Broadband Plan - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 21 Nov 2022 12:57:16 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 BSNL Fibre Basic బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ధర, ప్రయోజనాలు, ఆఫర్లు https://www.91mobiles.com/telugu/bsnl-fibre-basic-plan-introduced-price-benefits/ Mon, 21 Nov 2022 12:57:16 +0000 https://www.91mobiles.com/telugu/?p=3565 హైలైట్స్ భారత్ లో ఫైబర్ బేసిక్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ ని లాంచ్ చేసిన BSNL ప్యాక్ బెనిఫిట్స్: 40ఎంబీపీఎస్ స్పీడ్, అపరిమిత డేటా మరియు కాలింగ్, 3.3టీబీ FUP/month BSNL Fibre Basic ప్లాన్ ధర రూ.499+ ట్యాక్సెస్/నెలకి ప్రభుత్వరంగ టెలీకామ్ సంస్థ అయిన BSNL దేశ వ్యాప్తంగా కొత్త బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ ని లాంచ్ చేసింది. ఈ కొత్త ప్లాన్ పేరు Fibre Basic. దీని ద్వారా యూజర్లకు నెలకు 3టీబీ పైగా […]

The post BSNL Fibre Basic బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ధర, ప్రయోజనాలు, ఆఫర్లు first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • భారత్ లో ఫైబర్ బేసిక్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ ని లాంచ్ చేసిన BSNL
  • ప్యాక్ బెనిఫిట్స్: 40ఎంబీపీఎస్ స్పీడ్, అపరిమిత డేటా మరియు కాలింగ్, 3.3టీబీ FUP/month
  • BSNL Fibre Basic ప్లాన్ ధర రూ.499+ ట్యాక్సెస్/నెలకి

ప్రభుత్వరంగ టెలీకామ్ సంస్థ అయిన BSNL దేశ వ్యాప్తంగా కొత్త బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ ని లాంచ్ చేసింది. ఈ కొత్త ప్లాన్ పేరు Fibre Basic. దీని ద్వారా యూజర్లకు నెలకు 3టీబీ పైగా డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ గతంలో అందుబాటులో ఉండేది. కానీ, కొన్ని తెలియని కారణాల వల్లన ఈ ప్లాన్ ని నిలిపివేశఆరు. ఇప్పుడు మళ్ళీ ఈ ప్లాన్ ని తీసుకొని వచ్చారు. ఈసారి ధర, ప్రయోజనాల్లో మార్పులు చేశారు. గతంలో ఉన్న రూ.449 ధరను ఇప్పుడు రూ.499 చేశారు. ధరను పెంచినందున బెనిఫిట్స్ ని కూడా పెంచడం జరిగింది.

ఎవరైతే BSNL ఫైబర్ బేసిక్ ప్లాన్ ని ఎంచుకుంటారో సదరు కస్టమర్లకు ప్రతి నెలా 3.3 టెరాబైట్స్ డేటా (FUP) లభిస్తుంది. అంటే టెక్నికల్ గా చూస్తే, ఇది ఎటువంటి నిబంధనలు లేకుండా అపరిమిత డేటా అందిస్తున్నట్లన్న మాట. ఫెయిర్ యూసేజ్ పాలసీ ప్రకారం 3.3టీబీ డేటా వినియోగం పూర్తయ్యే వరకు స్పీడ్ లో ఎటువంటి మార్పు ఉండదు. అయితే 3.3 టీబీ పరిధి దాటితే డేటా స్పీడ్ తగ్గుతుంది.

BSNL Fibre Basic బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

టెలీకామ్ టాక్ కథనం ప్రకారం, BSNL ఈ ప్లాన్ క్రింద 3.3 టెరాబైట్ డేటా పూర్తయ్యే వరకు 40ఎంబీపీఎస్ స్పీడ్ ని ఆఫర్ చేస్తోంది. 3.3 టెరాబైట్ తర్వాత ఇంటర్నెట్ వేగం 4ఎంబీపీఎస్ కి తగ్గుతుంది. ఇంకా ఏ నెట్వర్క్ కి అయినా అపరిమిత వాసిస్ కాలింగ్ సౌకర్యం ఈ ప్లాన్ తో లభిస్తుంది. అదనంగా కస్టమర్లు మొదటి నెల 90 శాతం డిస్కౌంట్ అంటే రూ.500 వరకు రాయితీ పొందుతారు. BSNL Fibre Basic ద్వారా ఈ ప్రయోజనాలు చేకూరుతాయి.

అలాగే రూ.449 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ కూడా ఒకటుంది. BSNL దాన్ని Fibre Basic Neo గా పిలుస్తోంది. ఈ ప్లాన్ లో స్పీడ్ 30 ఎంబీపీఎస్ గా ఉంటుంది. అయితే, డేటా లిమిట్ మాత్రం 3.3 టెరాబైట్ ఉంటుంది. అలాగే FUP లిమిట్ తర్వాత డేటా స్పీడ్ 4ఎంబీపీఎస్ కి పడిపోతుంది. ఈ ప్లాన్ పై కూడా తొలి నెలలో 90 శాతం డిస్కౌంట్, అంటే రూ.500 వరకు రాయితీ ఉంటుంది.

ఈ ఏడాది ఆగస్టులో లాంచ్ అయిన రూ.275 మరియు రూ.775 ప్లాన్స్ ని త్వరలోనే BSNL నిలిపివేయనుందని ఓ నివేదిక ద్వారా తెలుస్తోంది. ఈ రెండు ప్లాన్స్ కి నవంబర్ 15 చివరి రోజు. ఆ తర్వాత ఈ ప్లాన్స్ అందుబాటులో ఉండవు. ఇదివరకే ఈ ప్లాన్స్ కి సబ్‌స్క్రైబ్ అయిన వారు మాత్రం వీటిని కొనసాగించుకోవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post BSNL Fibre Basic బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ధర, ప్రయోజనాలు, ఆఫర్లు first appeared on 91Mobiles Telugu.

]]>