AnTuTu - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Sun, 06 Oct 2024 15:10:36 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Best performing phones: రూ.20,000 లోపు బెస్ట్ పెర్ఫామింగ్ ఫోన్లు [సెప్టెంబర్ 2024] https://www.91mobiles.com/telugu/best-performing-phones-under-20k-september-2024/ https://www.91mobiles.com/telugu/best-performing-phones-under-20k-september-2024/#respond Sun, 06 Oct 2024 15:04:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=13937 తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలు అందించే వాల్యూ ఫర్ మనీ ఫోన్ల కోసం సగటు వినియోగదారుడు వెతుకుతుంటాడు. కొందరికీ, కెమెరా ఫోన్ పై ఇష్టముంటే, మరికొందరికి గేమింగ్ ఫోన్ కొనాలని ఉంటుంది. ఈరోజు మనం ఈ ఆర్టికల్ లో రూ.20,000 లోపు భారత్ లో లభిస్తోన్న బెస్ట్ పెర్ఫామింగ్ ఫోన్లు ఏవో తెలుసుకుందాం. మేం పలు బెంచ్ మార్క్ రిజల్ట్స్ ఆధారంగా అలాగే సొంతంగా కొన్ని టెస్టులను నిర్వహించి, ఏ ఫోన్ సత్తా ఏంటో తెలుసుకునే ప్రయత్నం […]

The post Best performing phones: రూ.20,000 లోపు బెస్ట్ పెర్ఫామింగ్ ఫోన్లు [సెప్టెంబర్ 2024] first appeared on 91Mobiles Telugu.

]]>

తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలు అందించే వాల్యూ ఫర్ మనీ ఫోన్ల కోసం సగటు వినియోగదారుడు వెతుకుతుంటాడు. కొందరికీ, కెమెరా ఫోన్ పై ఇష్టముంటే, మరికొందరికి గేమింగ్ ఫోన్ కొనాలని ఉంటుంది. ఈరోజు మనం ఈ ఆర్టికల్ లో రూ.20,000 లోపు భారత్ లో లభిస్తోన్న బెస్ట్ పెర్ఫామింగ్ ఫోన్లు ఏవో తెలుసుకుందాం. మేం పలు బెంచ్ మార్క్ రిజల్ట్స్ ఆధారంగా అలాగే సొంతంగా కొన్ని టెస్టులను నిర్వహించి, ఏ ఫోన్ సత్తా ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేశాం. ఆ వివరాలను మీకోసం అందిస్తున్నాం. ఓసారి పూర్తిగా చదివి తెలుసుకోండి.

రూ.20,000 లోపు ధరలో బెస్ట్ పెర్ఫామింగ్ ఫోన్లు

స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీ ధర
ఐకూ జెడ్ 9 మార్చి 12, 2024 రూ.19,999
రియల్మీ నార్జో 70 టర్బో సెప్టెంబర్ 9, 2024 రూ.16,999
వివో టీ3 మార్చి 21, 2024 రూ.19,999
ఐకూ జెడ్9ఎస్ ఆగస్టు 21, 2024 రూ.19,999
సీఎంఎఫ్ ఫోన్ 1 జులై 8, 2024 రూ.15,999

 

iQOO Z9

iQOO Z9 స్మార్ట్‌ఫోన్ భారత్ లో మార్చి 12వ తేదీన లాంచ్ అయ్యింది. లాంచ్ ధర రూ.19,999. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ డివైజ్ సాలిడ్ బెంచ్‌మార్క్ స్కోర్స్ కలిగి ఉంది.

బెంచ్‌మార్క్ ప్లాట్ఫామ్ స్కోర్
అంటుటు 7,28,534
గీక్‌బెంచ్ (సింగిల్-కోర్) 1,190
గీక్‌బెంచ్ (మల్టీ-కోర్) 2,681
పీసీమార్క్ (పెర్ఫామెన్స్) 11,218

 

Realme Narzo 70 Turbo

Realme Narzo 70 Turbo స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో సెప్టెంబర్ 9వ తేదీన లాంచ్ అయ్యింది. లాంచ్ ధర రూ.16,999. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్, 12జిబి వరకు ర్యామ్, 256జిబి స్టోరేజీని ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది. వివిధ బెంచ్‌మార్క్ ప్లాట్ఫామ్స్ పై నార్జో 70 టర్బో మంచి ప్రదర్శన కనబరిచింది.

బెంచ్‌మార్క్ ప్లాట్ఫామ్ స్కోర్
అంటుటు 7,26,959
గీక్‌బెంచ్ (సింగిల్-కోర్) 1,052
గీక్‌బెంచ్ (మల్టీ-కోర్) 2,969
పీసీమార్క్ (పెర్ఫామెన్స్) 14,895

 

Vivo T3

Vivo T3 స్మార్ట్‌ఫోన్ భారత్ లో మార్చి 21వ తేదీన రూ.19,999 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ఈ డివైజ్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 5జీ చిప్సెట్, 8జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఉన్నాయి. సాధారణ గేమింగ్ మరియు డే-టు-డే వాడకానికి ఈ ఫోన్ బాగా సరిపోతుంది.

బెంచ్‌మార్క్ ప్లాట్ఫామ్ స్కోర్
అంటుటు 7,15,922
గీక్‌బెంచ్ (సింగిల్-కోర్) 1,177
గీక్‌బెంచ్ (మల్టీ-కోర్) 2,646
పీసీమార్క్ (పెర్ఫామెన్స్) 11,423

 

iQOO Z9s

iQOO Z9s స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో ఆగస్టు 21వ తేదీన రూ.19,999 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్, 12జిబి వరకు ర్యామ్, 256జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. ఓసారి ఈ ఫోన్ యొక్క బెంచ్‌మార్క్ స్కోర్స్ చూద్దాం.

బెంచ్‌మార్క్ ప్లాట్ఫామ్ స్కోర్
అంటుటు 7,02,922
గీక్‌బెంచ్ సింగిల్-కోర్ 1,044
గీక్‌బెంచ్ మల్టీ-కోర్ 3,011
పీసీమార్క్ (పెర్ఫామెన్స్) 10,918

 

CMF Phone 1

CMF Phone 1 స్మార్ట్‌ఫోన్ జులై 8వ తేదీన రూ.15,999 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి. రోజువారీ సాధారణ వాడకానికి, లైట్ గేమింగ్‌కి ఈ ఫోన్ సరిపోతుంది. ఇప్పుడు ఈ ఫోన్ యొక్క బెంచ్‌మార్క్ స్కోర్స్ చూద్దాం.

బెంచ్‌మార్క్ ప్లాట్ఫామ్ స్కోర్
అంటుటు 6,42,187
గీక్‌బెంచ్ (సింగిల్-కోర్) 1,015
గీక్‌బెంచ్ (మల్టీ-కోర్) 2,867
పీసీమార్క్ (పెర్ఫామెన్స్) 11,598

 

The post Best performing phones: రూ.20,000 లోపు బెస్ట్ పెర్ఫామింగ్ ఫోన్లు [సెప్టెంబర్ 2024] first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/best-performing-phones-under-20k-september-2024/feed/ 0
Vivo X100s గీక్‌బెంచ్, అంటుటు స్కోర్స్ https://www.91mobiles.com/telugu/vivo-x100s-geekbench-antutu-scores/ Tue, 30 Apr 2024 09:07:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=11265 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తన X100 సిరీస్ ను మరింత విస్తరించే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే Vivo X100s మరియు Vivo X100 Ultra ఫోన్లు ఈ సిరీస్ లో లాంచ్ కానున్నాయి. అయితే వివో నుంచి ఇంకా అధికార ప్రకటన రాలేదు. తాజాగా Vivo X100s డివైజ్ గీక్‌బెంచ్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. అలాగే అంటుటు స్కోర్ కూడా రివీల్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి. Vivo X100s […]

The post Vivo X100s గీక్‌బెంచ్, అంటుటు స్కోర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo X100s లాంచ్
  • డైమెన్సిటీ 9300+ చిప్సెట్
  • 23,05,267 అంటుటు స్కోర్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తన X100 సిరీస్ ను మరింత విస్తరించే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే Vivo X100s మరియు Vivo X100 Ultra ఫోన్లు ఈ సిరీస్ లో లాంచ్ కానున్నాయి. అయితే వివో నుంచి ఇంకా అధికార ప్రకటన రాలేదు. తాజాగా Vivo X100s డివైజ్ గీక్‌బెంచ్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. అలాగే అంటుటు స్కోర్ కూడా రివీల్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo X100s గీక్‌బెంచ్ మరియు అంటుటు స్కోర్స్

మైక్రో-బ్లాగింగ్ సైట్ Weibo పై వివో కంపెనీ ప్రొడక్ట్ మేనేజర్ హన్ బాక్సీయావో Vivo X100s యొక్క అంటుటు మరియు గీక్‌బెంచ్ స్కోర్లను షేర్ చేశారు.

Vivo X100s స్మార్ట్‌ఫోన్ 2305267 పాయింట్లను అంటుటు పై స్కోర్ చేసింది.

సీపీయూ టెస్ట్ లో 538809 పాయింట్లు, జీపీయూ టెస్ట్ లో 940944 పాయింట్లు స్కోర్ చేసింది. మెమొరీ టెస్ట్ లో 472,337 పాయింట్లు స్కోర్ చేసింది. యూఎక్స్ టెస్ట్ లో 353,177 పాయింట్లు స్కోర్ చేసింది.

గీక్‌బెంచ్ లిస్టింగ్ ప్రకారం, Vivo X100s ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్సెట్ తో వస్తున్నట్లు అర్థమవుతోంది.

గీక్‌బెంచ్ పై సింగిల్-కోర్ టెస్ట్ లో 2313 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 7743 పాయింట్లు స్కోర్ చేసింది.

Vivo X100s స్పెసిఫికేషన్స్ (అంచనా)

స్క్రీన్: Vivo X100s లో ఓఎల్ఈడీ ప్యానెల్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, పంచ్ హోల్ కటౌట్ ఉంటాయి.

ప్రాసెసర్: Vivo X100s లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్సెట్ ఉంటుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

బ్యాటరీ: Vivo X100s లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

ఓఎస్: Vivo X100s డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అవుతుంది.

ఇతర ఫీచర్లు: Vivo X100s డివైజ్ ఆప్టికల్ ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ తో వస్తున్నట్లు గతంలో వచ్చిన లీక్స్ ద్వారా తెలిసింది.

The post Vivo X100s గీక్‌బెంచ్, అంటుటు స్కోర్స్ first appeared on 91Mobiles Telugu.

]]>