BSNL 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 16 Dec 2022 12:40:05 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 రూ.62,000 కోట్ల విలువగల 5G స్పెక్ట్రమ్‌ని పొందనున్న BSNL https://www.91mobiles.com/telugu/bsnl-to-receive-rs-62000-crore-worth-5g-spectrum-from-dot/ Fri, 16 Dec 2022 12:40:05 +0000 https://www.91mobiles.com/telugu/?p=4037 హైలైట్స్ 5జీ సేవలను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోన్న BSNL 2023 ఆగస్టు కల్లా 5జీ నెట్వర్క్ ని లాంచ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న BSNL డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్ నుంచి రూ.62,000 కోట్లు పొందనున్న BSNL ప్రభుత్వరంగ టెలీకామ్ సంస్థ అయిన BSNL 5జీ సేవలను ప్రారంభించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం, టెలీకమ్యూనికేషన్ విభాగం నుంచి BSNL కి 2023 ఆగస్టు కల్లా రూ.62,000 విలువజేసే 5జీ స్పెక్ట్రమ్ అందనుందని తెలుస్తోంది. […]

The post రూ.62,000 కోట్ల విలువగల 5G స్పెక్ట్రమ్‌ని పొందనున్న BSNL first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • 5జీ సేవలను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోన్న BSNL
  • 2023 ఆగస్టు కల్లా 5జీ నెట్వర్క్ ని లాంచ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న BSNL
  • డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్ నుంచి రూ.62,000 కోట్లు పొందనున్న BSNL

ప్రభుత్వరంగ టెలీకామ్ సంస్థ అయిన BSNL 5జీ సేవలను ప్రారంభించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం, టెలీకమ్యూనికేషన్ విభాగం నుంచి BSNL కి 2023 ఆగస్టు కల్లా రూ.62,000 విలువజేసే 5జీ స్పెక్ట్రమ్ అందనుందని తెలుస్తోంది. ఇది నిజంగా శుభవార్తేనని చెప్పాలి. ప్రస్తుతం 4జీ సేవలను తీసుకొచ్చేందుకు BSNL సంస్థ, టాటా కంపెనీతో కలిసి పని చేస్తోంది.

ఇక BSNL కస్టమర్లు 4జీ సేవల కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇంకా BSNL అన్ని సర్కిల్స్ లో 4జీ సేవలను అందించడం లేదు. అయితే తన 4జీ నెట్వర్క్ ని విస్తరించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తోంది. అతి త్వరలో 4జీ నెట్వర్క్ అన్ని సర్కిల్స్ కి అందుబాటులోకి వస్తుంది. దీని తర్వాత 5జీ సేవలపై BSNL దృష్టి పెట్టనుంది.

ఇక ఈ మధ్యలో టెలీకమ్యూనికేషన్స్ విభాగం నుంచి BSNL కి శుభవార్త వచ్చింది. డీఓటీ BSNL కి 700 మెగాహెర్ట్జ్, 3.3 గిగాహెర్ట్జ్ బ్యాండ్స్ ని ప్రొవైడ్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. 700 మెగాహెర్ట్జ్ బ్యాండ్ ద్వారా 5జీ సేవలను అందించనున్న రెండో టెలీకామ్ సంస్థగా BSNL నిలవనుంది. అంతకు ముందు రిలయన్స్ జియో మాత్రమే 700 మెగాహెర్ట్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ ని కొనుగోలు చేసింది.

మరోవైపు రిలయన్స్ జియో స్టాండలోన్ మోడ్ 5జీ ఇన్ఫాస్ట్రక్చర్ ని రోలౌట్ చేస్తోంది. ఇది 700 మెగాహెర్ట్జ్ మరియు 3300 మెగాహెర్ట్జ్ బ్యాండ్స్ కలగలిసి ఉంటుంది. రిలయన్స్ జియో 700 మెగాహెర్ట్జ్ పై రూ.40,000 కోట్ల వరకు ఖర్చు చేసింది. ఇక మరో దిగ్గజ సంస్థ ఎయిర్టెల్ 5జీ సేవల కోసం నాన్-స్టాండలోన్ విధానాన్నే వినియోగిస్తోంది. ఇది 1800 మెగాహెర్ట్జ్ మరియు 3300 మెగాహెర్ట్జ్ బ్యాండ్స్ కలయిక.

700 మెగాహెర్ట్జ్ బ్యాండ్ ద్వారా మెరుగైన నెట్వర్క్ కవరేజీని అందించే అవకాశం ఉంటుంది. దీని వల్లన టెలీకామ్ ఆపరేటర్లు నిలకడైన, వేగవంతమైన కనెక్టివిటీని మెట్రో నగరాల్లో అందించే అవకాశం కల్గుతుంది.

5జీ స్పెక్ట్రమ్ ని పొందనున్న BSNL

BSNL 700 మెగాహెర్ట్జ్ బ్యాండ్ లో 10 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ మేర పొందనుంది. అంటే దాదాపు రూ.40,000 కోట్ల విలువజేసే స్పెక్ట్రమ్ అన్నమాట. ఇకపోతే 3.60-3.67 గిగాహెర్ట్జ్ బ్యాండ్ లో 70 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ ని BSNL పొందనుంది. దీని విలువ దాదాపు రూ.22,000 కోట్లు.

సబ్-గిగాహెర్ట్జ్ బ్యాండ్స్ BSNL కి గ్రామీణ ప్రాంతాల్లో 5జీ సేవలను అందించేందుకు ఉపయోగపడనున్నాయి. BSNL కి సంబంధించిన రూ.62,000 కోట్ల కేటాయింపుల విషయమై కేంద్ర కేబినెట్ చర్చించనున్నట్లు సమాచారం. ఇక టెలీకమ్యూనికేషన్స్ విభాగం బీఎస్ఎన్ఎల్ కి స్పెక్ట్రమ్ అప్రూవ్ చేసినప్పటికీ.. కేబినెట్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్ కమీషన్ కలిసి మరోమారు దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post రూ.62,000 కోట్ల విలువగల 5G స్పెక్ట్రమ్‌ని పొందనున్న BSNL first appeared on 91Mobiles Telugu.

]]>
BSNL వినియోగదారులకు శుభవార్త! https://www.91mobiles.com/telugu/bsnl-5g-launch-timeline-4g-towers-5g-upgradation/ Mon, 12 Dec 2022 11:54:02 +0000 https://www.91mobiles.com/telugu/?p=3940 హైలైట్స్ BSNL కస్టమర్లకు శుభవార్త చెప్పిన కేంద్ర టెలీకామ్ మంత్రి అశ్వినీ వైష్ణవ్ 1.35 లక్షల టవర్లలో మొదలుకానున్న BSNL 5జీ సేవలు రానున్న 5 నుంచి 7 నెలల్లో లాంచ్ కానున్న BSNL 5G నెట్వర్క్ భారత్ లో ఇప్పటికే ఎయిర్టెల్, జియో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. పలు ప్రధాన నగరాలు, కొన్ని ఎంపికచేయబడ్డ ప్రాంతాల్లో ఎయిర్టెల్, జియో 5జీ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు BSNL కూడా వీటికి పోటీగా దూసుకొస్తోంది. రానున్న 5 […]

The post BSNL వినియోగదారులకు శుభవార్త! first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • BSNL కస్టమర్లకు శుభవార్త చెప్పిన కేంద్ర టెలీకామ్ మంత్రి అశ్వినీ వైష్ణవ్
  • 1.35 లక్షల టవర్లలో మొదలుకానున్న BSNL 5జీ సేవలు
  • రానున్న 5 నుంచి 7 నెలల్లో లాంచ్ కానున్న BSNL 5G నెట్వర్క్

భారత్ లో ఇప్పటికే ఎయిర్టెల్, జియో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. పలు ప్రధాన నగరాలు, కొన్ని ఎంపికచేయబడ్డ ప్రాంతాల్లో ఎయిర్టెల్, జియో 5జీ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు BSNL కూడా వీటికి పోటీగా దూసుకొస్తోంది. రానున్న 5 నుంచి 7 నెలల కాలంలో BSNL 5జీ సేవలు మొదలవుతాయని ప్రభుత్వం చెబుతోంది. మొత్తం 1.35 లక్షల 4జీ టవర్లు 5జీకి మారనున్నాయి.

ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్వయంగా వెల్లడించారు. 4జీ నెట్వర్క్ ని ఏర్పరచడంలో BSNL కంపెనీ విఫలమవ్వడంతో, ప్రభుత్వం రంగంలోకి దిగింది. త్వరలోనే 4జీ, 5జీ సేవలను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

5G కి మారనున్న BSNL 4G టవర్స్

మీడియా కథనాల ప్రకారం, BSNL తనకు చెందిన 1.35 లక్షల 4జీ టవర్లను 5జీకి అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలీమ్యాటిక్స్ BSNL కి 5జీ కోర్ ని ప్రొవైడ్ చేయనుంది. అలాగే ఈ కంపెనీ 5జీ సేవలను ఎనేబుల్ చేసేందుకు అవకాశం ఉంది.

2023 ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న 5జీ సేవలు

రానున్న 6 నెలల్లో BSNL 5జీ సేవలు 200 కి పైగా నగరాల్లో అందుబాటులో ఉంటాయని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. వచ్చే కొన్నేళ్ళలో దేశంలో 80 నుంచి 90 శాతం మేర 5జీ సేవలు విస్తరించాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. అలాగే BSNL 5జీ వచ్చే ఏడాది ఆగస్టు 15 న లాంచ్ అవుతుందని ఆయన అన్నారు.

BSNL మరియు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కలిసి 4జీ సేవలు అందిస్తాయని గతంలో వార్తలు వచ్చాయి. 4జీ సేవల కోసం భారతీయ టెక్నాలజీని వాడటం ఇదే తొలిసారి. అదే విధంగా BSNL డైరెక్టర్ సుశీల్ కుమార్ మిశ్రా స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం, టెలీకామ్ సెక్టర్ లో 100 శాతం ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ కి ఆమోదం తెలిపింది. అలాగే టెలీకామ్ కంపెనీలకు స్పెక్ట్రమ్ చార్జెస్ మరియు ఏజీఆర్ బకాయిల చెల్లింపులపై 4 ఏళ్ళ మారటోరియమ్ ని కూడా ఇవ్వాలని నిర్ణయించింది.

ఇదిలా ఉండగా ఇంకా బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు దేశమంతటా అందుబాటులోకి రాలేదు. మరి ఈలోపు 5జీకి సంబంధించిన ప్రకటనలు వస్తున్నాయి. అంటే రానున్న 7 నెలల్లో 4జీ మరియు 5జీ సేవలు లాంచ్ కానున్నాయన్నమాట. అయితే ఇప్పటికే బీఎస్ఎన్ఎల్, టీసీఎస్ తో కలిసి దేశంలో పలు చోట్ల 4జీ ట్రయల్స్ నిర్వహించింది. మరి పూర్తిస్థాయిలో బీఎస్ఎన్ఎల్ 4జీ అందుబాటులోకి వచ్చేది ఎప్పుడో తెలియదు. అయితే జరుగుతోన్న పరిణామాలను బట్టి చూస్తే అతి త్వరలో BSNL 4జీ లాంచ్ ఉంటుందని అర్థమవుతోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post BSNL వినియోగదారులకు శుభవార్త! first appeared on 91Mobiles Telugu.

]]>