Ather - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 03 Oct 2022 15:39:46 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Electric Scooter బ్యాటరీ పేలి 7 ఏళ్ళ బాలుడు మృతి https://www.91mobiles.com/telugu/ev-fire-electric-scooter-battery-explodes-7-years-old-boy-dies/ Mon, 03 Oct 2022 15:39:46 +0000 https://www.91mobiles.com/telugu/?p=2719 హైలైట్స్: ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలి 7 ఏళ్ళ బాలుడు మృతి, ముంబై లో ఘటన బ్యాటరీ పేలినప్పుడు చార్జింగ్ లో ఉన్న స్కూటర్ ఇంకా బయటకు రాని స్కూటర్ మోడల్ మరియు కంపెనీ పేరు ముంబైలోని వాసై ప్రాంతంలో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలడంతో ఏడేళ్ళ బాలుడు మృతి చెందాడు. స్కూటర్ చార్జింగ్ లో ఉండగా బ్యాటరీ పేలింది. అప్పుడు బాలుడు పక్కనే నిద్రిస్తున్నట్లు సమాచారం. 70 శాతం గాయాలతో చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు. […]

The post Electric Scooter బ్యాటరీ పేలి 7 ఏళ్ళ బాలుడు మృతి first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలి 7 ఏళ్ళ బాలుడు మృతి, ముంబై లో ఘటన
  • బ్యాటరీ పేలినప్పుడు చార్జింగ్ లో ఉన్న స్కూటర్
  • ఇంకా బయటకు రాని స్కూటర్ మోడల్ మరియు కంపెనీ పేరు

ముంబైలోని వాసై ప్రాంతంలో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలడంతో ఏడేళ్ళ బాలుడు మృతి చెందాడు. స్కూటర్ చార్జింగ్ లో ఉండగా బ్యాటరీ పేలింది. అప్పుడు బాలుడు పక్కనే నిద్రిస్తున్నట్లు సమాచారం. 70 శాతం గాయాలతో చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు.

ముంబై లోని వాసై (ఈస్ట్) ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. బ్యాటరీ పేలినప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంటి వద్ద చార్జింగ్ లో ఉంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన కథనం ప్రకారం, రాందాస్ నగర్ ప్రాంతంలో సెప్టెంబర్ 23 న ఉదయం 4.30 నుంచి 5.00 గంటల మధ్య పేలుడు సంభవించింది. ఘటన జరిగిన సమయంలో మృతుడు షబ్బీర్ అన్సారి తన నానమ్మతోపాటు హాల్ లో నిద్రిస్తున్నాడు.

అన్సారి తండ్రి తాను పడుకునే ముందు బ్యాటరీకి చార్జింగ్ పెట్టి తన గదిలోకి వెళ్ళాడు. భారీ శబ్దం రావడంతో బాలుడి తల్లిదండ్రులు మేలుకున్నారు. ఇక బాలుడి నానమ్మకి కూడా స్వల్ప గాయాలయ్యాయి. 70 శాతం గాయాలైన అన్సారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అన్సారి కన్ను మూశాడు.

బ్యాటరీని ఎంతసేపు చార్జింగ్ పెట్టారో తెలియదని పోలీసులు చెప్పారు. ఘటనకు ముందు రాత్రి 2.30 గంటలకు స్కూటర్ చార్జింగ్ పెట్టామని బాలుడి తల్లిదండ్రులు తెలిపారు. అంటే పేలుడు జరిగేందుకు రెండు గంటల ముందు చార్జింగ్ పెట్టినట్లు తెలుస్తోంది.

బాధిత కుటుంబం ఏ మోడల్, ఏ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ ని వాడుతుందో ఇంకా తెలియలేదు. ఏదేమైనా, ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల పేలుడు ఉదంతాలు చాలా చోటు చేసుకుంటున్నాయి. బ్యాటరీలకు నిప్పంటుకోవడం, పేలడం, జనాలు ప్రాణాలు కోల్పోవడం సాధారణమై పోయింది. దీంతో ఈ-స్కూటర్లు కొనాలంటేనే జనాలు వణుకుతున్నారు. ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వం కూడా ఈవీ కంపెనీలపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. గత నెలలో సికింద్రాబాద్ లోని ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్ లో మంటలు వ్యాపించడంతో 8 మంది దుర్మణం పాలైన విషయం తెలిసిందే. ఈ ఉదంతాలకు అడ్డుకట్ట పడేదెప్పుడో మరి.

అంతకు ముందు, ఇటువంటి ఘటనే కేరళ లోని కోలికోడ్ లో చోటు చేసుకుంది. అక్కడ ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్ లో 12 స్కూటర్లు మంటల్లో చిక్కుకున్నాయి. ఓ స్కూటర్ బ్యాటరీ సమస్యను సరిచేస్తుండగా ఉన్నట్లుండి మంటలు చెలరేగాయని సమాచారం. ఆ వెనువెంటనే మిగతా స్కూటర్లకు కూడా మంటలు వ్యాపించడంతో భారీగా మంటలు వ్యాపించాయి.

విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న బ్యాటరీలతోనే పేలుడు ఉదంతాలు సంభవిస్తున్నాయని ఏథర్ కంపెనీ సీఈవో అన్నారు. ఇక ఎలక్ట్రిక్ వాహనాల పేలుళ్ళను నివారించేందుకు ఓలా కంపెనీ సరికొత్త బ్యాటరీ టెక్నాలజీని రూపొందిస్తోంది. ఓలా కంపెనీ ఈ విషయంలో ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి. ఏదేమైనా, ఎవరో ఒకరి ఆవిష్కరణతో ఈ బ్యాటరీ పేలుళ్ళకు చెక్ పడాలని ఆశిద్దాం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post Electric Scooter బ్యాటరీ పేలి 7 ఏళ్ళ బాలుడు మృతి first appeared on 91Mobiles Telugu.

]]>
ఎలక్ట్రిక్ వెహికిల్స్ కాలిపోయి ఇండస్ట్రీకి సాయమే చేస్తున్నాయి: ATHER CEO https://www.91mobiles.com/telugu/ather-ceo-says-ev-fire-incidents-helping-the-industry/ Mon, 01 Aug 2022 11:06:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=1395 హైలైట్స్: ఇటీవలి చోటుచేసుకున్న ఎలక్ట్రిక్ వాహనాల ఫైర్ ఇన్సిడెంట్స్ పరిశ్రమకు సాయమే చేస్తున్నాయంటోన్న ఏథర్ సీఈవో తరుణ్ మెహ్తా ఈ ఘటనల వల్ల కంపెనీలు నాణ్యతపై ఫోకస్ పెడుతున్నట్లు చెప్పిన తరుణ్ మెహ్తా క్వాలిటీకి ప్రాధాన్యతను ఇస్తూనే, ఉత్పత్తిని పెంచే ఆలోచన చేస్తున్నామని తెలిపిన తరుణ్ ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు మంటల్లో కాలిపోయిన ఉదంతాలు చాలానే చూశాం. అయితే వీటిపై తాజాగా ఏథర్ ఎనర్జీ సీఈవో తరుణ్ మెహ్తా స్పందించారు. ఆయన పరిస్థితుల పట్ల పాజిటివ్ […]

The post ఎలక్ట్రిక్ వెహికిల్స్ కాలిపోయి ఇండస్ట్రీకి సాయమే చేస్తున్నాయి: ATHER CEO first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • ఇటీవలి చోటుచేసుకున్న ఎలక్ట్రిక్ వాహనాల ఫైర్ ఇన్సిడెంట్స్ పరిశ్రమకు సాయమే చేస్తున్నాయంటోన్న ఏథర్ సీఈవో తరుణ్ మెహ్తా
  • ఈ ఘటనల వల్ల కంపెనీలు నాణ్యతపై ఫోకస్ పెడుతున్నట్లు చెప్పిన తరుణ్ మెహ్తా
  • క్వాలిటీకి ప్రాధాన్యతను ఇస్తూనే, ఉత్పత్తిని పెంచే ఆలోచన చేస్తున్నామని తెలిపిన తరుణ్

ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు మంటల్లో కాలిపోయిన ఉదంతాలు చాలానే చూశాం. అయితే వీటిపై తాజాగా ఏథర్ ఎనర్జీ సీఈవో తరుణ్ మెహ్తా స్పందించారు. ఆయన పరిస్థితుల పట్ల పాజిటివ్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. బలమైన ట్రాక్ రికార్డ్ కలిగిన ఏథర్ సంస్థ సామర్థ్యమున్న బండ్లను అందిస్తూ, వినియోగదారుల నమ్మకాన్ని పొందుతూ వస్తోంది. అందుచేతనే తరుణ్ మెహ్తా, ఆశావహంగా కనిపిస్తున్నారు. ఈవీ ఫైర్ ఉదంతాలు ఇండస్ట్రీకి మేలు చేస్తున్నాయని ఆయన అన్నారు. దీని వల్లన కంపెనీలు క్వాలిటీపై ఫోకస్ పెడుతున్నట్లు మెహ్తా చెప్పారు.

దేశంలో తొలినాళ్ళలో మొదలైన ఈవీ స్టార్ట్‌అప్స్ లో ఏథర్ ఎనర్జీ ఒకటి. ప్రారంభం నుంచి మంచి వెహికిల్స్ ని అందిస్తూ, కస్టమర్లలో నమ్మకాన్ని సంపాదించింది. అలాగే భారత్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. కొత్త కంపెనీలు ఓలా ఎలక్ట్రిక్, ఒకినావా ఆటోటెక్, ప్యూర్ఈవీ వంటి సంస్థల నుంచి పోటీ ఉన్నప్పటికీ, బలంగా నిలబడటం ఏథర్ కే చెల్లింది.

ఓవైపు ఈవీలు కాలిపోతున్నప్పటికీ, పాజిటివ్ గానే ఉన్న Ather CEO

గత కొన్నాళ్లుగా ఏథర్ సాధించిన విజయాలు, ప్రజల్లో తమ బండ్ల పట్ల ఏర్పడిన నమ్మకం వెరసి ఏథర్ సీఈవో తరుణ్ మెహ్తా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. భారత్ లో ఇటీవల ఎలక్ట్రిక్ బండ్లు కాలిపోతున్న ఉదంతాలపై ఏథర్ సీఈవో స్పందించారు. ఆశ్చర్యకరంగా ఆయన పాజిటివ్ గా స్పందించారు. అలాగే ఈ ఘటనలు క్వాలిటీకి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చేలా చేస్తున్నాయని అన్నారు.

కండీషన్ లో ఉన్న తమ కంపెనీ తయరు చేసిన బండి ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు కాలిపోలేదని తరుణ్ మెహ్తా గర్వంగా చెప్పారు. అయితే ఇటీవలె కాలి పోయిన ఏథర్ ఈవీ ఘటనపై మాట్లాడిన ఆయన, అది అంతకు ముందే ఓ యాక్సిడెంట్ కు గురైనట్లు వివరించారు. ఏథర్ ఎల్లప్పుడూ నాణ్యత ప్రమాణాలకు ప్రాధాన్యతనిస్తుందని చెప్పారు.

ఈ దశాబ్దం ముగిసే నాటికి భారత్ లో 20 నుంచి 30 మిలియన్ల విద్యుత్ ద్విచక్ర వాహనాలు అమ్ముడవుతాయని తరుణ్ మెహ్తా అంచనా వేస్తున్నారు. ఏథర్ కూడా నిర్ధిష్టమైన భవిష్యత్తు ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నట్లు సదరు కంపెనీ సీఈవో మాటల ద్వారా స్పష్టమవుతోంది. “రానున్న కొన్నేళ్ళలో సామర్థ్యాన్ని పెంచుకునేందుకు చాలా ఎక్కువ మొత్తంలో డబ్బుని పెట్టుబడి పెట్టబోతున్నాం. తొలి రెండు ప్లాంట్స్ ఆరంభానికి సూచికలు మాత్రమే.” అని తరుణ్ చెప్పారు.

ఇటీవలె ఏథర్ రూ.989 కోట్ల ఫండింగ్ ను రాబట్టడంలో సఫలమైంది. దీంతో కంపెనీ తన ఉత్పాదక శక్తిని పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. రీసెంట్ గా ఏథర్ నుంచి ఏథర్ 450ఎక్స్ జెన్ 3 అనే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మొత్తానికి ఏథర్ భారత్ లో భారీ లక్ష్యంతోనే పని చేస్తున్నట్లు అర్థమవుతోంది. రానున్న రోజుల్లో ఏథర్ నుంచి ఇంకా ఎటువంటి వాహనాలు వస్తాయో చూడాలి.

The post ఎలక్ట్రిక్ వెహికిల్స్ కాలిపోయి ఇండస్ట్రీకి సాయమే చేస్తున్నాయి: ATHER CEO first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్ లో లాంచ్ అయిన Ather 450X Gen 3 ఎలక్ట్రిక్ స్కూటర్ https://www.91mobiles.com/telugu/ather-450x-gen-3-india-launch-price-features/ Tue, 19 Jul 2022 15:28:06 +0000 https://www.91mobiles.com/telugu/?p=1077 హైలైట్స్: 25శాతం అధిక బ్యాటరీ కెపాసిటీతో లాంచ్ అయిన ఏథర్ 450ఎక్స్ జెన్ 3 డిస్ప్లే లో అధిక ర్యామ్ తో పాటు, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ జులై 20 నుంచి దేశ వ్యాప్తంగా అందుబాటులోకి ఏథర్ 450ఎక్స్ జెన్ 3 స్కూటర్ భారత ఎలక్ట్రానిక్ వెహికిల్ బ్రాండ్ ఏథర్ ఎనర్జీ, కొత్త తరం ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథర్ 450ఎక్స్ జెన్ 3 ని లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. భారీ బ్యాటరీతో వస్తున్న ఈ స్కూటర్ […]

The post భారత్ లో లాంచ్ అయిన Ather 450X Gen 3 ఎలక్ట్రిక్ స్కూటర్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • 25శాతం అధిక బ్యాటరీ కెపాసిటీతో లాంచ్ అయిన ఏథర్ 450ఎక్స్ జెన్ 3
  • డిస్ప్లే లో అధిక ర్యామ్ తో పాటు, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్
  • జులై 20 నుంచి దేశ వ్యాప్తంగా అందుబాటులోకి ఏథర్ 450ఎక్స్ జెన్ 3 స్కూటర్

భారత ఎలక్ట్రానిక్ వెహికిల్ బ్రాండ్ ఏథర్ ఎనర్జీ, కొత్త తరం ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథర్ 450ఎక్స్ జెన్ 3 ని లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. భారీ బ్యాటరీతో వస్తున్న ఈ స్కూటర్ రైడింగ్ రేంజ్ ను మరింత పెంచుకుంది. అనుకున్న రేంజ్ ను హయ్యర్ పెర్ఫామెన్స్ మోడ్ లోనూ పొందవచ్చని కంపెనీ ఒక స్టేట్మెంట్ లో తెలిపింది.

భారత్ లో Ather 450X Gen 3 ధర, లభ్యత

హైదరాబాద్, చెన్నై, కొచ్చి, బెంగళూరు, ముంబై, పూణె, ఢిల్లీ, అహ్మదాబాద్, జైపూర్ నగరాల్లో ఉన్న ఏథర్ షోరూమ్స్ ద్వారా జులై 20 నుంచి ఏథర్ 450ఎక్స్ జెన్ 3 అందుబాటులో ఉంటుంది. ఆసక్తిగల వారు ఈ షోరూమ్స్ కి వెళ్ళి కొనుగోలు చేయవచ్చు. ఇక మార్కెట్ ను బట్టి ఏథర్ స్కూటర్ ధర మారనుంది. తన సొంత రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో ఏథర్ 450ఎక్స్ జెన్ 3 ధర రూ.1,55,657 (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఇక అహ్మదాబాద్ లో అత్యంత తక్కువగా రూ.1,37,612 (ఎక్స్ షోరూమ్) ధర ఉంది.

Ather 450X Gen 3 ప్రధాన ఫీచర్లు

కొత్త ఫీచర్ల విషయానికి వస్తే, ఏథర్ 450ఎక్స్ జెన్ 3 3.7కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో అప్ గ్రేడ్ అయ్యింది. ఇది గత తరం మోడల్స్ కంటే 25 శాతం అధిక బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది. దీంతో ఏఆర్ఏఐ సర్టిఫికేషన్ ప్రకారం, అత్యధిక రైడింగ్ రేంజ్ 146 కిలో మీటర్లు కలిగి ఉంది. ఇక ఏథర్ యొక్క డేటా ప్రకారం, ఇది 105 కిలోమీటర్లుగా ఉంది. వార్ప్, స్పోర్ట్, రైడ్, స్మార్ట్ ఇకో, ఇకో అనే ఐదు రైడింగ్ మోడ్స్ ఈ బండిలో ఉన్నాయి. వార్ప్ మోడ్ లో 8.7బీహెచ్పీ అత్యధిక పవర్ ఔట్ పుట్ ఉంది.

ఇతర ముఖ్యమైన ఫీచర్లను గురించి చూస్తే, అల్యూమినియమ్ ఫ్రేమ్, వైడ్ రియర్ టైర్స్, గత జనరేషన్స్ తో పోలిస్తే ఈ టైర్స్ 22 శాతం అదనపు గ్రిప్ ను ఇవ్వనున్నాయి. స్కూటర్ లో ఉన్న స్మార్ట్ డిస్ప్లే డ్యాష్ బోర్డ్ లో టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ను అందించారు. ఇక డిస్ప్లే విషయానికి వస్తే, ఇది 7 అంగుళాల సైజు ఉంటుంది. ఇప్పుడు 2జిబి వరకు అధిక ర్యామ్ ను డిస్ప్లే కలిగి ఉంది. ఈ ర్యామ్ డిస్ప్లే వేగంగా స్పందించేందుకు ఉపయోగపడనుంది.

భారత దేశంలో ఉండే అత్యధిక ఉష్ణోగ్రతల నడుమ డిస్ప్లే మరింత మెరుగైన పనితీరు కనబరిచేందుకు ఈ ర్యామ్ ఉపకరిస్తుందని ఏథర్ కంపెనీ వెల్లడించింది. మెమొరీ ఇంటెన్సివ్ అప్లికేషన్స్ యొక్క పెర్ఫామెన్స్ ను పెంచేందుకు సరికొత్త డ్యాష్ బోర్డ్ ఎంతో ఉపయోగపడుతుందని ఏథర్ కంపెనీ తెలిపింది. వాయిస్ కమాండ్స్, మల్టీ-లాంగ్వేజ్ సపోర్ట్, హెవీ గ్రాఫిక్స్, డీపర్ డయగ్నోస్టిక్స్ వంటి భవిష్యత్తులో రాబోవు ఫీచర్లకు ఈ డ్యాష్ బోర్డ్ సపోర్ట్ చేస్తుందని ఏథర్ కంపెనీ వెల్లడించింది.

ఏథర్ 450ఎక్స్ జెన్ 3 స్కూటర్ లో సరికొత్త రియర్ వ్యూ మిర్రర్ ను అమర్చారు. ఇది మెయిన్ ఫ్రేమ్ తో ఇంటిగ్రేట్ చేయబడటం విశేషం. ఇది రెండు రెట్లు ఉత్తమమైన విజిబులిటీని అందిస్తుందని ఏథర్ కంపెనీ చెబుతోంది. అలాగే ఏథర్ 450ఎక్స్ జెన్ 3 కొత్త స్టాండ్ డిజైన్ తో వస్తోంది.

The post భారత్ లో లాంచ్ అయిన Ather 450X Gen 3 ఎలక్ట్రిక్ స్కూటర్ first appeared on 91Mobiles Telugu.

]]>