boAt Smart Ring - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 21 Jul 2023 07:02:16 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 హార్ట్ రేట్ మానిటర్, బాడీ టెంపరేచర్ సెన్సర్ తో Smart Ring ని అనౌన్స్ చేసిన boAt https://www.91mobiles.com/telugu/boat-smart-ring-announced-india-key-specs-build-quality/ Fri, 21 Jul 2023 05:56:06 +0000 https://www.91mobiles.com/telugu/?p=7270 boAt Smart Ring భారత్ లో అనౌన్స్ అయ్యింది. ఫిట్నెస్ ట్రాకింగ్ స్మార్ట్ రింగ్ గా ఇది మార్కెట్ లోకి రానుంది. Oura Ring అనేది 2013 లో లాంచ్ అయి వెస్టర్న్ కంట్రీస్ లో హడావుడి చేసింది. ఇక భారత్ విషయానికి వస్తే, Ultrahuman Ring అనేది Oura Ring కి ప్రత్యామ్నాయంగా నిలుస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు బోట్ కంపెనీ తన Smart Ring తో అల్ట్రాహ్యూమన్ రింగ్ కి చెక్ పెట్టాలని చూస్తోంది. […]

The post హార్ట్ రేట్ మానిటర్, బాడీ టెంపరేచర్ సెన్సర్ తో Smart Ring ని అనౌన్స్ చేసిన boAt first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • ఇంకా రిలీజ్ డేట్ ని ప్రకటించని బోట్ సంస్థ
  • సిరామిక్, మెటల్ తో తయారైన స్మార్ట్ రింగ్
  • అల్ట్రాహ్యూమన్ రింగ్ కి ప్రత్యామ్నాయంగా నిలవనున్న స్మార్ట్ రింగ్

boAt Smart Ring భారత్ లో అనౌన్స్ అయ్యింది. ఫిట్నెస్ ట్రాకింగ్ స్మార్ట్ రింగ్ గా ఇది మార్కెట్ లోకి రానుంది. Oura Ring అనేది 2013 లో లాంచ్ అయి వెస్టర్న్ కంట్రీస్ లో హడావుడి చేసింది. ఇక భారత్ విషయానికి వస్తే, Ultrahuman Ring అనేది Oura Ring కి ప్రత్యామ్నాయంగా నిలుస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు బోట్ కంపెనీ తన Smart Ring తో అల్ట్రాహ్యూమన్ రింగ్ కి చెక్ పెట్టాలని చూస్తోంది. ఇకపోతే boAt Smart Ring స్టైలిష్ సిరామిక్, మెటల్ బాడీతో వస్తోంది. ఈ రింగ్ హార్ట్‌రేట్ మానిటర్, ఎస్పీఓ2 ట్రాకర్, స్లీప్ ట్రాకర్ తదితర సెన్సర్స్ ని కలిగి ఉంటుంది.

భారత్ లో boAt Smart Ring ధర, లభ్యత

boAt Smart Ring భారత్ లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బోట్ అధికార ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. అయితే, కంపెనీ ఈ రింగ్ విడుదల తేదీని, ధరను ఇంకా రివీల్ చేయలేదు. రానున్న రోజుల్లో boAt Smart Ring ధర, విడుదల తేదీ తెలియనున్నాయి.

boAt Smart Ring స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

హెల్త్, వెల్నెస్ వేరబుల్ ఫీచర్లు boAt Smart Ring లో ఉండనున్నాయి. ఇవి సర్వసాధారణంగా మనం రోజూ వాడే, చూసే స్మార్ట్‌వాచెస్, స్మార్ట్‌ఫోన్లలో కనిపిస్తుంటాయి. యూజర్లకు ఈ boAt Smart Ring తమ హెల్త్ ని మానిటర్ చేసుకోవడంలో బాగా ఉపయోగపడుతుందని కంపెనీ చెబుతోంది. ఇకపోతే ఈ boAt Smart Ring సిరామిక్, మెటల్ బాడీతో తయారవ్వడం వల్లన బిల్ట్ క్వాలిటీ అద్భుతంగా ఉండనుంది.

boAt Smart Ring లో వేసిన అడుగులు, నడిచిన దూరం, కరిగించిన కెలోరీలు తదితర ఫీచర్లు ఉన్నాయి. దీంతో గోల్ సెట్ చేసుకుని అచీవ్ అవ్వడం తేలికవ్వనుంది. అలాగే ఈ boAt Smart Ring లో గుండె ఆరోగ్యానికి పనికొచ్చే పీచర్లు ఉన్నాయి. హార్ట్ రేట్ వేరబులిటీ ఈ రింగ్ లో ఉంది.

boAt Smart Ring నిద్రించిన సమయం, ప్యాటర్న్స్, వివిధ నిద్రాణ దశలు, నిద్ర భంగం.. ఇటువంటి వాటిని మానిటర్ చేసి యూజర్ కి రిపోర్ట్ అందిస్తుంది. అలాగే SpO2, బాడీ టెంపరేచర్ మానిటర్ ఇందులో ఉన్నాయి.

ఫీమేల్ యూజర్ల కోసం ఈ స్మార్ట్ రింగ్ లో మెన్‌స్ట్రువల్ ట్రాకర్ ఉంది. ఇది సైకిల్స్ ని అంచనా వేసి, నోటిఫికేషన్స్, రిమైండర్స్ ద్వారా యూజర్ ని అలర్ట్ చేస్తుంది. బోట్ స్మార్ట్ రింగ్ కంపానియన్ యాప్ తో వస్తోంది. ఇది అన్ని స్టాట్స్, వైటల్స్ ని యూజర్లకు అందిస్తుంది. ఇంకా ఈ boAt Smart Ring స్మార్ట్ టచ్ కంట్రోల్ తో వస్తోంది. దీని ద్వారా సింగిల్-హ్యాండెడ్ మూవ్‌మెంట్స్, జెశ్చర్ కంట్రోల్ వంటి ఫీచర్లను కంపాటిబుల్ డివైజెస్ తో వాడవచ్చు.

The post హార్ట్ రేట్ మానిటర్, బాడీ టెంపరేచర్ సెన్సర్ తో Smart Ring ని అనౌన్స్ చేసిన boAt first appeared on 91Mobiles Telugu.

]]>