ASUS ROG Phone 6D - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 19 Sep 2022 14:15:36 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ చిప్, 165Hz రిఫ్రెష్ రేట్ తో లాంచ్ అయిన ASUS ROG Phone 6D, 6D Ultimate https://www.91mobiles.com/telugu/asus-rog-phone-6d-6d-ultimate-launched-price-specs/ Mon, 19 Sep 2022 14:12:02 +0000 https://www.91mobiles.com/telugu/?p=2433 హైలైట్స్: అఫీషియల్ గా లాంచ్ అయిన ASUS ROG Phone 6D and 6D Ultimate స్మార్ట్ ఫోన్స్ 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 165హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6000ఎంఏహెచ్ బ్యాటరీ, 65వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఈ డివైజెస్ ప్రధాన ఫీచర్లు ASUS ROG Phone 6D ధర 799 యూరోలు (దాదాపు రూ.72,490) ASUS ROG Phone 6D and 6D Ultimate ఫోన్లు అధికారికంగా లాంచ్ అయ్యాయి. ఈ రెండు ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ […]

The post మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ చిప్, 165Hz రిఫ్రెష్ రేట్ తో లాంచ్ అయిన ASUS ROG Phone 6D, 6D Ultimate first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • అఫీషియల్ గా లాంచ్ అయిన ASUS ROG Phone 6D and 6D Ultimate స్మార్ట్ ఫోన్స్
  • 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 165హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6000ఎంఏహెచ్ బ్యాటరీ, 65వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఈ డివైజెస్ ప్రధాన ఫీచర్లు
  • ASUS ROG Phone 6D ధర 799 యూరోలు (దాదాపు రూ.72,490)

ASUS ROG Phone 6D and 6D Ultimate ఫోన్లు అధికారికంగా లాంచ్ అయ్యాయి. ఈ రెండు ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ చిప్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉన్నాయి. 6డీ ఫోన్ లో ఆర్ఓజీ ఆర్జీబీ లైట్ లోగో ఉండగా, రోగ్ ఫోన్ 6డీ అల్టిమేట్ లో రోగ్ విజన్ కలర్ పీఎంఓఎల్ఈడీ డిస్ప్లే ఉంది. 6డీ మోడల్ లో ఎయిరో యాక్టివ్ పోర్టల్ ఉంది. బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ కెమెరా సెన్సర్స్ ఉన్నాయి. ఇంకా భద్రత కోసం ఈ ఫోన్లలో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది.

ASUS ROG Phone 6D and 6D Ultimate ఫోన్లలో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 165హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6000ఎంఏహెచ్ బ్యాటరీ, 65 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 16జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

ASUS ROG Phone 6D and 6D Ultimate ధరలు

ASUS ROG Phone 6D ధర 799 యూరోలు (దాదాపు రూ.72,490) కాగా, ASUS ROG 6D Ultimate ధర 1199 యూరోలు (దాదాపు రూ.1.08 లక్షలు) గా ఉంది. ఇవి యూకే మార్కెట్ ధరలు. ఈ ఫోన్లు స్పేస్ గ్రే కలర్ ఆప్షన్ లో లభించనున్నాయి. ఎయిరో యాక్టివ్ కూలర్ 6 బాక్స్ లో వస్తుంది. త్వరలోనే ఈ ఫోన్లు రోలౌట్ అవుతాయి.

ASUS ROG Phone 6D and 6D Ultimate స్పెసిఫికేషన్స్

ASUS ROG Phone 6D and 6D Ultimate ఫోన్లలో 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 10-బిట్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 2448*1080 రెజుల్యూషన్, 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 20.4:9 యాస్పెక్ట్ రేషియో, 720 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 111.23 పర్సెంట్ డీసీఐ-పీ3, 800 నిట్స్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్, మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ ప్రాసెసర్, మాలి-జీ710 ఎంసీ10 జీపీయూ ఉన్నాయి.

స్టాండర్డ్ వేరియంట్ 16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి స్టోరేజీని కలిగి ఉంటుంది. ఇక అల్టిమేట్ వేరియంట్ లో 16జిబి ర్యామ్, 512జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉంటాయి. రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 12 ఓఎస్, రోగ్ మరియు జెన్ యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ వీటిలో ఉంటుంది. హై-రెజుల్యూషన్ ఔట్ పుట్ కోసం క్వాల్కమ్ డబ్ల్యూసీడీ9385 ని అందించారు. డ్యూయల్ ఫ్రంట్ ఫేసింగ్ స్పీకర్స్, డిరాక్ హెచ్డీ సౌండ్, 5-మ్యాగ్నెట్ స్టీరియో స్పీకర్, ఐపీఎక్స్4 రేటింగ్ ఈ ఫోన్లలో ఉన్నాయి.

ఈ ఫోన్లు ఎయిర్ ట్రిగ్గర్ 6 మరియు గ్రిప్ ప్రెస్ డిటెక్షన్ కోసం అల్ట్రాసోనిక్ సెన్సర్స్ తో వస్తున్నాయి. రెండు ఫోన్లలో 6000ఎంఏహెచ్ బ్యాటరీ, 65 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. 5జీ, 4జీ వొల్టీ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.3, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ, ఎన్ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

ASUS ROG Phone 6D and 6D Ultimate ఫోన్లలో 50ఎంపి సోనీ ఐఎంఎక్స్766 ప్రైమరీ సెన్సర్, ఎల్ఈడీ ఫ్లాష్, 13ఎంపి అల్ట్రా-వైడ్ కెమెరా, 5ఎంపి మ్యాక్రో షూటర్, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12ఎంపి సోనీ ఐఎంఎక్స్663 ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

The post మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ చిప్, 165Hz రిఫ్రెష్ రేట్ తో లాంచ్ అయిన ASUS ROG Phone 6D, 6D Ultimate first appeared on 91Mobiles Telugu.

]]>