Coca Cola Phone - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 25 Jan 2023 06:36:28 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 లీకైన Coca Cola ఫోన్ డిజైన్ రెండర్, త్వరలో భారత మార్కెట్‌లో లాంచ్ కానున్న డివైజ్ https://www.91mobiles.com/telugu/coca-cola-smartphone-render-leaked-looks-like-realme-10/ Wed, 25 Jan 2023 06:36:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=4636 అమెరికాకు చెందిన దిగ్గజ పానీయాల సంస్థ Coca Cola త్వరలోనే స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి ప్రవేశించబోతోంది. ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ చేసిన ట్వీట్ ద్వారా ఈ విషయం వెల్లడైంది. త్వరలోనే Coca Cola స్మార్ట్ ఫోన్ భారతగడ్డపై అడుగు పెట్టబోతోంది. తన నుంచి రాబోవు స్మార్ట్ ఫోన్ కోసం ఒక ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ తో Coca Cola జట్టుకట్టినట్లు సమాచారం. ముకుల్ శర్మ Coca Cola స్మార్ట్ ఫోన్ యొక్క డిజైన్ […]

The post లీకైన Coca Cola ఫోన్ డిజైన్ రెండర్, త్వరలో భారత మార్కెట్‌లో లాంచ్ కానున్న డివైజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • తొలిసారిగా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ తో జట్టుకడుతోన్న Coca Cola కంపెనీ
  • భారత మార్కెట్ లో మార్చి లోపు లాంచ్ కానున్న Coca Cola స్మార్ట్ ఫోన్
  • డిజైన్ రెండర్స్ ని బట్టి, Realme 10 మాదిరి కనిపిస్తోన్న Coca Cola ఫోన్

అమెరికాకు చెందిన దిగ్గజ పానీయాల సంస్థ Coca Cola త్వరలోనే స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి ప్రవేశించబోతోంది. ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ చేసిన ట్వీట్ ద్వారా ఈ విషయం వెల్లడైంది. త్వరలోనే Coca Cola స్మార్ట్ ఫోన్ భారతగడ్డపై అడుగు పెట్టబోతోంది. తన నుంచి రాబోవు స్మార్ట్ ఫోన్ కోసం ఒక ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ తో Coca Cola జట్టుకట్టినట్లు సమాచారం.

ముకుల్ శర్మ Coca Cola స్మార్ట్ ఫోన్ యొక్క డిజైన్ రెండర్ ని షేర్ చేశాడు. ఫోన్ చూడటానికి రెడ్ కలర్ లో ఉంది. బ్యాక్ ప్యానెల్ పై భారీ సైజులో కోకాకోలా బ్రాండింగ్ కనిపిస్తోంది. మార్చి లోపు Coca Cola స్మార్ట్ ఫోన్ భారత్ లో లాంచ్ కానుందని టిప్ స్టర్ వెల్లడించాడు. ఓసారి Coca Cola ఫోన్ డిజైన్ రెండర్ ని పరికించి చూద్దాం పదండి.

టిప్ స్టర్ షేర్ చేసిన డిజైన్ రెండర్స్ ని బట్టి, Coca Cola ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నట్లు కనిపిస్తోంది. దీనికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. కెమెరా లెన్స్‌లు ఫోన్ కి టాప్ లెఫ్ట్ కార్నర్ లో ఉన్నాయి. ఫోన్ చూడటానికి, Realme 10, Realme C33, Oppo A78 ఫోన్ల మాదిరి కనిపిస్తోంది. వాల్యూమ్ రాకర్స్ ఫోన్ కి కుడివైపున ఉన్నట్లు డిజైన్ రెండర్ ద్వారా స్ఫష్టమవుతోంది.

అయితే Coca Cola ఫోన్ డిజైన్ పవర్ బటన్ యొక్క పొజిషన్ ని రివీల్ చేయలేదు. పవర్ బటన్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఎంబెడ్ అయి ఉంటుందని మనం అంచనా వేయవచ్చు. Coca Cola ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై కోకా కోలా బ్రాండింగ్ అచ్చం కోకా కోలా కూల్‌డ్రింక్ బాటిల్ పై ఉన్నట్లే కనిపిస్తోంది. చూస్తుంటే, ఫోన్ బ్యాక్ ప్యానెల్ గ్రేడియంట్ టెక్షర్ తో ఉన్నట్లు తెలుస్తోంది.

Realme 10 స్పెసిఫికేషన్స్

ఇక Realme 10 విషాయానికి వస్తే, రీసెంట్ గా ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లో లాంచైంది. రియల్మీ 10 లో మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్, మాలి జీ57 గ్రాఫిక్స్, 8జిబి ర్యామ్, 90 హెర్ట్జ్ అమోలెడ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 1000 నిట్స్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఉన్నాయి.

Realme 10 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇందులో 33 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్, టైప్-సీ పోర్ట్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి బ్లాక్ అండ్ వైట్ సెన్సర్ ఉన్నాయి. 16ఎంపి సెల్ఫీ కెమెరాను ఈ ఫోన్ లో అందించారు. క్లాష్ వైట్, రష్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు. ఈ ఫోన్ బరువు 178 గ్రాములు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post లీకైన Coca Cola ఫోన్ డిజైన్ రెండర్, త్వరలో భారత మార్కెట్‌లో లాంచ్ కానున్న డివైజ్ first appeared on 91Mobiles Telugu.

]]>