Best gaming phones under 25k - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 20 Aug 2024 19:37:09 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Best gaming phones: రూ.25,000 లోపు బెస్ట్ గేమింగ్ ఫోన్లు (ఆగస్టు 2024) https://www.91mobiles.com/telugu/best-gaming-phones-under-rs-25000-india-august-2024/ https://www.91mobiles.com/telugu/best-gaming-phones-under-rs-25000-india-august-2024/#respond Sun, 18 Aug 2024 18:28:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=13041 గేమ్స్ ఆడేందుకు ఎక్కువగా ఇష్టపడే వారికి ఒక చక్కటి స్మార్ట్‌ఫోన్ ఎంతో అవసరం. మన దగ్గర ఉన్న బడ్జెట్ లో మంచి గేమింగ్ ఫోన్ కొనుక్కోవాలని అనుకుంటాం. ఇక రూ.25,000 బడ్జెట్ అనేది డీసెంట్ గేమింగ్ అనుభూతిని అందించే బాగా డిమాండ్ ఉన్న సెగ్మెంట్ గా ఉంది. మోస్తరు బడ్జెట్ లో మంచి గేమింగ్ ఫోన్ కొనాలని అనుకునే వారికి ఈ ప్రైస్ రేంజ్ బెటర్ ఆప్షన్. రూ.25,000 లోపు భారత్ లో అందుబాటులో ఉన్న బెస్ట్ […]

The post Best gaming phones: రూ.25,000 లోపు బెస్ట్ గేమింగ్ ఫోన్లు (ఆగస్టు 2024) first appeared on 91Mobiles Telugu.

]]>

గేమ్స్ ఆడేందుకు ఎక్కువగా ఇష్టపడే వారికి ఒక చక్కటి స్మార్ట్‌ఫోన్ ఎంతో అవసరం. మన దగ్గర ఉన్న బడ్జెట్ లో మంచి గేమింగ్ ఫోన్ కొనుక్కోవాలని అనుకుంటాం. ఇక రూ.25,000 బడ్జెట్ అనేది డీసెంట్ గేమింగ్ అనుభూతిని అందించే బాగా డిమాండ్ ఉన్న సెగ్మెంట్ గా ఉంది. మోస్తరు బడ్జెట్ లో మంచి గేమింగ్ ఫోన్ కొనాలని అనుకునే వారికి ఈ ప్రైస్ రేంజ్ బెటర్ ఆప్షన్. రూ.25,000 లోపు భారత్ లో అందుబాటులో ఉన్న బెస్ట్ గేమింగ్ ఫోన్ల జాబితాను 91mobiles టీమ్ కొన్ని టెస్టులు జరిపి తయారు చేసింది. ఓసారి ఆ లిస్ట్ తెలుసుకుందాం.

రూ.25,000 లోపు బెస్ట్ గేమింగ్ ఫోన్లు

స్మార్ట్‌ఫోన్ పేరు లాంచ్ తేదీ ధర
Infinix GT 20 Pro మే 21, 2024 రూ.24,999
OnePlus Nord CE 4 ఏప్రిల్ 1, 2024 రూ.24,999
Nothing Phone (2a) మార్చి 5, 2024 రూ.23,999
Motorola Edge 50 Fusion మే 16, 2024 రూ.22,999
Realme P1 Pro ఆగస్టు 15, 2024 రూ.21,999

 

Infinix GT 20 Pro

Infinix GT 20 Pro స్మార్ట్‌ఫోన్ ఈ సెగ్మెంట్ లో టాప్ పెర్ఫార్మర్‌గా నిలిచింది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ ఉంది. ఈ ఫోన్ యొక్క ప్రారంభ ధర రూ.24,999 గా ఉంది. ఈ ఫోన్ లో వీసీ కూలింగ్ టెక్నాలజీని అందించారు. Infinix GT 20 Pro యొక్క అంటుటు బెంచ్‌మార్క్ స్కోర్ 9,36,985 గా ఉంది. ఈ సెగ్మెంట్ లో ఇదే హయ్యస్ట్ స్కోర్. ఇక గీక్‌బెంచ్ పై సింగిల్-కోర్ టెస్ట్ లో 1020 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 3384 పాయింట్లు స్కోర్ చేసింది. బీజీఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ, జెన్షిన్ ఇంపాక్ట్ వంటి గేమ్స్‌ను ఈ ఫోన్ స్మూథ్ గా హ్యాండిల్ చేయగలదు.

గేమింగ్ కు ముందు Infinix GT 20 Pro యొక్క టెంపరేచర్ 29.1 గా ఉంది. 30 నిమిషాల పాటు గేమ్ ఆడాక, టెంపరేచర్ 32.2 కు చేరింది. బ్యాటరీ కేవలం 7 శాతం ఖర్చయ్యింది.

బీజీఎంఐ గ్రాఫిక్స్ సెట్టింగ్స్ అల్ట్రా హెచ్డీఆర్
బీజీఎంఐ ఎఫ్‌పీఎస్ అల్ట్రా
గేమింగ్‌కు ముందు టెంపరేచర్ 29.1
30 నిమిషాలు గేమ్ ఆడాక 32.2
బ్యాటరీ డ్రాప్ శాతం 7%

 

OnePlus Nord CE 4

OnePlus Nord CE 4 స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీతో వచ్చింది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.24,999 గా ఉంది. ఈ ఫోన్ 8,19,347 అంటుటు స్కోర్ నమోదు చేసింది. గీక్‌బెంచ్ పై సింగిల్-కోర్ టెస్ట్ లో 1138 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2950 పాయింట్లు స్కోర్ చేసింది. OnePlus Nord CE 4 డివైజ్ బీజీఎంఐ గేమ్‌ను మ్యాగ్జిమమ్ గ్రాఫిక్స్ మరియు ఫ్రేమ్ రేట్ సెట్టింగ్స్ లో ఈజీగా హ్యాండిల్ చేస్తుంది.

OnePlus Nord CE 4 డివైజ్ 30 నిమిషాల పాటు గేమ్ ఆడాక, టెంపరేచర్ 38.5 కు చేరుకుంది. అంతకు ముందు 30.4 గా ఉంది. బ్యాటరీ 7 శాతం డ్రాప్ అయ్యింది.

బీజీఎంఐ గ్రాఫిక్స్ సెట్టింగ్స్ అల్ట్రా హెచ్డీఆర్
బీజీఎంఐ ఎఫ్‌పీఎస్ 60
గేమింగ్‌కు ముందు టెంపరేచర్ 30.4
గేమ్ ఆడాక టెంపరేచర్ 38.5
బ్యాటరీ డ్రాప్ పర్సంటేజీ 7 శాతం

Nothing Phone (2a)

Nothing Phone (2a) స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రో చిప్సెట్ తో లాంచ్ అయ్యింది. దీని ప్రారంభ ధర రూ.23,999 గా ఉంది. 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీని ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది. అంటుటు పై ఈ ఫోన్ 7,07,480 పాయింట్ల స్కోర్ నమోదు చేసింది. గీక్‌బెంచ్ పై ఈ ఫోన్ సింగిల్-కోర్ టెస్ట్ లో 1068 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2454 పాయింట్లు స్కోర్ నమోదు చేసింది.

30 నిమిషాల పాటు గేమ్ ఆడాక, Nothing Phone (2a) ఫోన్ యొక్క టెంపరేచర్ 29.8 నుంచి 37.8 కి పెరిగింది. అయితే, బ్యాటరీ 10 శాతం ఖర్చయ్యింది.

బీజీఎంఐ గ్రాఫిక్స్ సెట్టింగ్స్ హెచ్డీఆర్
బీజీఎంఐ ఎఫ్‌పీఎస్ అల్ట్రా
గేమింగ్ కు ముందు టెంపరేచర్ 29.8
గేమింగ్ తర్వాత టెంపరేచర్ 37.8
బ్యాటరీ డ్రాప్ పర్సంటేజీ 10 శాతం

Motorola Edge 50 Fusion

Motorola Edge 50 Fusion లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ వాడారు. ఈ ఫోన్ 12జిబి ర్యామ్ మరియు 256జిబి స్టోరేజీతో వచ్చింది. ఎడ్జ్ 50 ఫ్యూజన్ యొక్క అంటుటు స్కోర్ 6,20,648 పాయింట్లుగా ఉంది. గీక్‌బెంచ్ పై సింగిల్-కోర్ టెస్ట్ లో 1020 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2945 పాయింట్లు నమోదు చేసింది. అల్ట్రా హెచ్డీఆర్ గ్రాఫిక్స్ సెట్టింగ్స్ + 60 ఫ్రేమ్ రేట్ తో బీజీఎంఐ గేమ్‌ని ఈ ఫోన్ ఈజీగా హ్యాండిల్ చేస్తుంది.

30 నిమిషాల పాటు గేమ్ ఆడాక, Motorola Edge 50 Fusion డివైజ్ టెంపరేచర్ 34.3 వరకు పెరిగింది. అంతకు ముందు ఇది 26.8 గా ఉంది. బ్యాటరీ డ్రాప్ 9 శాతంగా ఉంది.

బీజీఎంఐ గ్రాఫిక్స్ సెట్టింగ్స్ అల్ట్రా హెచ్డీఆర్
బీజీఎంఐ ఎఫ్‌పీఎస్ 60
గేమింగ్‌కు ముందు టెంపరేచర్ 26.8
30నిమిషాల గేమింగ్ తర్వాత టెంపరేచర్ 34.3
బ్యాటరీ డ్రాప్ పర్సంటేజీ 9%

Realme P1 Pro

Realme P1 Pro స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి. ఈ ఫోన్ 5,92,957 అంటుటు స్కోర్ నమోదు చేసింది. గీక్‌బెంచ్‌పై సింగిల్-కోర్ టెస్ట్ లో 929 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2680 పాయింట్లు సాధించింది. 91మొబైల్స్ జరిపిన టెస్టింగ్ లో ఈ డివైజ్ గేమింగ్ విషయంలో మంచి పెర్ఫామెన్స్ కనబరిచింది.

గేమింగ్‌కు ముందు Realme P1 Pro యొక్క టెంపరేచర్ 31.5 గా ఉంది. 30 నిమిషాల గేమింగ్ తర్వాత టెంపరేచర్ 37.6 కు పెరిగింది. బ్యాటరీ 9 శాతం డ్రాప్ అయ్యింది.

బీజీఎంఐ గ్రాఫిక్స్ సెట్టింగ్స్ అల్ట్రా హెచ్డీఆర్
బీజీఎంఐ ఎఫ్‌పీఎస్ 60
గేమింగ్‌కు ముందు టెంపరేచర్ 31.5
30నిమిషాల గేమింగ్ తర్వాత టెంపరేచర్ 37.6
బ్యాటరీ డ్రాప్ పర్సంటేజీ 9%

The post Best gaming phones: రూ.25,000 లోపు బెస్ట్ గేమింగ్ ఫోన్లు (ఆగస్టు 2024) first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/best-gaming-phones-under-rs-25000-india-august-2024/feed/ 0