CESL - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 29 Jul 2022 07:53:27 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 16 జాతీయ రహదారుల వ్యాప్తంగా 800 కొత్త EV Charging స్టేషన్స్ https://www.91mobiles.com/telugu/800-ev-charging-stations-across-16-highways-india/ Fri, 29 Jul 2022 07:53:27 +0000 https://www.91mobiles.com/telugu/?p=1361 హైలైట్స్: భారతదేశంలో 16 జాతీయ రహదారుల వ్యాప్తంగా ఏర్పాటు కానున్న 810 చార్జింగ్ స్టేషన్స్ 10,275 కిలోమీటర్ల హైవేస్ ని కవర్ చేయనున్న సీఈఎస్ఎల్ మరియు భాగస్వమ్య కంపెనీలు ఈ చార్జింగ్ స్టేషన్స్ ని ప్రయివేటు మరియు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వెహికిల్స్ వాడుకునే అవకాశం దేశంలోని 16 జాతీయ రహదారుల వ్యాప్తంగా 800 లకు పైగా ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు కానున్నాయి. కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (సీఈఎస్ఎల్), ఇతర భాగస్వాములతో కలిసి ఈ ప్రాజెక్టుని […]

The post 16 జాతీయ రహదారుల వ్యాప్తంగా 800 కొత్త EV Charging స్టేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • భారతదేశంలో 16 జాతీయ రహదారుల వ్యాప్తంగా ఏర్పాటు కానున్న 810 చార్జింగ్ స్టేషన్స్
  • 10,275 కిలోమీటర్ల హైవేస్ ని కవర్ చేయనున్న సీఈఎస్ఎల్ మరియు భాగస్వమ్య కంపెనీలు
  • ఈ చార్జింగ్ స్టేషన్స్ ని ప్రయివేటు మరియు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వెహికిల్స్ వాడుకునే అవకాశం

దేశంలోని 16 జాతీయ రహదారుల వ్యాప్తంగా 800 లకు పైగా ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు కానున్నాయి. కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (సీఈఎస్ఎల్), ఇతర భాగస్వాములతో కలిసి ఈ ప్రాజెక్టుని పూర్తి చేయనుంది. ఎలక్ట్రిక్ వెహికిల్స్ ను వాడే ప్రయాణికులు రేంజ్ విషయంలో చింతనేది లేకుండా ప్రయాణం చేయాలన్నదే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఛార్జింగ్ స్టేషన్స్ అందుబాటులో లేకపోవడం వల్లన సుదూరాలకు ఈవీ ల్లో వెళ్ళేందుకు జనాలు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. ఇకపై ఆ సమస్య లేకుండా చేసేందుకు భారీ ఎత్తున ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు కాబోతున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులతో పాటు ఇతర భారీ వాహనాలకు కూడా ఈ ఛార్జింగ్ స్టేషన్లను వాడుకునే అవకాశం ఉండటంతో ఫ్లీట్ ఆపరేటర్స్ కి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.

ఈ ప్రాజెక్టు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ తీసుకొచ్చిన ఫేమ్-2 పథకం క్రిందకు వస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రయివేటు, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కి సేవలు అందించడమే ప్రధాన లక్ష్యం. హ్యుందాయి కోన, టాటా నెక్సాన్ ఈవీ, ఎంజీ జెడ్‌ఎస్ ఈవీ మరియు ఇతర కంపాటిబుల్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఈ ఛార్జింగ్ స్టేషన్స్ వద్ద ఛార్జ్ చేసుకోవచ్చు.

ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ద్వారా ఏయే హైవేస్ లాభపడనున్నాయి?

6 నుంచి 8 నెలల కాల వ్యవధిలో ప్రాజెక్టుని పూర్తి చేయాలనే డెడ్ లైన్ ఉంది. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ఓ నివేదిక పలు బిజీ హైవే రూట్స్ ని వెల్లడించింది. వాటిలో ముంబై-పుణె హైవే, అహ్మదాబాద్-వడోదరా హైవే, ఢిల్లీ-ఆగ్రా యమున ఎక్స్‌ప్రెస్‌వే, ఈస్టర్న్ పెరిపెరల్ ఎక్స్‌ప్రెస్‌వే, హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే, ఆగ్రా-నాగ్‌పూర్ హైవే ఉన్నాయి.

ఎలక్ట్రిఫైడ్ మొబిలిటీ విషయంలో భారతదేశ భవిష్యత్ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్ళాలని కేంద్ర విద్యుత్ శాఖ, సీఈఎస్ఎల్ కి మార్గనిర్దేశనం చేసింది. కాగా, ఈ ప్రాజెక్టు ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న 16 జాతీయ రహదారులు లబ్ది పొందనున్నాయి.

50kW, 100kW చార్జింగ్ సెటప్స్ ఈ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు కానున్నాయి. 50 కిలో వాట్ ఛార్జింగ్ అవుట్ పుట్ కలిగిన 590 ఛార్జర్స్ ని ప్రతీ 25 కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఇన్‌స్టాల్ చేయనున్నారు. ఇక 100 కిలో వాట్ ఛార్జింగ్ అవుట్ పుట్ కలిగిన 220 ఛార్జర్స్ ని ప్రతీ 100 కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఇన్‌స్టాల్ చేయడం జరుగుతుంది.

Convergence Energy Services Ltd (CESL) వివరాలు

ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (EESL) యొక్క సబ్సిడరీ కంపెనీయే ఈ సీఈఎస్ఎల్. ఈ సంస్థ ప్రభుత్వ కార్యాలయాలకు, ఏజెన్సీలకు విద్యుత్ వాహనాలను డెలివరీ చేస్తుంది. ఇప్పుడు ఇదే కంపెనీ, నేషనల్ హైవేస్, ఎక్స్‌ప్రెస్ హైవేస్ వ్యాప్తంగా మొత్తం 10,275 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తూ 810 ఎలక్ట్రిక్ వెహికిల్ ఛార్జింగ్ స్టేషన్స్ ని ఏర్పాటు చేయబోతోంది.

లేటెస్ట్ టెక్నాలజీ, స్మార్ట్ ఫోన్స్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ని ఫాలో అవ్వండి.

The post 16 జాతీయ రహదారుల వ్యాప్తంగా 800 కొత్త EV Charging స్టేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>