China telecom - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 25 Jun 2024 11:41:00 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 OPPO A3 5G: చైనా టెలీకామ్ సర్టిఫికేషన్ పొందిన ఏ3 5జీ https://www.91mobiles.com/telugu/oppo-a3-pro-5g-received-china-telecom-certification/ https://www.91mobiles.com/telugu/oppo-a3-pro-5g-received-china-telecom-certification/#respond Tue, 25 Jun 2024 11:41:00 +0000 https://www.91mobiles.com/telugu/?p=12210 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO కొన్ని రోజుల క్రితం భారతీయ మార్కెట్ లో OPPO A3 Pro 5G డివైజ్‌ను లాంచ్ చేసింది. రూ.17,999 ధరతో ఈ ఫోన్ విడుదలైంది. ఇప్పుడు ఒప్పో సంస్థ స్టాండర్డ్ వేరియంట్ OPPO A3 5G ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్ చైనా టెలీకామ్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఈ డివైజ్ స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం. OPPO A3 […]

The post OPPO A3 5G: చైనా టెలీకామ్ సర్టిఫికేషన్ పొందిన ఏ3 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OPPO A3 5G లాంచ్
  • డివైజ్ మోడల్ నంబర్ PKA110
  • 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO కొన్ని రోజుల క్రితం భారతీయ మార్కెట్ లో OPPO A3 Pro 5G డివైజ్‌ను లాంచ్ చేసింది. రూ.17,999 ధరతో ఈ ఫోన్ విడుదలైంది. ఇప్పుడు ఒప్పో సంస్థ స్టాండర్డ్ వేరియంట్ OPPO A3 5G ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్ చైనా టెలీకామ్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఈ డివైజ్ స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

OPPO A3 5G చైనా టెలీకామ్ లిస్టింగ్ వివరాలు

OPPO A3 5G స్మార్ట్‌ఫోన్ చైనా టెలీకామ్ వెబ్‌సైట్ పై PKA110 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

లిస్టింగ్ ప్రకారం, ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్ ఉంటుందని తెలుస్తోంది. ఈ ఆక్టా-కోర్ చిప్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2 గిగాహెర్ట్జ్.

OPPO A3 5G డివైజ్ చైనా టెలీకామ్ లిస్టింగ్ పై 6.7-ఇంచ్ స్క్రీన్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్ తో కనిపించింది.

OPPO A3 5G స్మార్ట్‌ఫోన్ 162.54 మి.మీ పొడవు, 75.44 మి.మీ వెడల్పు, 7.15 మి.మీ మందం, 179.05 గ్రాముల బరువు ఉంటుంది.

OPPO A3 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ తో లిస్ట్ అయ్యింది. త్వరలోనే ఈ డివైజ్ యొక్క లాంచ్ వివరాలతో పాటు, స్పెసిఫికేషన్స్‌ను కంపెనీ అధికారికంగా వెల్లడించనుంది.

OPPO A3 Pro 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OPPO A3 Pro లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, పంచ్ హోట్ కటౌట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1000 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: OPPO A3 Pro డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఆక్టాకోర్ చిప్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. ఈ చిప్ యొక్క హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్.

మెమొరీ: OPPO A3 Pro డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో 8జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ అందించారు. దీంతో యూజర్‌కి గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: OPPO A3 Pro లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, సెకండరీ ఏఐ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: OPPO A3 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5100 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: OPPO A3 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post OPPO A3 5G: చైనా టెలీకామ్ సర్టిఫికేషన్ పొందిన ఏ3 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oppo-a3-pro-5g-received-china-telecom-certification/feed/ 0
Vivo: గీక్‌బెంచ్, చైనా టెలీకామ్, 3సీ వెబ్‌సైట్స్‌పై లిస్టైన Vivo Y200i https://www.91mobiles.com/telugu/vivo-y200i-listed-on-geekbench-china-telecom-3c-websites/ Tue, 16 Apr 2024 06:13:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=11108 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో ఒక కొత్త వై-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. Vivo Y200i పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ గీక్‌బెంచ్, 3సీ మరియు చైనా టెలీకామ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ యొక్క డిజైన్, స్పెసిఫికేషన్స్ మరియు ధర రివీల్ అయ్యాయి. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి. Vivo Y200i డిజైన్ (చైనా టెలీకామ్ లిస్టింగ్) Vivo Y200i […]

The post Vivo: గీక్‌బెంచ్, చైనా టెలీకామ్, 3సీ వెబ్‌సైట్స్‌పై లిస్టైన Vivo Y200i first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo Y200i లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్
  • 6000 ఎంఏహెచ్ బ్యాటరీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో ఒక కొత్త వై-సిరీస్ ఫోన్ లాంచ్ కానుంది. Vivo Y200i పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ గీక్‌బెంచ్, 3సీ మరియు చైనా టెలీకామ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ యొక్క డిజైన్, స్పెసిఫికేషన్స్ మరియు ధర రివీల్ అయ్యాయి. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo Y200i డిజైన్ (చైనా టెలీకామ్ లిస్టింగ్)

Vivo Y200i స్మార్ట్‌ఫోన్ డిజైన్ చైనా టెలీకామ్ లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యింది.

Vivo Y200i డివైజ్ ని గమనిస్తే, పంచ్ హోల్ కటౌట్, మందపాటి చిన్ డిస్ప్లేపై ఉన్నాయి.

వివో వై200ఐ బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ మాడ్యూల్ ఉంది. ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.

Vivo Y200i లో 3.5ఎంఎం ఆడియో జాక్, స్పీకర్ గ్రిల్, ప్రైమరీ మైక్రోఫోన్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ టాప్ లో ఉన్నాయి. ఫోన్‌కి కుడివైపున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఉన్నాయి.

వివో వై200ఐ కలర్ ఆప్షన్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ తెలుపు రంగులో లాంచ్ కానుంది. ఇతర కలర్ వేరియంట్స్ గురించి సమాచారం లేదు.

Vivo Y200i డివైజ్ 165.70 మి.మీ పొడవు, 76.00 మి.మీ వెడల్పు, 7.99 మి.మీ మందం, 199 గ్రాముల బరువు ఉంటుంది.

Vivo Y200i ధర, స్పెసిఫికేషన్స్ (చైనా టెలీకామ్ లిస్టింగ్)

Vivo Y200i స్మార్ట్‌ఫోన్ 3 స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ కానుంది. అవి: 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ.

బేస్ మోడల్ ధర CNY 1,799 (సుమారు రూ.21,200), మిడ్ వేరియంట్ ధర CNY 1,899 (సుమారు రూ.22,300), టాప్ వేరియంట్ ధర CNY 1,999 (సుమారు రూ.23,500) గా ఉన్నాయి.

Vivo Y200i స్మార్ట్‌ఫోన్ 2408*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్ గల డిస్ప్లేతో వస్తోంది.

ఈ కొత్త ఫోన్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. ఫాస్ట్ చార్జింగ్ వివరాలు ఈ లిస్టింగ్ ద్వారా రివీల్ కాలేదు.

Vivo Y200i గీక్‌బెంచ్ మరియు 3సీ లిస్టింగ్

Vivo Y200i స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ మరియు 3సీ వెబ్‌సైట్స్ పై V2354A అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

Vivo Y200i డివైజ్ సింగిల్-కోర్ టెస్ట్ లో 3,199 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 7,931 పాయింట్లు స్కోర్ చేసింది.

లిస్టింగ్ ప్రకారం, వివో వై200ఐ అడ్రెనో 613 జీపీయూ, ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో వస్తున్నట్లు అర్థమవుతోంది.

ఇంకా లిస్టింగ్ పై Vivo Y200i 8జిబి ర్యామ్ మరియు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లిస్ట్ అయ్యింది.

చైనాకు చెందిన 3సీ సర్టిఫికేషన్ ద్వారా ఫాస్ట్ చార్జింగ్ వివరాలు రివీల్ అయ్యాయి. Vivo Y200i డివైజ్ 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

The post Vivo: గీక్‌బెంచ్, చైనా టెలీకామ్, 3సీ వెబ్‌సైట్స్‌పై లిస్టైన Vivo Y200i first appeared on 91Mobiles Telugu.

]]>