Amazon Great Indian Festival 2024 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 20 Sep 2024 05:52:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 iPhone 13: కేవలం రూ.39,999 కే ఐఫోన్ 13.. ఎప్పుడు, ఎక్కడ కొనాలో తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/iphone-13-is-available-for-rs-39999-know-when-and-where-to-buy/ https://www.91mobiles.com/telugu/iphone-13-is-available-for-rs-39999-know-when-and-where-to-buy/#respond Fri, 20 Sep 2024 05:33:17 +0000 https://www.91mobiles.com/telugu/?p=13636 ఆపిల్ ఐఫోన్ కొనాలని, వాడాలని ఎక్కువ శాతం మొబైల్ లవర్స్ కి ఉంటుంది. అయితే ధరలు అందుబాటులో లేక నిరాశ చెందుతుంటారు. కానీ, ఏడాదికి ఓసారి వచ్చే అమెజాన్ గ్రేట్ ఇండియల్ ఫెస్టివల్ సేల్ లో iPhone 13 ఎంతో చవకగా దొరకనుంది. Apple iPhone 13 ధర సేల్ లో కేవలం రూ.39,999 లభించనుంది. పూర్తి వివరాలు తెలుసుకోండి. iPhone 13 డీల్ ఎలా పొందాలి? ప్రస్తుతం, ఈ-కామర్స్ వేదిక అమెజాన్ లో iPhone 13 […]

The post iPhone 13: కేవలం రూ.39,999 కే ఐఫోన్ 13.. ఎప్పుడు, ఎక్కడ కొనాలో తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చవకగా దొరుకుతోన్న iPhone 13
  • ఎక్కడ: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్
  • ఎప్పుడు: సెప్టెంబర్ 27 నుంచి, ప్రైమ్: సెప్టెంబర్ 26

ఆపిల్ ఐఫోన్ కొనాలని, వాడాలని ఎక్కువ శాతం మొబైల్ లవర్స్ కి ఉంటుంది. అయితే ధరలు అందుబాటులో లేక నిరాశ చెందుతుంటారు. కానీ, ఏడాదికి ఓసారి వచ్చే అమెజాన్ గ్రేట్ ఇండియల్ ఫెస్టివల్ సేల్ లో iPhone 13 ఎంతో చవకగా దొరకనుంది. Apple iPhone 13 ధర సేల్ లో కేవలం రూ.39,999 లభించనుంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

iPhone 13 డీల్ ఎలా పొందాలి?

ప్రస్తుతం, ఈ-కామర్స్ వేదిక అమెజాన్ లో iPhone 13 128జిబి బ్లూ కలర్ వేరియంట్ ధర రూ.48,900 గా ఉంది. సేల్ సమయంలో, రూ.10,000 అదనపు డిస్కౌంట్ కూడా లభించనుంది. సేల్ లో ఈ ధరను రూ.45,999 గా లిస్ట్ చేయనున్నారు. ఎస్బీఐ కార్డులతో పేమెంట్ చేస్తే, రూ.2,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇది కాకుండా, అదనంగా ఎక్స్‌చేంజ్ డిస్కౌంట్ రూ.3,500 లభించనుంది. ఈ ఆఫర్లు అన్నీ కలిపితే, iPhone 13 ని రూ.39,999 కే సొంతం చేసుకోవచ్చు.

 

iPhone 13 ని ఇప్పుడు కొనవచ్చా?

2022 లో iPhone 13 భారత్ లో లాంచ్ అయ్యింది. 2028 వరకు ఈ ఫోన్‌కి సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ లభిస్తాయి. ఫోన్ పాత మోడల్ అయినప్పటికీ, కొత్త ఐఓఎస్ ఫీచర్లు, సెక్యూరిటీ ప్యాచెస్ వచ్చే కొన్నేళ్ళ పాటు లభిస్తాయి.

లేటెస్ట్ ఐఫోన్ 16 తో పోల్చితే, iPhone 13 ప్రాసెసర్, కెమెరా తక్కువ శక్తివంతమైనవి. అలాగే డిజైన్ కూడా ఔట్‌డేటెడ్. ఇక బ్యాటరీ సైజ్ చాలా చిన్నది. అయినప్పటికీ, iPhone 13 మంచి ఐఫోన్ అనుభూతిని అందించగలదు. ప్రత్యేకించి రూ.50,000 లోపు బడ్జెట్ లో మీకు ఐఫోన్ కావాలంటే iPhone 13 బెస్ట్ ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది.

మీకు ఇదే బడ్జెట్ లో ఆండ్రాయిడ్ ఫోన్ కావాలంటే, ప్రస్తుతం Galaxy S23 5G రూ.50,000 లోపు లభిస్తోంది. ఇది తక్కువ ధరలో శక్తివంతమైన హార్డ్‌వేర్ కలిగి ఉంది.

iPhone 13 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: iPhone 13 లో 6.1-ఇంచ్ స్క్రీన్, 2532*1170 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఓఎల్ఈడీ ప్యానెల్, సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ స్క్రీన్, 460 పీపీఐ, 800 నిట్స్ బ్రైట్నెస్, 2000000:1 కాంట్రాస్ట్ రేషియో ఉన్నాయి.

ప్రాసెసర్: iPhone 13 డివైజ్ ఏ15 బయోనిక్ చిప్ తో లాంచ్ అయ్యింది. ఇది 16-కోర్ న్యూరల్ ఇంజిన్ ప్రాసెసర్. ఇందులో 4 కోర్ జీపీయూ, 6 కోర్ సీపీయూ ఉన్నాయి.

ర్యామ్, స్టోరేజీ: iPhone 13 డివైజ్ 128జిబి నుంచి 512జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.

కెమెరా: iPhone 13 స్మార్ట్‌ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో బ్యాక్ ప్యానెల్ పై 12ఎంపి మెయిన్ కెమెరా, 12ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. ట్రూ టోన్ ఫ్లాష్ ను బ్యాక్ ప్యానెల్ పై అందించారు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 12ఎంపి ట్రూ డెప్త్ కెమెరా ఇచ్చారు. దీని అపర్చర్ ఎఫ్/2.2.

బ్యాటరీ: iPhone 13 లో పవర్ బ్యాకప్ కోసం 3,227 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 19 గంటల వీడియో ప్లేబ్యాక్, 75 గంటల ఆడియో ప్లేబ్యాక్ అందిస్తుంది. 20 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 15 వాట్ మ్యాగ్‌సేఫ్ వైర్లెస్ మరియు 7.5 వాట్ క్యూఐ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post iPhone 13: కేవలం రూ.39,999 కే ఐఫోన్ 13.. ఎప్పుడు, ఎక్కడ కొనాలో తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/iphone-13-is-available-for-rs-39999-know-when-and-where-to-buy/feed/ 0