Bounce Infinity E1 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 22 Jul 2022 15:20:03 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 నేటి నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా అందుబాటులోకి Bounce Infinity E1 ఎలక్ట్రిక్ స్కూటర్ https://www.91mobiles.com/telugu/bounce-infinity-e1-electric-scooter-launched-via-flipkart-price/ Fri, 22 Jul 2022 15:20:03 +0000 https://www.91mobiles.com/telugu/?p=1185 హైలైట్స్: బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్, ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ ప్రారంభం ప్రస్తుతం ఐదు నగరాలకు అందుబాటులోకి ఈ-స్కూటర్ 15 రోజుల్లోగా బండిని డెలివరీ చేయడంతోపాటు, కస్టమర్లకు ఆర్టీవో, ఇన్సూరెన్స్ విషయాల్లో సాయం చేస్తామని ప్రకటించిన బౌన్స్ కంపెనీ   నేడు ఫ్లిప్ కార్ట్ పై బౌన్స్ కంపెనీ బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ-స్కూటర్ ను కూడా ఆర్డర్ చేసుకునే […]

The post నేటి నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా అందుబాటులోకి Bounce Infinity E1 ఎలక్ట్రిక్ స్కూటర్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్, ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ ప్రారంభం
  • ప్రస్తుతం ఐదు నగరాలకు అందుబాటులోకి ఈ-స్కూటర్
  • 15 రోజుల్లోగా బండిని డెలివరీ చేయడంతోపాటు, కస్టమర్లకు ఆర్టీవో, ఇన్సూరెన్స్ విషయాల్లో సాయం చేస్తామని ప్రకటించిన బౌన్స్ కంపెనీ

 

నేడు ఫ్లిప్ కార్ట్ పై బౌన్స్ కంపెనీ బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ-స్కూటర్ ను కూడా ఆర్డర్ చేసుకునే అవకాశం ఉంది. ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ పై బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1, సదరు కంపెనీ యొక్క తొలి స్కూటర్. దేశ వ్యాప్తంగా ఉన్న ఐదు ప్రధాన నగరాల్లో తొలుత తమ బండిని చేరవేయాలని కంపెనీ భావిస్తోంది.

బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 మార్చుకునే వీలు కలిగిన 2KWhr 48V బ్యాటరీ ప్యాక్ ని కలిగి ఉంది. ఇది 85 కిలోమీటర్ల రైడింగ్ రేంజ్ తో వస్తోంది. ఈ బ్యాటరీ, బీఎల్డీసీ ఎలక్ట్రిక్ మోటర్ ని కలిగి ఉంది. కాగా, ఈ స్కూటర్ గంటకు 65 కిలో మీటర్ల గరిష్ట వేగంతో వెళ్ళగలదు. ఈ స్కూటర్ బ్యాటరీ 4 గంటల్లో ఫుల్ చార్జ్ అవుతుంది. ఎల్సీడీ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఈడీ లైటింగ్ సెటప్, ఐదు రంగుల ఆప్షన్స్ తో బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 స్కూటర్ వస్తోంది.

Bounce Infinity E1 ధర, ఫ్లిప్ కార్ట్ లో లభ్యత

ఫ్లిప్ కార్ట్ ద్వారా అమ్ముడు కానున్న స్కూటర్లలో మొదటి స్కూటర్ బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1. భారతదేశ వ్యాప్తంగా ఉన్న 5 నగరాల్లో ఈ స్కూటర్ సేల్ కి వస్తోంది. ఢిల్లీ, గుజరాత్, తెలంగాణ, మహారాష్ట్రలకు చెందిన కస్టమర్లకు ముందస్తు బుకింగ్ సౌకర్యాన్ని బౌన్స్ కంపెనీ ఆఫర్ చేస్తోంది.

15 రోజుల్లోగా ఈ-స్కూటర్ ని ఇంటి వద్దకే డెలివరీ చేస్తామని బౌన్స్, ఫ్లిప్ కార్ట్ లు చెబుతున్నాయి. బుకింగ్ చేసిన వెంటనే, దగ్గర్లోని బౌన్స్ డీలర్షిప్ వారు కస్టమర్లని సంప్రదిస్తారు. అప్పుడు వారు కస్టమర్ కి ఆర్టీవో రిజిస్ట్రేషన్స్, ఇన్సూరెన్స్ తదితర విషయాల్లో సాయం అందిస్తారు. రియల్ టైమ్ ట్రాకింగ్ అప్డేట్స్ ఇవ్వడానికి బౌన్స్ ఇన్ఫినిటీ కస్టమర్ ఎక్స్ పీరియన్స్ టీమ్ ను కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు బౌన్స్ కంపెనీ చెబుతోంది.

దేశ వ్యాప్తంగా ఉన్న పలు ప్రాంతాల్లో బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 ఎక్స్ షోరూమ్ ధరలు

  • ఢిల్లీ – రూ.68,999
  • గుజరాత్ – రూ.59,999
  • మహారాష్ట్ర – రూ.69,999
  • రాజస్తాన్ – రూ.72,999
  • కర్ణాటక – రూ.68,999
  • ఇతర అన్ని రాష్ట్రాలు – రూ.79,999

కస్టమర్ ఎంచుకునే సబ్ స్క్రిప్షన్ మోడల్ పై బండి ధర ఆధారపడి ఉంటుంది. BAAS 1, BAAS 2 అనే రెండు సబ్ స్క్రిప్షన్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్స్ ద్వారా బౌన్స్ బ్యాటరీ స్వాపింగ్ నెట్వర్క్ ద్వారా బ్యాటరీని మార్చుకునే వీలుంటుంది. దీని ద్వారా స్కూటర్ యొక్క ధరను కూడా తగ్గించుకునే అవకాశాన్ని బౌన్స్ కలిగిస్తోంది. ఏ విధంగానో ఇక్కడ చూద్దాం.

బీఏఏఎస్ 1 ప్లాన్ (BAAS1 plan)

  • ఢిల్లీ – రూ.56,999
  • గుజరాత్ – రూ.47,999
  • మహారాష్ట్ర – రూ.57,999
  • రాజస్తాన్ – రూ.60,999
  • కర్ణాటక – రూ.56,999
  • మిగిలిన అన్ని రాష్ట్రాలు – రూ.67,999

ప్రారంభ ధరతో పాటు, కస్టమర్లు నెలవారీ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ కు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

  • బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ నెలవారి సబ్ స్క్రిప్షన్ – రూ.849
  • ఒక్క స్వాప్ కి ధర – రూ.35

దీని వల్లన ఒక కిలోమీటరుకి అయ్యే ఖర్చు రూ.0.65 అవుతుంది.

బీఏఏఎస్2 ప్లాన్ (BAAS2 plan)

  • ఢిల్లీ – రూ.45,099
  • గుజరాత్ – రూ.36,099
  • మహారాష్ట్ర – రూ.46,099
  • రాజస్తాన్ – రూ.49,099
  • కర్ణాటక – రూ.45,099
  • ఇతర అన్ని రాష్ట్రాలు – రూ.56,099

ఇక బండి ధర కాకుండా, కస్టమర్లు నెలవారీ సబ్ స్క్రిప్షన్ కు అయ్యే ఖర్చును భరించాల్సి ఉంటుంది.

  • బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ నెలవారీ సబ్ స్క్రిప్షన్ – రూ.1,249
  • ఒక్క స్వాప్ ధర – రూ.35

దీని వల్లన ఒక కిలోమీటరుకు అయ్యే ఖర్చు రూ.0.65 అవుతుంది.

The post నేటి నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా అందుబాటులోకి Bounce Infinity E1 ఎలక్ట్రిక్ స్కూటర్ first appeared on 91Mobiles Telugu.

]]>