BYD Atto 3 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 14 Nov 2022 12:53:10 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 BYD Atto 3 ఎలక్ట్రిక్ కారు ధరను రివీల్ చేసిన కంపెనీ https://www.91mobiles.com/telugu/byd-atto-3-ev-suv-price-revealed-by-company/ Mon, 14 Nov 2022 12:53:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=3420 హైలైట్స్ గత నెలలో భారత్ లో లాంచ్ అయిన BYD Atto 3 ఎలక్ట్రిక్ కారు తాజాగా ధరను రివీల్ చేసిన కంపెనీ, ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.33.99 లక్షలు హ్యుందాయ్ కోన ఈవీ, టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్, ఎంజి జెడ్ఎస్ ఈవీ లతో పోటీపడనున్న BYD Atto 3 BYD సంస్థ తన కొత్త బ్యాటరీ కారుని భారతీయ మార్కెట్ లో గత నెలలో లాంచ్ చేసింది. BYD Atto 3 ఎలక్ట్రిక్ […]

The post BYD Atto 3 ఎలక్ట్రిక్ కారు ధరను రివీల్ చేసిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • గత నెలలో భారత్ లో లాంచ్ అయిన BYD Atto 3 ఎలక్ట్రిక్ కారు
  • తాజాగా ధరను రివీల్ చేసిన కంపెనీ, ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.33.99 లక్షలు
  • హ్యుందాయ్ కోన ఈవీ, టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్, ఎంజి జెడ్ఎస్ ఈవీ లతో పోటీపడనున్న BYD Atto 3

BYD సంస్థ తన కొత్త బ్యాటరీ కారుని భారతీయ మార్కెట్ లో గత నెలలో లాంచ్ చేసింది. BYD Atto 3 ఎలక్ట్రిక్ కారు ధరను తాజాగా కంపెనీ రివీల్ చేసింది. అక్టోబర్ 11 నుంచి రూ.50,000 తో బుకింగ్స్ మొదలయ్యాయని, ఇప్పటికి 1500 యూనిట్స్ బుక్ అయినట్లు కంపెనీ వెల్లడించింది. మరి BYD Atto 3 కారు యొక్క ధర, బుక్ చేసుకునే విధానం ఇక్కడ తెలుసుకుందాం పదండి.

BYD Atto 3 ధర, బుకింగ్ వివరాలు

BYD Atto 3 కారుని రూ.33.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో కంపెనీ మార్కెట్ లోకి వదిలింది. ఈ కారుని కొనాలనుకునేవారు రూ.50,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. భారతీయ మార్కెట్ లో BYD Atto 3 కారు, హ్యుందాయ్ కోన ఈవీ, టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్, ఎంజి జెడ్ఎస్ ఈవీ కార్లతో పోటీ పడనుంది.

BYD Atto 3 ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

BYD Atto 3 లో 60.48 కిలోవాట్ బ్యాటరీని అమర్చారు. ఇది 80 కిలోవాట్ డీసీ ఫాస్ట్ చార్జింగ్ ని కలిగి ఉంది. అలాగే ఈ కారు బ్యాటరీ 0 నుంచి 80 శాతం చార్జ్ అయ్యేందుకు 50 నిమిషాల సమయం తీసుకుంటుంది. ఇంకా టైప్ 2 ఏసీ చార్జర్ కారులో అందుబాటులో ఉంది. ఇది కారుని 10 గంటల్లో పూర్తిగా చార్జ్ చేస్తుంది.

ఈ ఎలక్ట్రిక్ కారు 3.3 కిలోవాట్ పవర్ బ్యాకప్ తో వస్తోంది. ఇది కాకుండా, BYD Atto 3 కారు 7 కిలోవాట్ ఏసీ చార్జర్, 3 కిలోవాట్ పోర్టబుల్ చార్జింగ్ బాక్స్ తో వస్తోంది. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే కారు 521 కిలోమీటర్ల దూరం పరిగెడుతుందని కంపెనీ చెబుతోంది.

BYD Atto 3 కారుపై BYD కంపెనీ 6 సంవత్సరాలు లేదా 1.5 లక్షల కిలోమీటర్ల వ్యారంటీని ఇస్తోంది. బ్యాటరీ ప్యాక్ పై 8 సంవత్సరాలు లేదా 1.60 లక్షల కిలోమీటర్ల వ్యారంటీ అందిస్తోంది. ప్రమోషనల్ బెనిఫిట్స్ విషయానికి వస్తే, BYD Atto 3 ఎలక్ట్రిక్ కారు 3 సంవత్సరాల 4జీ డేటా సబ్‌స్క్రిప్షన్ మరియు 6 ఉచిత సేవలతో వస్తోంది.

BYD Atto 3 ఎలక్ట్రిక్ కారు ధరని రూ.33.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా కంపెనీ నిర్ణయించింది. ఈ కారుపై ఆసక్తి గల వారు రూ.50,000 చెల్లించి బుక్ చేసుకోండి. బుకింగ్ కోసం మీకు దగ్గర్లోని డీలర్షిప్ లో గాని, బీవైడీ అధికార వెబ్ సైట్ ని గాని విజిట్ చేయండి. ఇకపోతే, భారతీయ మార్కెట్ లో BYD Atto 3 కారు, హ్యుందాయ్ కోన ఈవీ, టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్, ఎంజి జెడ్ఎస్ ఈవీ కార్లతో పోటీపడుతుందని అంతా భావిస్తున్నారు. BYD Atto 3 ఎలక్ట్రిక్ కారు రాకతో E-SUV మార్కెట్ లో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post BYD Atto 3 ఎలక్ట్రిక్ కారు ధరను రివీల్ చేసిన కంపెనీ first appeared on 91Mobiles Telugu.

]]>
భారత్ లో లాంచ్ అయిన ఎలక్ట్రిక్ కారు BYD Atto 3; ప్రారంభమైన ప్రీ-బుకింగ్స్ https://www.91mobiles.com/telugu/byd-atto-3-ev-suv-launched-india-price-specs/ Thu, 13 Oct 2022 08:51:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=2901 హైలైట్స్ 521 కిలోమీటర్ల రేంజ్ తో భారత్ లో లాంచ్ అయిన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ BYD Atto 3 ఫాస్ట్ చార్జింగ్, ఏడీఏఎస్ పనోరమిక్ సన్‌రూఫ్ తదితర ఫీచర్లతో వచ్చిన BYD Atto 3 రూ.50,000 చెల్లించి BYD Atto 3 ఎస్‌యూవీ ఎలక్ట్రిక్ కారుని బుక్ చేసుకునే అవకాశం, జనవరి నుంచి మొదలు కానున్న డెలివరీలు BYD కంపెనీ BYD Atto 3 కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ని భారత్ లో లాంచ్ చేసింది. రూ.50,000 […]

The post భారత్ లో లాంచ్ అయిన ఎలక్ట్రిక్ కారు BYD Atto 3; ప్రారంభమైన ప్రీ-బుకింగ్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • 521 కిలోమీటర్ల రేంజ్ తో భారత్ లో లాంచ్ అయిన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ BYD Atto 3
  • ఫాస్ట్ చార్జింగ్, ఏడీఏఎస్ పనోరమిక్ సన్‌రూఫ్ తదితర ఫీచర్లతో వచ్చిన BYD Atto 3
  • రూ.50,000 చెల్లించి BYD Atto 3 ఎస్‌యూవీ ఎలక్ట్రిక్ కారుని బుక్ చేసుకునే అవకాశం, జనవరి నుంచి మొదలు కానున్న డెలివరీలు

BYD కంపెనీ BYD Atto 3 కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ని భారత్ లో లాంచ్ చేసింది. రూ.50,000 టోకెన్ అమౌంట్ తో బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అయితే BYD కంపెనీ ఇంకా ఈ కారు ధరని వెల్లడించలేదు. ఇక ఈ ఎలక్ట్రిక్ కారు Tata Nexon EV Max, MG ZS EV, Hyundai Kona EV లతో పోటీ పడనుంది. BYD Atto 3 కారు యొక్క మొదటి 500 యూనిట్లను 2023 జనవరి కల్లా డెలివరీ చేయాలని BYD లక్ష్యంగా పెట్టుకుంది.

BYD Atto 3 సింగిల్ చార్జ్ పై 521 కిలోమీటర్ల దూరం వెళ్తుంది. ఇక ఈ కారులో 60.48 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంది. అలాగే 80 కిలోవాట్ ఫాస్ట్ చార్జర్ తో చార్జ్ చేసినప్పుడు ఈ బ్యాటరీ 50 నిమిషాల్లో 0 నుంచి 80 శాతానికి చేరుకుంటుంది.

భారత్ లో లాంచ్ అయిన BYD Atto 3 కాంపాక్ట్ ఈవీ ఎస్‌యూవీ

BYD Atto 3 భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ కారు కంటెంపరరీ లుక్ ని కలిగి ఉంది. లేటెస్ట్ టెక్నాలజీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. పవర్‌ట్రెయిన్ పరంగా ఈ కారు చెప్పుకోదగిన నిలకడైన రేంజ్, పెర్ఫామెన్స్ ని కలిగి ఉంటుందని సమాచారం. రూ.25 లక్షల ప్రైస్ రేంజ్ లో BYD Atto 3 మంచి ఆప్షన్ గా నిలవనుంది.

BYD Atto 3 కొహెసివ్ స్టైలింగ్ ని కలిగి ఉంది. ఈ కారు 2,720ఎంఎం వీల్‌బేస్, 4445ఎంఎం పొడవు ఉంటుంది. ఇది కోనా ఈవీ, జెడ్ఎస్ ఈవీ కంటే పొడవుగా ఉంటుంది. BYD Atto 3 లో 440 లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది. ఫ్రంట్ లుక్ అసలైన ఈవీ ఫ్యాషన్ లో కనిపిస్తోంది. అంటే గ్రిల్ లేకుండా, ఎల్ఈడీ లైటింగ్ తో కనిపిస్తుంది. ఇక కారు రియర్ పార్ట్ చూస్తే, ఎల్ఈడీ లైట్ బార్, టెయిల్ లైట్ హైలైట్ గా నిలుస్తున్నాయి. ఈ కారులో 18-ఇంచ్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, సి-పిల్లర్ పై సిల్వర్ హైలైట్స్ ఉన్నాయి.

ఇంటీరియర్ విషయానికి వస్తే, డ్యాష్ బోర్డ్ స్టైలిష్ డిజైన్ కలిగి ఉంది. ఫంకీ లుకింగ్ ఏసీ వెంట్, డోర్ స్పీకర్/హ్యాండిల్ డిజైన్ బాగున్నాయి. పూర్తిస్థాయి ఎల్ఈడీ లైటింగ్, పనోరమిక్ సన్ రూఫ్, పవర్డ్ టెయిల్ గేట్, వైర్లెస్ ఫోన్ చార్జర్, 5-ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, సింథటిక్ లెదర్ అప్‌హోల్‌స్ట్రీ, పవర్డ్ ఫ్రంట్ డ్రైవర్, ప్యాసెంజర్ సీట్స్, మల్టీ కలర్ ఆంబియంట్ లైటింగ్ ఈ కారులో ఉన్నాయి. 12.8-ఇంచ్ సెంట్రల్ ఇన్ఫోటెయిన్మెంట్ డిస్ప్లే హైలైట్ గా నిలుస్తోంది. ఈ డిస్ప్లే ఆటోమేటిక్ గా పొట్రెయిట్ మరియు ల్యాండ్ స్కేప్ మోడ్ లోకి తిరుగుతుంది.

BYD Atto 3 సేఫ్టీ ఎక్విప్మెంట్ విషయానికి వస్తే, ఇందులో 360-డిగ్రీ కెమెరా, ఏబీఎస్, ఈఎస్‌సీ, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, 7 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇంకా ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ కోసం ఏడీఏఎస్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, లేన్-కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, ఫ్రంట్ అండ్ రియర్ కొలిజన్ వార్నింగ్ వంటివి ఈ కారులో ఉన్నాయి.

BYD కంపెనీ 3 ఏళ్ళ పాటు 4జీ డేటా కనెక్షన్, 6 ఏళ్ళ పాటు ఆర్ఎస్ఏ, 6 ఫ్రీ మెయింటెనెన్స్ సర్వీసెస్ ని ప్రమోషనల్ ప్యాకేజీ ద్వారా అందిస్తోంది. BYD Atto 3 6 సంవత్సరాలు లేదా 1,50,000 కిలోమీటర్ల వ్యారంటీ అందిస్తోంది. ఇక బ్యాటరీ ప్యాక్ పై 8 సంవత్సరాలు లేదా 1,60,000 కిలోమీటర్ల వ్యారంటీ అందిస్తోంది. త్వరలోనే డిల్లీ, ముంబై, దక్షిణాది నగరాల్లో ఏర్పాటు అయ్యే డీలర్షిప్స్ ద్వారా ఈ కారు అందుబాటులోకి వస్తుంది.

The post భారత్ లో లాంచ్ అయిన ఎలక్ట్రిక్ కారు BYD Atto 3; ప్రారంభమైన ప్రీ-బుకింగ్స్ first appeared on 91Mobiles Telugu.

]]>