Andhra Pradesh - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 09 Mar 2023 13:56:08 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు నగరాల్లో అందుబాటులోకి వచ్చిన Jio 5G https://www.91mobiles.com/telugu/jio-true-5g-launched-andhrapradesh-4-cities/ Tue, 27 Dec 2022 12:08:06 +0000 https://www.91mobiles.com/telugu/?p=4197 హైలైట్స్ ప్రస్తుతం ఏపీలో అందుబాటులో ఉన్న Jio 5G Welcome Offer ఆంధ్రప్రదేశ్ లోని 4 నగరాల్లో అందుబాటులోకి వచ్చిన జియో 5జీ సేవలు త్వరలోనే ఇతర నగరాలకు, పట్టణాలకు విస్తరించనున్న జియో 5జీ నెట్వర్క్ రిలయన్స్ జియో సంస్థ ఆంధ్రప్రదేశ్ లో 5జీ సేవలను లాంచ్ చేసింది. డిసెంబర్ 26 నుంచి అనగా సోమవారం నుంచి జియో 5జీ వెల్కమ్ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. ఇకపోతే జియో 5జీ సేవలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని 4 […]

The post ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు నగరాల్లో అందుబాటులోకి వచ్చిన Jio 5G first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • ప్రస్తుతం ఏపీలో అందుబాటులో ఉన్న Jio 5G Welcome Offer
  • ఆంధ్రప్రదేశ్ లోని 4 నగరాల్లో అందుబాటులోకి వచ్చిన జియో 5జీ సేవలు
  • త్వరలోనే ఇతర నగరాలకు, పట్టణాలకు విస్తరించనున్న జియో 5జీ నెట్వర్క్

రిలయన్స్ జియో సంస్థ ఆంధ్రప్రదేశ్ లో 5జీ సేవలను లాంచ్ చేసింది. డిసెంబర్ 26 నుంచి అనగా సోమవారం నుంచి జియో 5జీ వెల్కమ్ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. ఇకపోతే జియో 5జీ సేవలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని 4 నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. అవి: తిరుమల, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు.

అయితే రానున్న రోజుల్లో జియో 5జీ సేవలు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించనున్నాయి. ఇదిలా ఉండగా, హెల్ట్ కేర్ సెక్టర్ లో జియో 5జీ యొక్క ఆవశ్యకత గురించి జియో కమ్యూనిటీ క్లినిక్ మెడికల్ కిట్ మరియు జియో గ్లాస్ ద్వారా జియో కంపెనీ వివరించింది. 2022 ముగిసే నాటికల్లా ప్రధాన నగరాలకు 5జీ నెట్వర్క్ ని అందించాలని జియో లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే 2023 నాటికల్లా దేశం మొత్తం 5జీ సేవలను విస్తరింపజేయాలని జియో భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో 5జీ సేవల కోసం జియో సంస్థ రూ.6,500 కోట్ల పెట్టుబడి పెట్టింది.

అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ లోని ప్రతీ పట్టణం, గ్రామానికి వచ్చే ఏడాది చివరి కల్లా 5జీ సేవలను అందించాలని జియో లక్ష్యంగా పెట్టుకుంది. కాగా, ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న పలు నగరాల్లో జియో 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆ నగరాల జాబితా ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి చూడండి.

  • ఢిల్లీ
  • ముంబై
  • వారణాసి
  • హైదరాబాద్
  • గురుగ్రామ్
  • బెంగళూరు
  • నొయిడా
  • చెన్నై
  • పుణె
  • నాద్వారా
  • ఘజియాబాద్
  • ఫరిదాబాద్
  • కోల్‌కతా
  • గుజరాత్ లోని 33 జిల్లాలు

Jio 5G వెల్కమ్ ఆఫర్ అంటే ఏంటి?

జియో 5జీ వెల్కమ్ ఆఫర్ గురించి మాట్లాడితే, 5జీ ఫోన్లను వాడుతోన్న జియో కస్టమర్లకు కంపెనీ నుంచి ఉచితంగా 5జిబి డేటా లభిస్తుంది. కస్టమర్లు 1జీబీపీఎస్ వేగంతో 5జిబి డేటాను ఎటువంటి పరిమితులు లేకుండా వాడుకోవచ్చు. దీనికి ఎటువంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ, మీకు జియో 5జీ ఆహ్వానం రావాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఈ వెల్కమ్ ఆఫర్ రాకపోతే, మీరు వెల్కమ్ ఆఫర్ ట్రయల్ ని నమోదు చేసుకుని జియో 5జీ ని అనుభూతి చెందవచ్చు. అది ఎలాగో ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.

ఎట్టకేలకు జియో 5జీ సేవలు ఏపీ రాష్ట్రానికి రావడంతో జియో కస్టమర్లు సంతోషిస్తున్నారు. అయితే ఈ సేవలను వినియోగించుకోవాలంటే కస్టమర్లు కచ్చితంగా 5జీ సామర్థ్యం ఉన్న స్మార్ట్ ఫోన్స్ ని కలిగి ఉండాలి. వెల్కమ్ ఆఫర్ ట్రయల్ యాక్టివేట్ చేసుకుంటే 5జిబి హై-స్పీడ్ డేటా ఉచితంగా లభిస్తుంది. 5జీ అనుభూతి చెందేందుకు ఇదొక మంచి అవకాశం. తర్వాత ఎలాగూ 5జీ రీచార్జ్ ప్లాన్స్ ని టెలీకామ్ కంపెనీలు ప్రవేశపెడతాయనుకోండి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు నగరాల్లో అందుబాటులోకి వచ్చిన Jio 5G first appeared on 91Mobiles Telugu.

]]>