Apple Diwali Sale - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 27 Sep 2022 14:38:30 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Apple దీపావళి సేల్ ఆఫర్: రూ.7,000 వరకు లభించనున్న డిస్కౌంట్ https://www.91mobiles.com/telugu/apple-diwali-sale-offer-india/ Tue, 27 Sep 2022 14:31:22 +0000 https://www.91mobiles.com/telugu/?p=2610 హైలైట్స్: తన ఈ-కామర్స్ వెబ్ సైట్ లో దీపావళి ఫెస్టివల్ ఆఫర్ ప్రకటించిన ఆపిల్ రూ.41,900 విలువ కలిగిన ఉత్పత్తుల కొనుగోలుపై రూ.7,000 (7%) వరకు డిస్కౌంట్ సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 24 వరకు కొనసాగనున్న ఆపిల్ ఫెస్టివల్ సేల్, హెచ్డీఎఫ్‌సీ, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డ్స్ పై మాత్రమే ఆఫర్ చెల్లుబాటు తన అధికార వెబ్‌సైట్ లో ఆపిల్ సంస్థ ఫెస్టివల్ డీల్ ని ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ […]

The post Apple దీపావళి సేల్ ఆఫర్: రూ.7,000 వరకు లభించనున్న డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • తన ఈ-కామర్స్ వెబ్ సైట్ లో దీపావళి ఫెస్టివల్ ఆఫర్ ప్రకటించిన ఆపిల్
  • రూ.41,900 విలువ కలిగిన ఉత్పత్తుల కొనుగోలుపై రూ.7,000 (7%) వరకు డిస్కౌంట్
  • సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 24 వరకు కొనసాగనున్న ఆపిల్ ఫెస్టివల్ సేల్, హెచ్డీఎఫ్‌సీ, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డ్స్ పై మాత్రమే ఆఫర్ చెల్లుబాటు

తన అధికార వెబ్‌సైట్ లో ఆపిల్ సంస్థ ఫెస్టివల్ డీల్ ని ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ నడుమ ఆపిల్ తన పండుగ ఆఫర్ ని ప్రకటించింది. సాధారణంగా ఈ-కామర్స్ సైట్స్ లో ఉత్పత్తుల ధరలను బాగా తగ్గించడం లేదంటే బ్యాంక్ డిస్కౌంట్స్ వంటివి ఓ రేంజ్ లో ఉండటం మనకు తెలిసిందే. అయితే ఆపిల్ మాత్రం ధరలను తగ్గించలేదు. దానికి బదులుగా, 7 శాతం డిస్కౌంట్ అంటే రూ.7,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ని అందిస్తోంది. అది కూడా రూ.41,900 పైన బిల్ చేస్తే ఈ ఆఫర్ వర్తించనుంది. ఈ ఆఫర్ కేవలం హెచ్డీఎఫ్‌సీ మరియు అమెక్స్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా మాత్రమే లభిస్తుంది.

అదనంగా 3 లేదా 6 నెలల కాలానికి నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. ఆపిల్ ప్రకటించిన పండుగ ఆఫర్ బాగానే ఉంది. కానీ, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ మాదిరిగా ఉత్పత్తుల ధరలను తగ్గిస్తే బాగుండేది. అప్పుడు మంచి పోటీ వాతావరణం ఏర్పడేది. అలాగే ఆపిల్ ఉత్పత్తులను కొనాలనుకునే వారికి ఎంతో ప్రయోజనం కలిగేది. ఏదేమైనా, ఇటీవలి కాలంలో ఆపిల్ ఫోన్ల ధరలు ఎప్పుడు లేని విధంగా తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తర్వాత ఆపిల్ కంపెనీ ఐఫోన్ 13 సిరీస్ ఫోన్ల ధరలను తగ్గించింది. దీంతో ఐఫోన్ కొనాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న యూజర్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు.

Apple ఫెస్టివల్ సేల్

తన ఈ-కామర్స్ సైట్ ఆపిల్ సంస్థ ఫెస్టివల్ సేల్ ని ప్రకటించింది. ఈ సేల్ ద్వారా వినియోగదారులు రూ.41,900 కి పైన షాపింగ్ చేస్తే, 7 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అంటే రూ.7,000 వరకు బెనిఫిట్ పొందవచ్చు. ఈ ఆఫర్ కేవలం హెచ్డీఎఫ్‌సీ, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డ్స్ పై మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అలాగే 3 నుంచి 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం అందుబాటులో ఉంది.

సెప్టెంబర్ 26 న మొదలైన ఈ ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 24 వరకు కొనసాగుతుంది. ఈ ఆఫర్ ఆపిల్ స్టోర్ ఫర్ ఎడ్యుకేషన్ లేదా కార్పొరేట్ ఎంప్లాయీ పర్చేస్ ప్లాన్ ప్రైసింగ్ తో ముడిపడి లేదు. ఇక ఈ ఆఫర్ AirPods, iPads తదితర ఉత్పత్తులను కొనాలనుకునే వారికి ఎక్కువ ప్రయోజనం చేకూర్చనుంది. అయితే, ఉత్పత్తుల ధరలను గమనిస్తే, ఆపిల్ వెబ్‌సైట్ లో కంటే, ఫ్లిప్ కార్ట్, అమెజాన్ సైట్స్ లోనే మంచి డీల్స్ ఉన్నాయి. ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లో ఐఫోన్లు, మ్యాక్ బుక్స్ తదితర ఆపిల్ ప్రోడక్ట్స్ పై బెస్ట్ డీల్స్ ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెలీకామ్, టెక్నాలజీ, ఆటోమొబైల్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post Apple దీపావళి సేల్ ఆఫర్: రూ.7,000 వరకు లభించనున్న డిస్కౌంట్ first appeared on 91Mobiles Telugu.

]]>