BSNL Cinemaplus - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 17 May 2023 12:41:36 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Cinemaplus పేరుతో ఓటీటీ ఎంటర్టెయిన్మెంట్ ప్యాక్స్ లాంచ్ చేసిన BSNL; ప్రారంభ ధర రూ.49 మాత్రమే! https://www.91mobiles.com/telugu/bsnl-launches-cinemaplus-ott-entertainment-packs/ Wed, 17 May 2023 12:41:36 +0000 https://www.91mobiles.com/telugu/?p=6351 BSNL సంస్థ తాజాగా 3 కొత్త ప్లాన్స్ ని లాంచ్ చేసింది. ఈ ప్లాన్లను కంపెనీ Cinemaplus OTT Entertainment Packs అనే పేరుతో తీసుకొచ్చింది. ఇందుకోసం ప్రభుత్వరంగ టెలీకామ్ సంస్థ అయిన BSNL ఓటీటీ సైట్స్ లయన్స్‌గేట్స్, షెమారూమీ, హంగామా మరియు ఎపిక్‌ఆన్ లతో జట్టుకట్టింది. సరే, ఓసారి BSNL తీసుకొచ్చిన ప్లాన్స్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం పదండి. BSNL కొత్త ఓటీటీ ప్యాక్స్ ధర BSNL సినిమాప్లస్ రూ.49 ప్లాన్ BSNL […]

The post Cinemaplus పేరుతో ఓటీటీ ఎంటర్టెయిన్మెంట్ ప్యాక్స్ లాంచ్ చేసిన BSNL; ప్రారంభ ధర రూ.49 మాత్రమే! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 3 కొత్త ప్యాక్స్ ని లాంచ్ చేసిన BSNL
  • ఈ ప్యాక్స్‌తో లభించనున్న ఓటీటీ యాప్స్ ప్రయోజనాలు
  • ప్లాన్ పేరు: సినిమాప్లస్ ఓటీటీ ఎంటర్టెయిన్మెంట్ ప్యాక్స్

BSNL సంస్థ తాజాగా 3 కొత్త ప్లాన్స్ ని లాంచ్ చేసింది. ఈ ప్లాన్లను కంపెనీ Cinemaplus OTT Entertainment Packs అనే పేరుతో తీసుకొచ్చింది. ఇందుకోసం ప్రభుత్వరంగ టెలీకామ్ సంస్థ అయిన BSNL ఓటీటీ సైట్స్ లయన్స్‌గేట్స్, షెమారూమీ, హంగామా మరియు ఎపిక్‌ఆన్ లతో జట్టుకట్టింది. సరే, ఓసారి BSNL తీసుకొచ్చిన ప్లాన్స్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం పదండి.

BSNL కొత్త ఓటీటీ ప్యాక్స్ ధర

  • BSNL సినిమాప్లస్ రూ.49 ప్లాన్
  • BSNL సినిమాప్లస్ రూ.199 ప్లాన్
  • BSNL సినిమాప్లస్ రూ.249 ప్లాన్

1. BSNL సినిమాప్లస్ స్టార్టర్ ప్యాక్: ఈ స్టార్టర్ ప్యాక్ ప్రస్తుతం రూ.49 ల డిస్కౌంట్ ధరకి లభిస్తోంది. దీని అసలు ధర రూ.99 గా ఉంది. ఈ ప్లాన్ ద్వారా షిమారో, హంగామా, లయన్స్‌గేట్ మరియు ఎపిక్‌ఆన్ ఓటీటీ సేవలను పొందవచ్చు.

2. BSNL సినిమాప్లస్ ఫుల్ ప్యాక్: రూ.199 ధరకి లభించే ఈ ప్యాక్ ద్వారా జీ5 ప్రీమియమ్, సోనిలివ్ ప్రీమియమ్, యప్‌టీవీ మరియు హాట్‌స్టార్ ఓటీటీ సేవలు లభిస్తాయి.

3. BSNL సినిమాప్లస్ ప్రీమియమ్ ప్యాక్: ఈ ప్రీమియమ్ ప్యాక్ రూ.249 లకి లభిస్తుంది. ఈ ప్యాక్ ద్వారా జీ5 ప్రీమియమ్, సోనిలివ్ ప్రీమియమ్, యప్‌టీవీ, షిమారో, హంగామా, లయన్స్‌గేట్ మరియు హాట్‌స్టార్ సేవలను పొందవచ్చు.

విభిన్న ఓటీటీ కంటెంట్ ప్రొవైడర్ కాంబినేషన్లతో BSNL తన యూజర్ల కోసం 3 ప్యాక్స్ ని అందిస్తోంది. ఈ ప్యాక్స్ వివరాలను మనం పైన తెలుసుకున్నాం. మీ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ఏ నంబర్ తో అయితే రిజిస్టర్ అయ్యిందో ఆ నంబర్ పై మీరు ఎంచుకునే ప్యాక్ ని బట్టి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ అప్లై అవుతుంది. మీ బ్రాడ్‌బ్యాండ్ బిల్ కి ప్యాక్ సబ్‌స్క్రిప్షన్ ఫీజు యాడ్ చేయబడుతుంది.

BSNL సినిమాప్లస్ ప్యాక్స్ ఎంటర్టెయిన్మెంట్ కి అడ్డాగా నిలుస్తున్నాయి. సెపరేట్ గా ఓటీటీ లకు సబ్‌స్క్రిప్షన్ తీసుకునే బదులు, BSNL ప్యాక్స్ లో ఏదైనా ఒక దానిని ఎంపిక చేసుకుంటే చాలా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు.

The post Cinemaplus పేరుతో ఓటీటీ ఎంటర్టెయిన్మెంట్ ప్యాక్స్ లాంచ్ చేసిన BSNL; ప్రారంభ ధర రూ.49 మాత్రమే! first appeared on 91Mobiles Telugu.

]]>