Comedy Stock Exchange - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 21 Nov 2022 13:45:09 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Comedy Stock Exchange తో ఓటీటీకి ఎంట్రీ ఇస్తోన్న దర్శకుడు అనిల్ రావిపూడి https://www.91mobiles.com/telugu/aha-comedy-stock-exchange-anil-ravipudi-ott-debut/ Mon, 21 Nov 2022 13:43:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=3568 హైలైట్స్ కామెడీ స్టాక్ ఎక్స్‌చేంజ్ పేరుతో ఒక వినోద కార్యక్రమాన్ని తీసుకొస్తోన్న ఆహా ఓటీటీ ఈ కార్యక్రమంతో ఓటీటీ లోకి ఎంట్రీ ఇస్తోన్న సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి షో లో చైర్మన్ గా వ్యవహరించనున్న అనిల్ రావిపూడి, హోస్టులుగా వ్యవహరించనున్న సుడిగాలి సుధీర్, దీపికా పిళ్ళై తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా, గతేడాది తెలుగు ఇండియన్ ఐడల్, డ్యాన్స్ ఐకన్, అన్‌స్టాపబుల్, సర్కార్ వంటి పలు కార్యక్రమాలను తీసుకొచ్చి, ఓటీటీ ఆడియన్స్ ని అమితంగా అలరించింది. […]

The post Comedy Stock Exchange తో ఓటీటీకి ఎంట్రీ ఇస్తోన్న దర్శకుడు అనిల్ రావిపూడి first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • కామెడీ స్టాక్ ఎక్స్‌చేంజ్ పేరుతో ఒక వినోద కార్యక్రమాన్ని తీసుకొస్తోన్న ఆహా ఓటీటీ
  • ఈ కార్యక్రమంతో ఓటీటీ లోకి ఎంట్రీ ఇస్తోన్న సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి
  • షో లో చైర్మన్ గా వ్యవహరించనున్న అనిల్ రావిపూడి, హోస్టులుగా వ్యవహరించనున్న సుడిగాలి సుధీర్, దీపికా పిళ్ళై

తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా, గతేడాది తెలుగు ఇండియన్ ఐడల్, డ్యాన్స్ ఐకన్, అన్‌స్టాపబుల్, సర్కార్ వంటి పలు కార్యక్రమాలను తీసుకొచ్చి, ఓటీటీ ఆడియన్స్ ని అమితంగా అలరించింది. ఇప్పుడు కొత్త జోనర్ ని ఎక్స్‌ప్లోర్ చేయబోతోంది ఆహా. త్వరలోనే Comedy Stock Exchange పేరుతో ఒక కామెడీ షోని లాంచ్ చేయనుంది. ఇదొక లైట్-హార్టెడ్ ఫ్యామిలీ కామెడీ షో. రైటర్, దర్శకుడు అనిల్ రావిపూడి ఈ కార్యక్రమంతో ఓటీటీ కి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ షో లో ఆయన చైర్మన్ గా వ్యవహరించనున్నారు. ఈ చైర్మన్ ఏంటని తెలుసుకోవాలని ఉందా? అయితే షో మొదలయ్యే వరకు ఆగాల్సిందే.

డిసెంబర్ 2 నుంచి కామెడీ స్టాక్ ఎక్స్‌చేంజ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనిల్ రావిపూడి ఈ కార్యక్రమంలో చైర్మన్ గా వ్యవహరిస్తుండగా, సుడిగాలి సుధీర్, దీపికా పిళ్ళై హోస్టింగ్ చేయనున్నారు. ప్రముఖ హాస్య నటులు వేణు, ముక్కు అవినాశ్, సద్దాం, ఎక్స్‌ప్రెస్ హరి, భాస్కర్, జ్ఞానేశ్వర్ ఈ కార్యక్రమంలో భాగం కానున్నారు. వీరంతా కలిసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తారని ఆశిద్దాం. ఈ షో లో మొత్తం మూడు రౌండ్స్ ఉంటాయి. లైవ్ ఆడియన్స్ తమ ఫేవరెట్ స్టాక్ (కమెడియన్) కి ఓటు వేయడం జరుగుతుంది.

ఎక్కువ ఓట్లు గెలిచిన వారిని చైర్మన్ టాప్ స్టాక్ గా ప్రకటిస్తారు. ఈ కార్యక్రమం లో మొత్తం 10 ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రతీ వీకెండ్ కచ్చితంగా వినోదాన్ని పంచడం ఖాయం.

అనిల్ రావిపూడి ఓటీటీ ఎంట్రీ

తన ఓటీటీ ఎంట్రీ పట్ల దర్శకుడు అనిల్ రావిపూడి సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాగం కావడం ఆనందంగా ఉందన్నారు. ఈ షో విభిన్న కామెడీ యాంగిల్స్ ని చూపిస్తుందని అనిల్ తెలిపారు. తన ఎంట్రీకి వేదికైనందుకు, అలాగే కామెడీ స్టాక్ ఎక్స్‌చేంజ్ షో లో అవకాశం ఇచ్చినందుకు ఆహా కి అనిల్ ధన్యవాదాలు తెలిపారు.

“నా తొలి ఓటీటీ కార్యక్రమం కావున, ఇది నా హృదయానికి ఎంతో దగ్గరైనది. నా అభిమానులు నన్ను ఒక కొత్త అవతారంలో చూస్తారు,” అని అనిల్ రావిపూడి అన్నారు. ఆహా ఓటీటీ తో అసోసియేట్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని, తనని తాను రీఇన్వెంట్ చేసుకునేందుకు ఇదొక చక్కటి అవకాశమని సుడిగాలి సుధీర్ అన్నారు.

తొలి తెలుగు ఓటీటీ గా మొదలైన ఆహా అనతి కాలంలోనే రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు దగ్గరైంది. ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు, విభిన్నమైన సినిమాలను ఓటీటీ ఆడియన్స్ కి అందిస్తూ అగ్ర ఓటీటీ సంస్థలకు గట్టి పోటీ ఇస్తోంది. కామెడీ స్టాక్ ఎక్స్‌చేంజ్ కార్యక్రమం తో వస్తోన్న ఆహా, ప్రేక్షకులకు కచ్చితంగా వినోదాన్ని పంచుతుందని ఆశిద్దాం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Comedy Stock Exchange తో ఓటీటీకి ఎంట్రీ ఇస్తోన్న దర్శకుడు అనిల్ రావిపూడి first appeared on 91Mobiles Telugu.

]]>