Amazon Great Republic Day Sale 2024 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Sun, 14 Jan 2024 09:40:37 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Honor 90 5G: హానర్ 90 5జీ పై భారీ డిస్కౌంట్; వివరాలు తెలుసుకోండి! https://www.91mobiles.com/telugu/honor-90-5g-gets-huge-discount-know-the-details/ Sun, 14 Jan 2024 09:40:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=9723 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Honor కొన్ని నెలల క్రితం భారతీయ మార్కెట్ లో Honor 90 5G ఫోన్ తో రీఎంట్రీ ఇచ్చింది. Honor 90 5G డివైజ్ భారత్ లో రూ.37,999 ధరతో లాంచ్ అయ్యింది. లాంచ్ సమయం నుంచి ఈ ఫోన్ పై హానర్ సంస్థ పలుమార్లు డిస్కౌంట్ ని ఆఫర్ చేస్తూ వస్తోంది. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్ ధర మరోసారి పడిపోయింది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ లో భాగంగా […]

The post Honor 90 5G: హానర్ 90 5జీ పై భారీ డిస్కౌంట్; వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • తక్కువ ధరకి లభిస్తోన్న Honor 90 5G
  • అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ డీల్
  • 200ఎంపి కెమెరాతో వచ్చిన డివైజ్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Honor కొన్ని నెలల క్రితం భారతీయ మార్కెట్ లో Honor 90 5G ఫోన్ తో రీఎంట్రీ ఇచ్చింది. Honor 90 5G డివైజ్ భారత్ లో రూ.37,999 ధరతో లాంచ్ అయ్యింది. లాంచ్ సమయం నుంచి ఈ ఫోన్ పై హానర్ సంస్థ పలుమార్లు డిస్కౌంట్ ని ఆఫర్ చేస్తూ వస్తోంది. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్ ధర మరోసారి పడిపోయింది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ లో భాగంగా Honor 90 5G డివైజ్‌ అన్ని ఆఫర్లతో కలుపుకుని రూ.20,000 కంటే తక్కువ ధరకే లభిస్తోంది. ఓసారి ఆ వివరాలను తెలుసుకుందాం.

Honor 90 5G పై భారీ డిస్కౌంట్

  • అమెజాన్ తీసుకొచ్చిన గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ లో భాగంగా Honor 90 5G స్మార్ట్ ఫోన్ చాలా తక్కువ ధరకి లభిస్తోంది. క్రింద అందించిన ఆఫర్ వివరాలు తెలుసుకోండి.
  • Honor 90 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర డిస్కౌంట్ తర్వాత రూ.28,999 గా ఉంది.
  • Honor 90 5G 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర డిస్కౌంట్ తర్వాత రూ.30,999 గా ఉంది.
  • అంతేకాదు, దీనికి తోడు అమెజాన్ Honor 90 5G పై రూ.6,000 కూపన్ డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో ఫోన్ ధరలు వరుసగా రూ.22,999 మరియు రూ.24,999 గా ఉంది.
  • ఎస్బీఐ యూజర్లు క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ద్వారా రూ.3,750 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో ఫోన్ బేస్ వేరియంట్ ధర రూ.19,249 కి చేరుతుంది.
  • Honor 90 5G బాక్స్ లో ఛార్జర్‌ని హానర్ ప్రొవైడ్ చేయడం లేదు. కానీ, 30 వాట్ అడాప్టర్ ని అమెజాన్ ద్వారా హానర్ సంస్థ ఉచితంగా అందిస్తోంది.
  • Honor 90 5G డివైజ్ దీపావళి సీజన్ తర్వాత రెండో భారీ డిస్కౌంట్ తో యూజర్ల ముందుకు వచ్చింది. కానీ, మొదటిసారిగా రూ.20,000 లోపు ధరతో లభిస్తోంది.
  • Honor 90 5G డివైజ్ అందిస్తోన్న ఫీచర్లను గమనిస్తే, ఈ ధర సరైనదేననిపిస్తోంది. ఓసారి Honor 90 5G యొక్క స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Honor 90 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Honor 90 5G లో 6.7-ఇంచ్ 1.5కే క్వాడ్-కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 3840 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ టెక్నాలజీ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Honor 90 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Honor 90 5G డివైజ్ 8జిబి/12జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి/512జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Honor 90 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 200ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్/మ్యాక్రో లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ, చార్జింగ్: Honor 90 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 66 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Honor 90 5G ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 7.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కలర్స్: Honor 90 5G స్మార్ట్‌ఫోన్ డైమండ్ సిల్వర్, ఎమరాల్డ్ గ్రీన్ మరియు మిడ్నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

The post Honor 90 5G: హానర్ 90 5జీ పై భారీ డిస్కౌంట్; వివరాలు తెలుసుకోండి! first appeared on 91Mobiles Telugu.

]]>