Amazon Prime Day Sale 2024 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 02 Jul 2024 17:40:39 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Amazon Prime Day Sale 2024: ప్రైమ్ డే సేల్ తేదీలు ఇవే! https://www.91mobiles.com/telugu/amazon-prime-day-sale-2024-dates-details/ https://www.91mobiles.com/telugu/amazon-prime-day-sale-2024-dates-details/#respond Tue, 02 Jul 2024 17:40:39 +0000 https://www.91mobiles.com/telugu/?p=12337 ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ Amazon తాజాగా ప్రైమ్ డే సేల్ ప్రకటించింది. ఇది 8వ సేల్ కావడం విశేషం. 2024 జులై 20, జులై 21 తేదీల్లో ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రైమ్ మెంబర్స్ కోసం ఎక్స్‌క్లూజివ్ డీల్స్, కొత్త ఉత్పత్తులు, ఎన్నో ఎంటర్టెయిన్మెంట్ ఆఫర్స్‌ను ప్రైమ్ డే సేల్ తీసుకొచ్చింది. Amazon Prime Day Sale డీల్స్, లాంచె‌స్ ఈ ఏడాది అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో వేల […]

The post Amazon Prime Day Sale 2024: ప్రైమ్ డే సేల్ తేదీలు ఇవే! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ప్రైమ్ డే సేల్ ప్రకటించిన అమెజాన్
  • జులై 20 నుంచి జులై 21 వరకు సేల్
  • ప్రొడక్ట్స్‌పై ఆకర్షణీయమైన డీల్స్

ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ Amazon తాజాగా ప్రైమ్ డే సేల్ ప్రకటించింది. ఇది 8వ సేల్ కావడం విశేషం. 2024 జులై 20, జులై 21 తేదీల్లో ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రైమ్ మెంబర్స్ కోసం ఎక్స్‌క్లూజివ్ డీల్స్, కొత్త ఉత్పత్తులు, ఎన్నో ఎంటర్టెయిన్మెంట్ ఆఫర్స్‌ను ప్రైమ్ డే సేల్ తీసుకొచ్చింది.

Amazon Prime Day Sale డీల్స్, లాంచె‌స్

ఈ ఏడాది అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో వేల కొలది కొత్త ఉత్పత్తులు కొనుగోలుకి అందుబాటులో ఉంటాయి. వీటిలో భారత్ తో పాటు గ్లోబల్ బ్రాండ్స్ కూడా ఉంటాయి. వీటిలో ఇంటెల్, శాంసంగ్, వన్‌ప్లస్, హానర్ వంటివి ఉన్నాయి. చిన్న, మధ్యతరహా వ్యాపారులు కూడా ఈ సేల్ లో పాలుపంచుకోనున్నారు. హోమ్ అండ్ కిచెన్, ఫ్యాషన్, గ్రూమింగ్, మరియు జువెల్లరీ వంటి విభాగాల్లోని వివిధ కొత్త ఉత్పత్తులపై ఆఫర్లు అందించనున్నారు.

ఈ ఏడాది ముఖ్యమైన ప్రధానాంశమేంటంటే, ప్రైమ్ వీడియో 5 భాషలకు చెందిన 14 కొత్త సిరీస్‌లు మరియు సినిమాలను ప్రీమియర్ వేయనుంది. వీటిలో మిర్జాపూర్ మూడో సీజన్, ది బాయ్స్ నాల్గో సీజన్ ఉన్నాయి.

ఎకో స్మార్ట్ స్పీకర్స్, ఫైర్ టీవీ స్టిక్స్ తదితర ఉత్పత్తులపై ఎన్నో డిస్కౌంట్లను అమెజాన్ అందిస్తోంది.

బ్యాంక్ ఆఫర్లు

అన్ని ప్రధాన బ్యాంకులతో కూడా అమెజాన్ జత కట్టింది. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ కార్డ్స్ లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. అదనంగా, ప్రైమ్ మెంబర్స్ కి మిలియన్ల కొలదీ ఉత్పత్తలపై ఫాస్ట్ డెలివరీ ఆప్షన్స్, సేమ్-డే, నెక్స్ట్-డే డెలివరీ ఆప్షన్స్ కూడా లభిస్తాయి.

The post Amazon Prime Day Sale 2024: ప్రైమ్ డే సేల్ తేదీలు ఇవే! first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/amazon-prime-day-sale-2024-dates-details/feed/ 0