China launch teaser - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 08 Oct 2024 11:38:42 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Honor X60 సిరీస్ లాంచ్ తేదీ ఖరారు, టీజర్ విడుదల https://www.91mobiles.com/telugu/honor-x60-series-china-launch-date-confirmed-teaser-released/ https://www.91mobiles.com/telugu/honor-x60-series-china-launch-date-confirmed-teaser-released/#respond Tue, 08 Oct 2024 11:38:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=13986 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Honor త్వరలో తన X60 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో మూడు మోడల్స్ లాంచ్ అవుతాయని సమాచారం. గతేడాది వచ్చిన Honor X50 సిరీస్‌కు సక్సెసర్ గా ఎక్స్60 సిరీస్ లాంచ్ కానుంది. తాజాగా, Honor X60 సిరీస్ యొక్క చైనా లాంచ్ తేదీని కంపెనీ టీజర్ ద్వారా ఖరారు చేసింది. ఓసారి టీజర్ విశేషాలు, లాంచ్ తేదీ వివరాలను తెలుసుకుందాం. Honor X60 సిరీస్ లాంచ్ తేదీ […]

The post Honor X60 సిరీస్ లాంచ్ తేదీ ఖరారు, టీజర్ విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో చైనాలో Honor X60 సిరీస్ విడుదల
  • అక్టోబర్ 16న లాంచ్ అవుతోన్న లైనప్
  • మూడు మోడల్స్ లాంచ్ అయ్యే అవకాశం

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Honor త్వరలో తన X60 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో మూడు మోడల్స్ లాంచ్ అవుతాయని సమాచారం. గతేడాది వచ్చిన Honor X50 సిరీస్‌కు సక్సెసర్ గా ఎక్స్60 సిరీస్ లాంచ్ కానుంది. తాజాగా, Honor X60 సిరీస్ యొక్క చైనా లాంచ్ తేదీని కంపెనీ టీజర్ ద్వారా ఖరారు చేసింది. ఓసారి టీజర్ విశేషాలు, లాంచ్ తేదీ వివరాలను తెలుసుకుందాం.

Honor X60 సిరీస్ లాంచ్ తేదీ (చైనా)

  • Honor X60 సిరీస్ చైనాలో అక్టోబర్ 16వ తేదీన లాంచ్ అవుతుందని కంపెనీ టీజర్ ద్వారా వెల్లడించింది. అయితే ఈ లైనప్ లో ఎన్ని మోడల్స్ లాంచ్ అవుతాయో ఇంకా కన్ఫర్మ్ కాలేదు.
  • హానర్ సంస్థ ఈ టీజర్‌ను చైనాకు చెందిన మైక్రో బ్లాగింగ్ సైట్ Weibo ద్వారా షేర్ చేసింది. చైనా స్థానిక కాలమానం ప్రకారం, అక్టోబర్ 16న రాత్రి 7.30 గంటలకు హానర్ ఎక్స్60 సిరీస్ లాంచ్ అవుతుంది.
  • Honor X60 లైనప్ లో మొత్తం 3 మోడల్స్ లాంచ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
  • గతేడాది Honor X50 సిరీస్ లో భాగంగా.. X50i, X50i+, X50, X50 Pro మరియు X50 GT అనే మోడల్స్ విడుదలయ్యాయి.
  • రానున్న రోజుల్లో ఈ సిరీస్ కు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడవ్వనున్నాయి.

Honor X60 స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: రిపోర్ట్ ప్రకారం, హానర్ 60 సిరీస్ లోని బేస్ మోడల్ Honor X60 6.8-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్ తో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రాసెసర్: Honor X60 డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7025 చిప్సెట్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

ర్యామ్, స్టోరేజీ: Honor X60 స్మార్ట్‌ఫోన్ 12జిబి ర్యామ్, 12జిబి వర్చువల్ ర్యామ్, 256జిబి స్టోరేజీతో లాంచ్ అవుతుందని సమాచారం.

కెమెరా: Honor X60 డివైజ్ లో 108ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ, చార్జింగ్: Honor X60 స్మార్ట్‌ఫోన్‌లో పవర్ బ్యాకప్ కోసం 5,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 35 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుందని అంచనా.

ఆపరేటింగ్ సిస్టమ్: Honor X60 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత మ్యాజిక్ఓఎస్ 8 కస్టమ్ స్కిన్ తో లాంచ్ అవుతుంది.

కనెక్టివిటీ: Honor X60 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post Honor X60 సిరీస్ లాంచ్ తేదీ ఖరారు, టీజర్ విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/honor-x60-series-china-launch-date-confirmed-teaser-released/feed/ 0
Redmi Note 14 Series చైనా లాంచ్ ఖరారు, టీజర్ విడుదల https://www.91mobiles.com/telugu/redmi-note-14-series-china-launch-confirmed-via-teaser/ https://www.91mobiles.com/telugu/redmi-note-14-series-china-launch-confirmed-via-teaser/#respond Thu, 19 Sep 2024 05:41:13 +0000 https://www.91mobiles.com/telugu/?p=13591 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi యొక్క సబ్-బ్రాండ్ Redmi నుంచి త్వరలో రెడ్మీ 14 సిరీస్ లాంచ్ కానుంది. తాజాగా కంపెనీ చైనా వెబ్‌సైట్ లో ఈ ఫోన్ల యొక్క టీజర్ లిస్ట్ అయ్యింది. ఈ సిరీస్ లో Redmi Note 14 5G, Redmi Note 14 Pro 5G మరియు Redmi Note 14 Pro Plus 5G అనే ఫోన్లు లాంచ్ కానున్నాయి. అయితే, కంపెనీ ఇంకా లాంచ్ తేదీని ప్రకటించలేదు. […]

The post Redmi Note 14 Series చైనా లాంచ్ ఖరారు, టీజర్ విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో రెడ్మీ 14 సిరీస్ విడుదల
  • చైనా లాంచ్ ఖరారు
  • టీజర్ విడుదల

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi యొక్క సబ్-బ్రాండ్ Redmi నుంచి త్వరలో రెడ్మీ 14 సిరీస్ లాంచ్ కానుంది. తాజాగా కంపెనీ చైనా వెబ్‌సైట్ లో ఈ ఫోన్ల యొక్క టీజర్ లిస్ట్ అయ్యింది. ఈ సిరీస్ లో Redmi Note 14 5G, Redmi Note 14 Pro 5G మరియు Redmi Note 14 Pro Plus 5G అనే ఫోన్లు లాంచ్ కానున్నాయి. అయితే, కంపెనీ ఇంకా లాంచ్ తేదీని ప్రకటించలేదు. కానీ, వచ్చే వారం ఈ సిరీస్ లాంచ్ అవుతుందని సమాచారం. మరిన్ని వివరాలు తెలుసుకుందాం పదండి.

Redmi Note 14 Series టీజర్

రెడ్మీ 14 సిరీస్ టీజర్ లో రెండు స్మార్ట్‌ఫోన్లు కనిపించాయి. అవి: రెడ్మీ నోట్ 14 ప్రో మరియు నోట్ 14 ప్రో ప్లస్.

ఈ రెండు ఫోన్లు కూడా బ్యాక్ ప్యానెల్ పై కర్వ్డ్ స్క్వేర్ షేప్డ్ కెమెరా మాడ్యూల్ తో ఉన్నాయి. ఫోన్ల యొక్క ప్యానెల్ కూడా కర్వ్డ్ గా ఉంది.

కెమెరా మాడ్యూల్ లో ట్రిపుల్ కెమెరా సెటప్ మరియు ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నట్లు కనిపిస్తోంది.

రెడ్మీ నోట్ 14 ప్రో ప్లస్ కెమెరా మాడ్యూల్ లో లెన్స్‌లు లోపల ఉన్నాయి. మరోవైపు, ప్రో వేరియంట్ లో సెన్సర్స్ వేర్వేరుగా ఉన్నాయి.

యాంటీ-ఫాల్, వాటర్‌ప్రూఫ్ మరియు సర్వీస్ గ్యారంటీ వంటి వాటిపై కంపెనీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

రెడ్మీ 14 సిరీస్ ఫోన్లు ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తున్నాయి.

ఒక మోడల్‌ని గ్రీన్ కలర్ లో, ఇంకొక దాన్ని గ్రే కలర్ లో టీజ్ చేశారు. అయితే వీటి ఫోన్లను కంపెనీ మెన్షన్ చేయలేదు. లాంచ్ టైమ్ లో ఈ విషయాలు తెలుస్తాయి.

Redmi Note 14 Series స్పెసిఫికేషన్స్

రెడ్మీ నోట్ 14 ప్రో+ గ్రీన్ కలర్ లో వస్తున్నట్లు కంపెనీ రివీల్ చేసింది. ఈ ఫోన్ 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరాతో వస్తోంది. ఇది 60ఎంఎం ఎఫ్/2.2 మిడ్-ఫోకస్ లెన్స్ కలిగి ఉంది. ప్రో వేరియంట్ 50ఎంపి ఏఐ ఓఐఎస్ కెమెరాతో రానుంది. ఇప్పటివరకు ఇవే వివరాలు రివీల్ అయ్యాయి.

Redmi Note 14 స్పెసిఫికేషన్స్ (అంచనా)

Redmi Note 14 స్మార్ట్‌ఫోన్ ఈ లైనప్ లో అత్యంత చవకైన ఫోన్. రిపోర్ట్స్ ప్రకారం, ఈ ఫోన్ 1.5కే అమోలెడ్ స్క్రీన్, ఫుల్‌హెచ్డీ ప్యానెల్, 50ఎంపి ట్రిపుల్ కెమెరా సెటప్, మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ తో వస్తోంది.

Redmi Note 14 Pro, 14 Pro Plus (అంచనా)

రెడ్మీ నోట్ 14 ప్రో, రెడ్మీ నోట్ 14 ప్రో ప్లస్ డివైజెస్ లో కర్వ్డ్ 1.5కే ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ఈ రెండు ఫోన్లలో బ్యాక్ ప్యానెల్ పై 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది.

ప్రో వేరియంట్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 3 చిప్సెట్ ఉంటుంది. ప్రో ప్లస్ మోడల్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7350 చిప్సెట్ ఉంటుంది.

లీక్స్ మరియు లిస్టింగ్స్ ప్రకారం, ఈ రెండు ఫోన్లు కూడా 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు తెలుస్తోంది.

The post Redmi Note 14 Series చైనా లాంచ్ ఖరారు, టీజర్ విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/redmi-note-14-series-china-launch-confirmed-via-teaser/feed/ 0