Ather 450X Gen 3 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 02 Sep 2022 10:39:22 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Ola S1 Pro కంటే ఎక్కువగా అమ్ముడైన Ather 450x ఎలక్ట్రిక్ స్కూటర్లు https://www.91mobiles.com/telugu/ather-450x-outsells-ola-s1-pro-in-august-enters-top-five/ Sat, 03 Sep 2022 04:30:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=2065 హైలైట్స్: జులై 2022 కంటే, ఆగస్టు 2022 లో 12.7 శాతం పెరిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు ఆగస్టులో 10,000 యూనిట్లకు పైగా అమ్మి అగ్రస్థానంలో ఉన్న హీరో ఎలక్ట్రిక్ ఓలా ఎలక్ట్రిక్ ని అధిగమించి టాప్-5 లో చేరిన ఏథర్ ఎనర్జీ మరోసారి దేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ సెగ్మెంట్ స్థిరమైన వృద్ధి రేటుని కనబరించింది. జులై 2022 తో పోల్చితే, ఆగస్టు 2022 లో 12.7 శాతం పెరుగుదలను నమోదు చేసింది. పది వేలకు పైగా […]

The post Ola S1 Pro కంటే ఎక్కువగా అమ్ముడైన Ather 450x ఎలక్ట్రిక్ స్కూటర్లు first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • జులై 2022 కంటే, ఆగస్టు 2022 లో 12.7 శాతం పెరిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు
  • ఆగస్టులో 10,000 యూనిట్లకు పైగా అమ్మి అగ్రస్థానంలో ఉన్న హీరో ఎలక్ట్రిక్
  • ఓలా ఎలక్ట్రిక్ ని అధిగమించి టాప్-5 లో చేరిన ఏథర్ ఎనర్జీ

మరోసారి దేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ సెగ్మెంట్ స్థిరమైన వృద్ధి రేటుని కనబరించింది. జులై 2022 తో పోల్చితే, ఆగస్టు 2022 లో 12.7 శాతం పెరుగుదలను నమోదు చేసింది. పది వేలకు పైగా బండ్లను అమ్మి హీరో ఎలక్ట్రిక్ సేల్స్ రికార్డుని నమోదు చేసింది. ఏథర్ ఎనర్జీ, టీవీఎస్ లు సత్తా చాటాయి. ఇక ఒకినావా ఆటోటెక్ మెరుగైన ర్యాంక్ కి చేరుకుంది. ఇక ఇంటర్నెట్ యొక్క ఫేవరెట్ ఈ-స్కూటర్ బ్రాండ్ ఓలా ఎలక్ట్రిక్ వరుసగా నాలుగో నెల కూడా సేల్స్ లో వెనుకబడింది.

2022 ఆగస్టులో భారత ఎలక్ట్రిక్ టూ-వీలర్ సెక్టర్ లో మొత్తం 50,076 యూనిట్లు అమ్ముడయ్యాయి. హీరో ఎలక్ట్రిక్ అమ్మకాల్లో 10,476 యూనిట్స్ మార్కుని దాటింది. దీంతో ఈ సంస్థ భారత్ లో అతిపెద్ద టూ-వీలర్ సెల్లర్ గా అవతరించింది. మార్చి 2022 నుంచి చూస్తే, 10,000 యూనిట్స్ మార్కుని దాటడం హీరో కి తొలిసారి.

పెరుగుతోన్న ఎలక్ట్రిక్ టూ-వీలర్ సేల్స్, అగ్రస్థానంలో హీరో ఎలక్ట్రిక్

వాహన్ పోర్టల్ ప్రకారం, ఆగస్టు 2022 లో 50,076 యూనిట్స్ ఎలక్ట్రిక్ టూ-వీలర్స్ అమ్మకాల ద్వారా భారత్ 12.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది జులై 2022 తో పోల్చితే ఎక్కువ. 10,476 యూనిట్లు అమ్మి, హీరో ఎలక్ట్రిక్ మరోసారి ఫస్ట్ ర్యాంక్ కైవసం చేసుకుంది. మార్చి 2022 తర్వాత హీరో కంపెనీకి ఈ ఫీట్ సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. దీంతో ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో హీరో కి తిరుగులేదని నిరూపించుకున్నట్లైంది.

ఒకినావా ఆటోటెక్ 8,554 యూనిట్లు అమ్మి రెండో స్థానంలో నిలిచింది. ఇక మరో ఈవీ మేకర్ ఆంపియర్, టీవీఎస్ ని దాటేసి మూడో స్థానంలోకి దూసుకెళ్ళింది. ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కు మెరుగులు దిద్దిన టీవీఎస్ 6,282 యూనిట్లు అమ్మి సత్తా చాటింది. మొత్తంగా ఈ స్కూటర్ వి 50 శాతం సేల్స్ పెరిగాయి. రానున్న రోజుల్లో టీవీఎస్ కంపెనీ తన పోటీదారులకు గట్టి పోటీ ఇచ్చే అవకాశముంది.

బెంగళూరుకి చెందిన స్టార్టప్ ఏథర్ ఎనర్జీ 5,239 యూనిట్లు అమ్మి తానేంటో నిరూపించుకుంది. ఆగస్టు 2022 లో హయ్యస్ట్ మంత్లీ సేల్స్ నమోదు చేసింది ఏథర్ ఎనర్జీ. దీంతో ఓలా ఎలక్ట్రిక్ ని వెనక్కి నెట్టి 5 వ స్థానంలో నిలిచింది ఏథర్. మరోవైపు ఓలా ఎలక్ట్రిక్ వరుసగా నాలుగో నెల కూడా అమ్మకాల్లో క్షీణతను ప్రదర్శించింది. ఆగస్టు 2022 లో కేవలం 3,421 యూనిట్లను మాత్రమే ఓలా ఎలక్ట్రిక్ అమ్మగలిగింది.

ఇక బజాజ్ ఆటో 2,554 యూనిట్లు అమ్మింది. మరో స్టార్టప్ రివోల్ట్ కంపెనీ రివోల్ట్ ఆర్‌వీ ఎలక్ట్రిక్ బైక్ ను అమ్ముతోన్న సంగతి తెలిసిందే. ఈ సంస్థ 1604 యూనిట్ల ఆర్‌వీ400 బండ్లను అమ్మి పర్వాలేదనిపించింది.

లేటెస్ట్ ఆటోమొబైల్, టెలీకామ్, స్మార్ట్ ఫోన్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post Ola S1 Pro కంటే ఎక్కువగా అమ్ముడైన Ather 450x ఎలక్ట్రిక్ స్కూటర్లు first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్ లో లాంచ్ అయిన Ather 450X Gen 3 ఎలక్ట్రిక్ స్కూటర్ https://www.91mobiles.com/telugu/ather-450x-gen-3-india-launch-price-features/ Tue, 19 Jul 2022 15:28:06 +0000 https://www.91mobiles.com/telugu/?p=1077 హైలైట్స్: 25శాతం అధిక బ్యాటరీ కెపాసిటీతో లాంచ్ అయిన ఏథర్ 450ఎక్స్ జెన్ 3 డిస్ప్లే లో అధిక ర్యామ్ తో పాటు, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ జులై 20 నుంచి దేశ వ్యాప్తంగా అందుబాటులోకి ఏథర్ 450ఎక్స్ జెన్ 3 స్కూటర్ భారత ఎలక్ట్రానిక్ వెహికిల్ బ్రాండ్ ఏథర్ ఎనర్జీ, కొత్త తరం ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథర్ 450ఎక్స్ జెన్ 3 ని లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. భారీ బ్యాటరీతో వస్తున్న ఈ స్కూటర్ […]

The post భారత్ లో లాంచ్ అయిన Ather 450X Gen 3 ఎలక్ట్రిక్ స్కూటర్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • 25శాతం అధిక బ్యాటరీ కెపాసిటీతో లాంచ్ అయిన ఏథర్ 450ఎక్స్ జెన్ 3
  • డిస్ప్లే లో అధిక ర్యామ్ తో పాటు, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్
  • జులై 20 నుంచి దేశ వ్యాప్తంగా అందుబాటులోకి ఏథర్ 450ఎక్స్ జెన్ 3 స్కూటర్

భారత ఎలక్ట్రానిక్ వెహికిల్ బ్రాండ్ ఏథర్ ఎనర్జీ, కొత్త తరం ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథర్ 450ఎక్స్ జెన్ 3 ని లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. భారీ బ్యాటరీతో వస్తున్న ఈ స్కూటర్ రైడింగ్ రేంజ్ ను మరింత పెంచుకుంది. అనుకున్న రేంజ్ ను హయ్యర్ పెర్ఫామెన్స్ మోడ్ లోనూ పొందవచ్చని కంపెనీ ఒక స్టేట్మెంట్ లో తెలిపింది.

భారత్ లో Ather 450X Gen 3 ధర, లభ్యత

హైదరాబాద్, చెన్నై, కొచ్చి, బెంగళూరు, ముంబై, పూణె, ఢిల్లీ, అహ్మదాబాద్, జైపూర్ నగరాల్లో ఉన్న ఏథర్ షోరూమ్స్ ద్వారా జులై 20 నుంచి ఏథర్ 450ఎక్స్ జెన్ 3 అందుబాటులో ఉంటుంది. ఆసక్తిగల వారు ఈ షోరూమ్స్ కి వెళ్ళి కొనుగోలు చేయవచ్చు. ఇక మార్కెట్ ను బట్టి ఏథర్ స్కూటర్ ధర మారనుంది. తన సొంత రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో ఏథర్ 450ఎక్స్ జెన్ 3 ధర రూ.1,55,657 (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఇక అహ్మదాబాద్ లో అత్యంత తక్కువగా రూ.1,37,612 (ఎక్స్ షోరూమ్) ధర ఉంది.

Ather 450X Gen 3 ప్రధాన ఫీచర్లు

కొత్త ఫీచర్ల విషయానికి వస్తే, ఏథర్ 450ఎక్స్ జెన్ 3 3.7కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో అప్ గ్రేడ్ అయ్యింది. ఇది గత తరం మోడల్స్ కంటే 25 శాతం అధిక బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది. దీంతో ఏఆర్ఏఐ సర్టిఫికేషన్ ప్రకారం, అత్యధిక రైడింగ్ రేంజ్ 146 కిలో మీటర్లు కలిగి ఉంది. ఇక ఏథర్ యొక్క డేటా ప్రకారం, ఇది 105 కిలోమీటర్లుగా ఉంది. వార్ప్, స్పోర్ట్, రైడ్, స్మార్ట్ ఇకో, ఇకో అనే ఐదు రైడింగ్ మోడ్స్ ఈ బండిలో ఉన్నాయి. వార్ప్ మోడ్ లో 8.7బీహెచ్పీ అత్యధిక పవర్ ఔట్ పుట్ ఉంది.

ఇతర ముఖ్యమైన ఫీచర్లను గురించి చూస్తే, అల్యూమినియమ్ ఫ్రేమ్, వైడ్ రియర్ టైర్స్, గత జనరేషన్స్ తో పోలిస్తే ఈ టైర్స్ 22 శాతం అదనపు గ్రిప్ ను ఇవ్వనున్నాయి. స్కూటర్ లో ఉన్న స్మార్ట్ డిస్ప్లే డ్యాష్ బోర్డ్ లో టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ను అందించారు. ఇక డిస్ప్లే విషయానికి వస్తే, ఇది 7 అంగుళాల సైజు ఉంటుంది. ఇప్పుడు 2జిబి వరకు అధిక ర్యామ్ ను డిస్ప్లే కలిగి ఉంది. ఈ ర్యామ్ డిస్ప్లే వేగంగా స్పందించేందుకు ఉపయోగపడనుంది.

భారత దేశంలో ఉండే అత్యధిక ఉష్ణోగ్రతల నడుమ డిస్ప్లే మరింత మెరుగైన పనితీరు కనబరిచేందుకు ఈ ర్యామ్ ఉపకరిస్తుందని ఏథర్ కంపెనీ వెల్లడించింది. మెమొరీ ఇంటెన్సివ్ అప్లికేషన్స్ యొక్క పెర్ఫామెన్స్ ను పెంచేందుకు సరికొత్త డ్యాష్ బోర్డ్ ఎంతో ఉపయోగపడుతుందని ఏథర్ కంపెనీ తెలిపింది. వాయిస్ కమాండ్స్, మల్టీ-లాంగ్వేజ్ సపోర్ట్, హెవీ గ్రాఫిక్స్, డీపర్ డయగ్నోస్టిక్స్ వంటి భవిష్యత్తులో రాబోవు ఫీచర్లకు ఈ డ్యాష్ బోర్డ్ సపోర్ట్ చేస్తుందని ఏథర్ కంపెనీ వెల్లడించింది.

ఏథర్ 450ఎక్స్ జెన్ 3 స్కూటర్ లో సరికొత్త రియర్ వ్యూ మిర్రర్ ను అమర్చారు. ఇది మెయిన్ ఫ్రేమ్ తో ఇంటిగ్రేట్ చేయబడటం విశేషం. ఇది రెండు రెట్లు ఉత్తమమైన విజిబులిటీని అందిస్తుందని ఏథర్ కంపెనీ చెబుతోంది. అలాగే ఏథర్ 450ఎక్స్ జెన్ 3 కొత్త స్టాండ్ డిజైన్ తో వస్తోంది.

The post భారత్ లో లాంచ్ అయిన Ather 450X Gen 3 ఎలక్ట్రిక్ స్కూటర్ first appeared on 91Mobiles Telugu.

]]>