ తో వస్తోన్న Amazfit Band 7 first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • 50 కి పైగా వాచ్ ఫేసెస్ తో వస్తోన్న Amazfit Band 7
  • అమోలెడ్ డిస్ప్లే, 18 డేస్ బ్యాటరీ లైఫ్, 120 బిల్ట్-ఇన్ స్పోర్ట్స్ మోడ్స్ ఈ బ్యాండ్ ప్రధాన ఫీచర్లు
  • అమెజాన్ ఇండియా వెబ్ సైట్ లో కనిపించిన Amazfit Band 7 మైక్రో సైట్

Amazfit బ్రాండ్ త్వరలో Amazfit Band 7 ని లాంచ్ చేయబోతోంది. అమెజాన్ ఇండియా వెబ్ సైట్ లో Amazfit Band 7 కి సంబంధించిన మైక్రో సైట్ దర్శనమిస్తోంది. దీంతో అతి త్వరలో ఈ ఫిట్నెస్ ట్రాకర్ లాంచ్ అవ్వనుందని స్పష్టత వచ్చింది. Amazfit Band 7 అమోలెడ్ డిస్ప్లే, 50 కి పైగా ప్రీ-లోడెడ్ వాచ్ ఫేసెస్ తో వస్తోంది.

Amazfit Band 7 ఫిట్నెస్ ట్రాకర్ 18 రోజుల బ్యాటరీ లైఫ్ ని ఆఫర్ చేస్తోంది. Zepp OS పై ఈ ట్రాకర్ పని చేయనుంది. Amazfit Band 7 120 స్పోర్ట్స్ మోడ్స్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే అమెజాన్ అలెక్సా సపోర్ట్ కూడా ఇందులో ఉంది. Amazfit Band 7 యొక్క ధర, స్పెసిఫికేషన్స్, ఫీచర్ల వివరాలు తెలుసుకుందాం పదండి.

Amazfit Band 7 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

Amazfit Band 7 లో 1.47-రెక్టాంగ్యులర్ డిస్ప్లే ప్యానెల్ ఉంది. ఈ ప్యానెల్ గత మోడల్ కంటే 112 శాతం పెద్దది. ఈ 2.5డీ అమోలెడ్ డిస్ప్లే 198*368 పిక్సెల్ రెజుల్యూషన్, 282 పిక్సెల్ పర్ ఇంచ్ డెన్సిటీ కలిగి ఉంది. ఈ ఫిట్నెస్ ట్రాకర్ 50 కి పైగా వాచ్ ఫేసెస్ తో వస్తోంది. ఇందులో 8 వాచ్ ఫేసెస్ ని ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది. ఈ బ్యాండ్ లో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫంక్షనాలిటీ కూడా ఉంది.

Amazfit Band 7 లో ఆప్టికల్ హార్ట్ రేట్ మానిటర్, బ్లడ్ ఆక్సిజన్ సెన్సర్, మోషన్ సెన్సర్ వంటి పీచర్లు ఉన్నాయి. ఈ సెన్సర్స్ సాయంతో హార్ట్ రేట్ ట్రాకింగ్, నిరవధిక బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్, స్ట్రెస్ లెవెల్ మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్, స్టెప్స్ ట్రాకింగ్, ఫీమేల్ హెల్త్ ట్రాకింగ్ తదితర సమాచారం సేకరించి యూజర్ కి అందిస్తుంది.

Amazfit Band 7 ఫిట్నెస్ ట్రాకర్ 120 వర్కవుట్ మోడ్స్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే వాకింగ్, రన్నింగ్, ఎలిప్టికల్ మరియు రో మెషీన్ యాక్టివిటీస్ వంటి వాటిని ఆటో డిటెక్ట్ చేస్తుంది. కంపెనీ యొక్క ప్రాప్రెటరీ ఆల్గరిథమ్ వల్లన ఇదంతా సాధ్యమవుతుంది. Amazfit Band 7 పీక్‌బీట్స్, ఎక్సర్‌సెన్స్, సోమ్నస్‌కేర్ ఆల్గరిథమ్ వంటి వాటితో ఎక్విప్ అయి ఉంది. వీటిని ప్రత్యేకంగా అమేజ్‌ఫిట్ కంపెనీ డెవలప్ చేసింది.

Amazfit Band 7 232 ఎంఏహెచ్ బ్యాటరీ యూనిట్ ని కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీ సింగిల్ చార్జ్ పై 18 రోజుల పాటు నడుస్తుందని కంపెనీ చెబుతోంది. హెవీగా వాడితే 12 రోజుల బ్యాటరీ లైఫ్ వస్తుందని మైక్రో సైట్ లో చెప్పబడింది. Amazfit Band 7 బ్యాటరీ సేవర్ మోడ్ పై 28 రోజుల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.

Amazfit Band 7 లో బ్లూటూత్ 5.2 కనెక్టివిటీ ఆప్షన్ ఉంది. ఆండ్రాయిడ్ 7.0 మరియు ఐఓఎస్ 12.0 ఆపైన ఓఎస్ లపై నడిచే స్మార్ట్ ఫోన్స్ తో ఈ బ్యాండ్ బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అవుతుంది. Zepp OS పై Amazfit Band 7 బ్యాండ్ పని చేస్తుంది. ఈ ఓఎస్ 10 మినీ యాప్స్ ని ఆఫర్ చేస్తోంది. 5ATM వాటర్ రెసిస్టంట్ రేటింగ్ వల్లన ఈ బ్యాండ్ 50 మీటర్ల లోతైన నీటిలో కూడా పని చేస్తుంది.

Amazfit Band 7 ఫిట్నెస్ ట్రాకర్ 42.33 మిల్లీ మీటర్ల పొడవు, 24.36 మిల్లీ మీటర్ల వెడల్పు, 12.2 మిల్లీ మీటర్ల వెడల్పు, 28 గ్రాముల బరువు ఉంటుంది. స్ట్రాప్స్ ని మార్చుకునే అవకాశం ఉంది. స్ట్రాప్స్ బ్లాక్, పింక్, బీజ్, గ్రీన్, బ్లూ మరియు ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తాయి.

భారత్ లో Amazfit Band 7 ధర (అంచనా)

Amazfit Band 7 ధర 49.99 డాలర్లు (సుమారు రూ.4125) గా ఉండనుంది. భారత మార్కెట్ లో Amazfit Band 7 ధరను రూ.4,000 గా పెట్టే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 1.47-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 18 డేస్ బ్యాటరీ లైఫ్ తో వస్తోన్న Amazfit Band 7 first appeared on 91Mobiles Telugu.

]]>