Auto Expo 2023 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 09 Mar 2023 06:13:38 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 2024 లో లాంచ్ కానున్న Tata Harrier EV https://www.91mobiles.com/telugu/tata-harrier-launch-timeline-first-look-auto-expo-2023/ Fri, 27 Jan 2023 09:34:15 +0000 https://www.91mobiles.com/telugu/?p=4662 Tata Motors త్వరలోనే Tata Harrier EV ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. 2024 లో Tata Harrier EV భారతీయ మార్కెట్ లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. Tata Harrier EV ని Auto Expo 2023 ఈవెంట్ లో టాటా మోటర్స్ ప్రదర్శించింది. ప్రస్తుతం మార్కెట్ లో ఎక్కువగా అమ్ముడవుతోన్న Tata Nexon EV కంటే ఎక్కువ సామర్థ్యంతో Tata Harrier EV రాబోతోంది. Tata Harrier EV కంపెనీ యొక్క సరికొత్త Gen 2 […]

The post 2024 లో లాంచ్ కానున్న Tata Harrier EV first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో భారత్ లో Tata Harrier EV ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోన్న Tata Motors
  • Auto Expo-2023 లో Tata Harrier EV ని ప్రదర్శించిన టాటా మోటర్స్
  • Nexon EV కంటే ఎక్కువ పవర్, రేంజ్ ని అందించనున్న Tata Harrier EV

Tata Motors త్వరలోనే Tata Harrier EV ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. 2024 లో Tata Harrier EV భారతీయ మార్కెట్ లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. Tata Harrier EV ని Auto Expo 2023 ఈవెంట్ లో టాటా మోటర్స్ ప్రదర్శించింది. ప్రస్తుతం మార్కెట్ లో ఎక్కువగా అమ్ముడవుతోన్న Tata Nexon EV కంటే ఎక్కువ సామర్థ్యంతో Tata Harrier EV రాబోతోంది.

Tata Harrier EV కంపెనీ యొక్క సరికొత్త Gen 2 ఆర్కిటెక్చర్ ఆధారంగా తయారుకానుంది. ఈ కొత్త ఆర్కిటెక్చర్ ప్రత్యేకించి ఎలక్ట్రిక్ వాహనాల కోసమే రూపొందించబడింది. కంపెనీ నుంచి భవిష్యత్తులో రాబోవు వాహనాల్లో కూడా ఇదే ప్లాట్ఫామ్ ని మనం చూడవచ్చు.

Tata Harrier EV లాంచ్

Tata Harrier EV టాటా యొక్క Gen 2 ప్లాట్ఫామ్ పై తయారు కానుంది. టాటా నెక్సాన్ తర్వాత మార్కెట్ లోకి వస్తోన్న టాటా ప్రీమియమ్ ఈవీ వెహికిల్ గా Tata Harrier EV నిలవనుంది. 2024 లో టాటా సంస్థ Tata Harrier EV ని లాంచ్ చేయనుందని సమాచారం. ప్రస్తుతం వివిధ అభివృద్ధి దశల్లో ఉన్న Tata Harrier EV కారు త్వరలోనే టెస్టింగ్ కి వెళ్ళనుంది. టాటా నెక్సాన్ ఈవీ, టాటా టియోగో ఈవీ లతో పోల్చితే Tata Harrier EV విభిన్నంగా ఉండనుంది.

Tata Harrier EV యొక్క Gen 2 ప్లాట్ఫామ్ ఐసీఈ నుంచి తీసుకోబడిన చాసిస్. అయితే దీనిపై ఎంతగానో రీవర్క్ చేసి ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ కి సరిపోయే విధంగా మార్చారు. ఫ్యూయల్ ట్యాంక్ ఏరియా, సెంట్రల్ స్పైన్ వంటి వాటికి మార్పులు చేశారు. చాసిస్ కూడా తేలికగా ఉండి, తక్కువ శక్తిని వాడుకునే విధంగా ఉండనుంది.

Tata Harrier EV భారీ బ్యాటరీ ప్యాక్ తో రానుందని సమాచారం. నెక్సాన్ తో పోల్చితే ఇంకా శక్తివంతమైన మోటర్ హ్యారియర్ లో ఉండనుంది. దీంతో Tata Harrier EV మరింత మెరుగైన పెర్ఫామెన్స్, రేంజ్ ని ఇవ్వనుంది. డ్యూయల్ మోటర్ సెటప్ ని ఉపయోగించుకునే AWD సిస్టమ్ తో Tata Harrier EV వస్తున్నట్లు సమాచారం.

Tata Harrier EV రివైజ్ చేయబడిన స్టైలింగ్, రిడిజైన్ చేయబడిన ఎల్ఈడీ లైటింగ్, బ్లాక్డ్ ఔట్ ఫ్రంట్ గ్రిల్, ఆంగ్యులర్ బంపర్ డిజైన్, కొత్త మెష్ డిజైన్ (ఎయిర్ డ్యామ్ కోసం), భారీ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ తదితర ఫీచర్లతో రానుంది. ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, Tata Harrier EV 360-డిగ్రీ కెమెరా, 10.25-ఇంచ్ టచ్ స్క్రీన్, ఎయిర్ ప్యూరిఫైయర్, వెంటిలేటెడ్ సీట్స్, ఏడీఏఎస్ ఫంక్షనాలిటీ వంటి ఫీచర్లతో వస్తోంది. Tata Harrier EV ధర, లాంచ్ టైమ్‌లైన్ తదితర వివరాలు ఇంకా తెలియలేదు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 2024 లో లాంచ్ కానున్న Tata Harrier EV first appeared on 91Mobiles Telugu.

]]>
అదిరిపోయే ఫీచర్లతో వస్తోన్న LML Star ఎలక్ట్రిక్ స్కూటర్ https://www.91mobiles.com/telugu/lml-star-electric-scooter-auto-expo-2023/ Thu, 12 Jan 2023 11:53:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=4453 హైలైట్స్ నేడు Auto Expo 2023 ఈవెంట్ లో ప్రదర్శితమైన LML Star ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమైజబుల్ ఇంటరాక్టివ్ డిస్ప్లే తో వస్తోన్న LML Star ఎలక్ట్రిక్ స్కూటర్ రిమూవబుల్ బ్యాటరీ, రివర్స్ పార్క్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఈ స్కూటర్ లో ప్రధాన ఫీచర్స్ గతంలో ఎన్నో ఏళ్ళు LML ద్విచక్ర వాహనాలు భారత మార్కెట్ లో ఆదిపత్యం చెలాయించాయి. అందుబాటు ధరల్లో లభించే LML స్కూటర్లకు అప్పట్లో జనాల్లో మంచి ఆదరణ […]

The post అదిరిపోయే ఫీచర్లతో వస్తోన్న LML Star ఎలక్ట్రిక్ స్కూటర్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • నేడు Auto Expo 2023 ఈవెంట్ లో ప్రదర్శితమైన LML Star ఎలక్ట్రిక్ స్కూటర్
  • కస్టమైజబుల్ ఇంటరాక్టివ్ డిస్ప్లే తో వస్తోన్న LML Star ఎలక్ట్రిక్ స్కూటర్
  • రిమూవబుల్ బ్యాటరీ, రివర్స్ పార్క్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఈ స్కూటర్ లో ప్రధాన ఫీచర్స్

గతంలో ఎన్నో ఏళ్ళు LML ద్విచక్ర వాహనాలు భారత మార్కెట్ లో ఆదిపత్యం చెలాయించాయి. అందుబాటు ధరల్లో లభించే LML స్కూటర్లకు అప్పట్లో జనాల్లో మంచి ఆదరణ ఉండేది. అయితే కొన్నాళ్ళుగా ఎల్ఎంఎల్ నుంచి స్కూటర్ లాంచెస్ లేవు. ఇప్పుడు LML లవర్స్ కి తీపి కబురు వచ్చేసింది. తాజాగా ఈ కంపెనీ Auto Expo 2023 లో LML Star ఎలక్ట్రిక్ స్కూటర్ ని పరిచయం చేసింది. ఈ LML Star స్కూటర్ గ్రేట్ లుక్, అట్రాక్టివ్ ఫీచర్స్ తో వచ్చింది. కస్టమైజబుల్ ఇంటరాక్టివ్ డిస్ప్లే, రిమూవబుల్ బ్యాటరీతో వస్తోన్న LML Star ఎలక్ట్రిక్ స్కూటర్ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

ఎల్ఎంఎల్ స్టార్ ఫీచర్స్

  • కస్టమైజబుల్ ఇంటరాక్టివ్ డిస్ప్లే
  • రిమూవబుల్ బ్యాటరీ
  • రివర్స్ పార్క్ అసిస్ట్
  • టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్
  • ఇంటెగ్రేటెడ్ ఇండికేటర్ లైట్స్
  • యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్)
  • లైట్ యాంబియెంట్
  • ఇంటెగ్రేటెడ్ డీఆర్ఎల్

LML Star ఎలక్ట్రిక్ స్కూటర్ ని భారత్ మరియు ఇటలీకి చెందిన ప్రొఫెషనల్స్ కలిసి తయారు చేశారు. ఈ స్కూటర్ భారత్ లో తయారైంది. ఈ స్కూటర్ రిమూవబుల్ బ్యాటరీతో వస్తోంది. అంటే బ్యాటరీ ప్యాక్ నుంచి బ్యాటరీని తొలగించి సెపరేట్ గా చార్జ్ చేసుకోవచ్చు. LML Star ని కంపెనీ పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ స్కూటర్ గా అభివర్ణిస్తోంది. ఏబీఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), రివర్స్ పార్క్ అసిస్ట్ మరియు టీపీఎంఎస్ (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్) వంటి ఫీచర్స్ ఉన్నాయి.

LML Star ఈ-స్కూటర్ లో ఏ పవర్ మోటర్ వాడారో కంపెనీ వెల్లడించలేదు. మోటర్ మరియు బ్యాటరీల అమరిక అనేది స్మూథ్, కంఫర్టబుల్ రైడ్ ని అందిస్తుందని ఎల్ఎంఎల్ కంపెనీ చెబుతోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లైట్ యాంబియంట్, ఇంటెగ్రేటెడ్ డీఆర్ఎల్, బ్యాక్ లైట్స్, ఇంటెగ్రేటెడ్ ఇండికేటర్స్ తో వస్తోంది. దీని వల్లన స్కూటర్ లుక్ అట్రాక్టివ్ గా ఉంది.

ఎల్ఎంఎల్ స్టార్ ధర రూ.1,25,000 ఉండనుందని అంచనా

LML Star ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క సేల్ తేదీని ఇంకా ప్రకటించలేదు. ఇక ధర గురించి మాట్లాడితే, ప్రస్తుతానికి ధర వివరాలు కూడా కంపెనీ రహస్యంగానే ఉంచింది. అంచనా ప్రకారం, ఈ స్కూటర్ ఖరీదు రూ.1,25,000 ఉండనుంది. అయితే స్కూటర్ వేరియంట్స్ మరియు మోడల్స్ ని బట్టి LML Star ధరలో మార్పు ఉంటుంది. త్వరలోనే ఎల్ఎంఎల్ కంపెనీ నుంచి స్టార్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్, విక్రయానికి సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post అదిరిపోయే ఫీచర్లతో వస్తోన్న LML Star ఎలక్ట్రిక్ స్కూటర్ first appeared on 91Mobiles Telugu.

]]>
500km రేంజ్ తో వస్తోన్న Maruti Suzuki ఎలక్ట్రిక్ కారు https://www.91mobiles.com/telugu/maruti-suzuki-e-suv-auto-expo-2023/ Mon, 26 Dec 2022 14:18:35 +0000 https://www.91mobiles.com/telugu/?p=4179 హైలైట్స్ త్వరలోనే భారత్ లో లాంచ్ కానున్న మారుతి సుజుకీ యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఆటో ఎక్స్‌పో 2023 లో ప్రదర్శనకు సిద్ధంగా ఉన్న మారుతి సుజుకీ ఈ-ఎస్‌యూవీ YY8 అనే కోడ్ నంబర్ ని కలిగి ఉన్న మారుతి సుజుకీ ఈ-ఎస్‌యూవీ 2025 జనవరి-ఫిబ్రవరి మధ్య లాంచ్ కానున్న Maruti Suzuki YY8 e-SUV మారుతి సుజుకీ ఇండియా త్వరలో జరగబోయే Auto Expo 2023 లో భారత్ లో లాంచ్ చేయబోవు తన […]

The post 500km రేంజ్ తో వస్తోన్న Maruti Suzuki ఎలక్ట్రిక్ కారు first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • త్వరలోనే భారత్ లో లాంచ్ కానున్న మారుతి సుజుకీ యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు
  • ఆటో ఎక్స్‌పో 2023 లో ప్రదర్శనకు సిద్ధంగా ఉన్న మారుతి సుజుకీ ఈ-ఎస్‌యూవీ
  • YY8 అనే కోడ్ నంబర్ ని కలిగి ఉన్న మారుతి సుజుకీ ఈ-ఎస్‌యూవీ
  • 2025 జనవరి-ఫిబ్రవరి మధ్య లాంచ్ కానున్న Maruti Suzuki YY8 e-SUV

మారుతి సుజుకీ ఇండియా త్వరలో జరగబోయే Auto Expo 2023 లో భారత్ లో లాంచ్ చేయబోవు తన తొలి ఎలక్ట్రిక్ కారుని ప్రదర్శించనుంది. ఎస్‌యూవీ గా వస్తోన్న ఈ ఎలక్ట్రిక్ కారు డైమెన్షన్స్ హ్యాందాయ్ క్రెటాను పోలి ఉంటాయి. Maruti Suzuki YY8 e-SUV కారు కొన్ని బెంచ్ మార్క్ స్టాండర్డ్స్ ని సెట్ చేయనుందని అంచనా వేస్తున్నారు. ఇకపోతే ఈ కారు 500 కిలోమీటర్ల రేంజ్ తో వస్తున్నట్లు సమాచారం.

టాటా మోటర్స్, మహింద్రా ఇప్పటికే ఈవీ సెగ్మెంట్ లో అగ్రభాగాన్ని లాగేసుకున్నాయి. అయితే మారుతి సుజుకీ మాత్రం వీటికంటే ఎంతో ఆలస్యంగా ఈవీ సెగ్మెంట్ లోకి అడుగుపెడుతోంది. మరి లేటుగా వస్తున్నందున ఏమేరకు ప్రభావం చూపించనుందో చూడాలి.

Auto Expo 2023 లో ప్రదర్శనకు రానున్న Maruti Suzuki YY8 e-SUV

ఆటోకార్ ఇండియా కథనం ప్రకారం, మారుతి నుంచి రానున్న కాంపాక్ట్ ఈ-ఎస్‌యూవీ కారు హ్యాందాయ్ క్రెటా అంత పెద్దదిగా ఉంటుంది. ఇకపోతే సింగిల్ చార్జ్ పై మారుతి ఎలక్ట్రిక్ కారు 500 కిలోమీటర్ల దూరం పరుగు తీస్తుందని కంపెనీ చెబుతోంది. మారుతి తన యొక్క కొత్తదైన ఎలక్ట్రిక్ స్కేట్‌బోర్డ్ ఆర్కిటెక్చర్ ని టొయోటా తో కలిసి అభివృద్ధి చేసింది. తర్వాత టొయోటా కూడా తన బ్రాండ్ పేరుతో మారుతి వంటి ఒక ఈ-ఎస్‌యూవీని తీసుకురానుంది.

మారుతి సుజుకీ తన నుంచి రాబోవు ఎలక్ట్రిక్ కారుకి YY8 అనే కోడ్ నేమ్ పెట్టింది. ఈ ఎలక్ట్రిక్ కారు 27PL ప్లాట్ఫామ్ పై తయారు కానుంది. ఇది Toyota యొక్క 40PL గ్లోబల్ ప్లాట్ఫామ్ పై తయారైంది. ఈ ప్లాట్ఫామ్ పొడవైన వీల్‌బేస్, భారీ బ్యాటరీ ప్యాక్, విశాలమైన క్యాబిన్ స్పేస్ ని అందిస్తుంది. ఈ కారు యొక్క డిజైన్, కారులో స్పేస్ ని పెంచేందుకు వీలుగా తీర్చిదిద్దబడింది. దీని వల్లన వీల్స్ చాసిస్ యొక్క కార్నర్స్ కి చేర్చబడతాయి. దీని వల్లన తక్కువ స్థాయిలో ఓవర్‌హ్యాంగ్స్ మరియు క్యాబిన్ స్పేస్ కి అవకాశం ఉంటుంది.

భారత్ లో Maruti Suzuki YY8 e-SUV ధర

మారుతి కంపెనీ ఈ కారు యొక్క ధరను రూ.13 లక్షల నుంచి రూ.15 లక్షల మధ్య పెట్టే అవకాశం ఉంది. దీంతో ఇది సెగ్మెంట్ లో వాల్యూ-ఫర్-మనీ కారుగా నిలవనుంది. Maruti Suzuki YY8 e-SUV కారు 2025 జనవరి-ఫిబ్రవరి మధ్యలో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 500km రేంజ్ తో వస్తోన్న Maruti Suzuki ఎలక్ట్రిక్ కారు first appeared on 91Mobiles Telugu.

]]>