August 2024 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Sat, 27 Jul 2024 19:36:12 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Upcoming Phones: 2024 ఆగస్టులో భారత్‌లో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు ఇవే https://www.91mobiles.com/telugu/upcoming-smartphones-august-2024-india/ https://www.91mobiles.com/telugu/upcoming-smartphones-august-2024-india/#respond Sat, 27 Jul 2024 18:28:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=12721 2024 సంవత్సరంలో సగం కంటే ఎక్కువే కాలం గడిచిపోయింది. ఈ సమయంలో ఎన్నో మొబైల్ ఫోన్లు మార్కెట్ లోకి అడుగుపెట్టాయి. అయితే రాబోయే ఆగస్టు నెలలో మరిన్ని స్మార్ట్‌ఫోన్లు లాంచ్ కాబోతున్నాయి. వీటిలో తక్కువ బడ్జెట్ ఫోన్ల నుంచి ప్రీమియమ్ సెగ్మెంట్ ఫోన్ల వరకు వివిధ రకాల ఫోన్లు ఉన్నాయి. ఇక్కడ మీకోసం ఆగస్టు నెలలో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్ల జాబితాను అందిస్తున్నాం. ఓసారి చదివి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఆగస్టులో లాంచ్ కానున్న స్మార్ట్‌ఫోన్లు POCO […]

The post Upcoming Phones: 2024 ఆగస్టులో భారత్‌లో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు ఇవే first appeared on 91Mobiles Telugu.

]]>

2024 సంవత్సరంలో సగం కంటే ఎక్కువే కాలం గడిచిపోయింది. ఈ సమయంలో ఎన్నో మొబైల్ ఫోన్లు మార్కెట్ లోకి అడుగుపెట్టాయి. అయితే రాబోయే ఆగస్టు నెలలో మరిన్ని స్మార్ట్‌ఫోన్లు లాంచ్ కాబోతున్నాయి. వీటిలో తక్కువ బడ్జెట్ ఫోన్ల నుంచి ప్రీమియమ్ సెగ్మెంట్ ఫోన్ల వరకు వివిధ రకాల ఫోన్లు ఉన్నాయి. ఇక్కడ మీకోసం ఆగస్టు నెలలో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్ల జాబితాను అందిస్తున్నాం. ఓసారి చదివి పూర్తి వివరాలు తెలుసుకోండి.

ఆగస్టులో లాంచ్ కానున్న స్మార్ట్‌ఫోన్లు

POCO M6 Plus 5G

POCO M6 Plus 5G స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 1వ తేదీన భారత్ లో లాంచ్ అవుతోంది. దీని అంచనా ధర రూ.12,999 గా ఉంటుందని భావిస్తున్నారు. రూ.15,000 లోపు ధరతో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్, 8జిబి ర్యామ్, 108ఎంపి ప్రైమరీ కెమెరా, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6.79-ఇంచ్ ఫుల్‌హెచ్డీ డిస్ప్లే ఈ ఫోన్ లో ఉంటాయని సమాచారం.

Infinix Note 40X 5G

Infinix Note 40X 5G స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 5వ తేదీన భారత్ లో లాంచ్ అవుతోంది. 108ఎంపి ప్రైమరీ కెమెరా, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 120 హెర్ట్జ్ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ తో ఈ ఫోన్ వస్తోంది. ఈ ఫోన్ ధర రూ.16,999 గా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

Motorola Edge 50 5G

Motorola Edge 50 5G స్మార్ట్‌ఫోన్ రూ.32,990 ధరతో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్, 12జిబి ర్యామ్, 32ఎంపి ఫ్రంట్ కెమెరా, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, ఓఎల్ఈడీ ప్యానెల్, 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 4400 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉంటాయని సమాచారం.

iQOO Z9s 5G

iQOO Z9s 5G సిరీస్ ఆగస్టులో లాంచ్ అవుతోంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్ లో భాగంగా వస్తోన్న iQOO Z9s 5G లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్, 8జిబి ర్యామ్, 50ఎంపి మెయిన్ కెమెరా, 16ఎంపి ఫ్రంట్ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఈ ఫోన్ ధర రూ.19,999 ఉంటుందని అంచనా వేస్తున్నారు.

iQOO Z9s Plus

iQOO Z9s Plus ఆగస్టు నెలలోనే భారత్ లో లాంచ్ అవుతుందని సమాచారం. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇంకా బయటకు రాలేదు. కానీ, ఈ ఫోన్ లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్, 12జిబి ర్యామ్, 50ఎంపి కెమెరా, 16ఎంపి ఫ్రంట్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయని లీక్స్ ద్వారా తెలుస్తోంది. ఈ ఫోన్ ధర రూ.24,999 గా ఉండే అవకాశం ఉంది.

Vivo V40 5G

Vivo V40 సిరీస్ భారత్ లో లాంచ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ సిరీస్ భారత్ లో ఆగస్టు 15 కంటే ముందే లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సిరీస్ లో భాగంగా వస్తోన్న Vivo V40 5G ఫోన్ లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, 12జిబి ర్యామ్, 6.78-ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్, 50ఎంపి ఫ్రంట్ కెమెరా, 50ఎంపి మెయిన్ కెమెరా, 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఈ ఫోన్ ధర రూ.34,900 ఉంటుందని అంచనా వేస్తున్నారు.

The post Upcoming Phones: 2024 ఆగస్టులో భారత్‌లో లాంచ్ కాబోయే స్మార్ట్‌ఫోన్లు ఇవే first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/upcoming-smartphones-august-2024-india/feed/ 0