CMF - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 04 Aug 2023 11:56:41 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 CMF అనే సబ్-బ్రాండ్ ని ప్రకటించిన Nothing సీఈవో కార్ల్ పే https://www.91mobiles.com/telugu/nothing-introduced-its-sub-brand-cmf/ Fri, 04 Aug 2023 11:56:41 +0000 https://www.91mobiles.com/telugu/?p=7468 Nothing కంపెనీ తాజాగా 2023 రెండో త్రైమాసికానికి సంబంధించిన కమ్యూనిటీ అప్డేట్ వీడియోని షేర్ చేసింది. ఈ వీడియో ద్వారా బ్రాండ్ యొక్క అప్డేట్స్ బయటకు వచ్చాయి. సీఈవో కార్ల్ పే తమ కొత్త సబ్-బ్రాండ్ CMF ని ప్రకటించారు. ఈ బ్రాండ్ ద్వారా వినూత్నమైన డిజైన్లతో కొత్త శ్రేణి ఉత్పత్తులు రానున్నట్లు సమాచారం. ఇక CMF అంటే కలర్, మెటీరియల్, ఫినిష్ అని అర్థం. ఈ కొత్త బ్రాండ్ విశేషాలేంటో తెలుసుకుందాం. చూస్తుంటే, వన్‌ప్లస్ సబ్-బ్రాండ్ […]

The post CMF అనే సబ్-బ్రాండ్ ని ప్రకటించిన Nothing సీఈవో కార్ల్ పే first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నథింగ్ నుంచి వస్తోన్న కొత్త సబ్-బ్రాండ్
  • తక్కువ ధరలో రానున్న CMF ప్రొడక్ట్స్
  • 2023 ఆఖర్లో లాంచ్ కానున్న సీఎమ్ఎఫ్ ఉత్పత్తులు

Nothing కంపెనీ తాజాగా 2023 రెండో త్రైమాసికానికి సంబంధించిన కమ్యూనిటీ అప్డేట్ వీడియోని షేర్ చేసింది. ఈ వీడియో ద్వారా బ్రాండ్ యొక్క అప్డేట్స్ బయటకు వచ్చాయి. సీఈవో కార్ల్ పే తమ కొత్త సబ్-బ్రాండ్ CMF ని ప్రకటించారు. ఈ బ్రాండ్ ద్వారా వినూత్నమైన డిజైన్లతో కొత్త శ్రేణి ఉత్పత్తులు రానున్నట్లు సమాచారం. ఇక CMF అంటే కలర్, మెటీరియల్, ఫినిష్ అని అర్థం. ఈ కొత్త బ్రాండ్ విశేషాలేంటో తెలుసుకుందాం.

చూస్తుంటే, వన్‌ప్లస్ సబ్-బ్రాండ్ Nord స్ట్రేటజీని Nothing సంస్థ ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో మార్కెట్ లోకి అడుగుపెట్టనున్న CMF బ్రాండ్ నుంచి ఏ తరహా ప్రొడక్ట్స్ రానున్నాయోనన్న ఆసక్తి టెక్ వర్గాల్లో నెలకొంది. ఇకపోతే నథింగ్ సంస్థ తొలుత Nothing Ear (1) ని జులై 2021 లో లాంచ్ చేసింది. తర్వాత తన మొదటి ఫోన్ Nothing Phone (1) ని లాంచ్ చేసింది. తర్వాత Nothing Ear (2), Nothing (Stick), Nothing Phone (2) లను లాంచ్ చేసింది.

CMF by Nothing నుంచి ఏమి ఆశించవచ్చు?

నథింగ్ కంపెనీ సీఈవో కార్ల్ పే మాట్లాడుతూ, Nothing మరియు CMF రెండు కూడా వేర్వేరు బ్రాండ్స్ అని, అయితే ఒకే డీఎన్ఏని కలిగి ఉన్నాయని అన్నారు. CMF ఉత్పత్తుల్లో కూడా ఒకే స్థాయి డిజైన్, క్వాలిటీని మెంటైన్ చేస్తామని నథింగ్ సీఈవో అన్నారు. ఇకపోతే, నథింగ్ నుంచి రాబోవు ప్రొడక్ట్స్ ప్రీమియమ్ గా, సరికొత్త డిజైన్లతో, టెక్నాలజీతో వస్తాయని కార్ల్ పే అన్నారు.

The post CMF అనే సబ్-బ్రాండ్ ని ప్రకటించిన Nothing సీఈవో కార్ల్ పే first appeared on 91Mobiles Telugu.

]]>