Dell - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 18 Oct 2022 12:08:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Alienware m15 R7 గేమింగ్ ల్యాప్‌టాప్ ని లాంచ్ చేసిన Dell https://www.91mobiles.com/telugu/dell-launched-alienware-m15-r7-gaming-laptop-in-india/ Tue, 18 Oct 2022 12:02:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=2942 హైలైట్స్ భారత్ లో Alienware m15 R7 గేమింగ్ ల్యాప్ టాప్ ని లాంచ్ చేసిన డెల్ AMD Ryzen 6000 H సిరీస్ ప్రాసెసర్, Nvidia GeForce RTX 30 సిరీస్ జీపీయూ తో లాంచ్ అయిన Alienware m15 R7 గేమింగ్ తో పాటు డెయిలీ టాస్క్స్ చేసుకోడానికి బాగా పని చేసే Alienware m15 R7 Dell కంపెనీ బ్రాండ్ న్యూ Alienware m15 R7 గేమింగ్ ల్యాప్ టాప్ ని భారత్ […]

The post Alienware m15 R7 గేమింగ్ ల్యాప్‌టాప్ ని లాంచ్ చేసిన Dell first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • భారత్ లో Alienware m15 R7 గేమింగ్ ల్యాప్ టాప్ ని లాంచ్ చేసిన డెల్
  • AMD Ryzen 6000 H సిరీస్ ప్రాసెసర్, Nvidia GeForce RTX 30 సిరీస్ జీపీయూ తో లాంచ్ అయిన Alienware m15 R7
  • గేమింగ్ తో పాటు డెయిలీ టాస్క్స్ చేసుకోడానికి బాగా పని చేసే Alienware m15 R7

Dell కంపెనీ బ్రాండ్ న్యూ Alienware m15 R7 గేమింగ్ ల్యాప్ టాప్ ని భారత్ లో లాంచ్ చేసింది. ఈ ప్రీమియమ్ గేమింగ్ ల్యాప్ టాప్ రెండు కన్ఫిగరేషన్స్ లో లభిస్తుంది. అద్భుతమైన పెర్ఫామెన్స్ ని అందించడానికి ఈ రెండు ల్యాప్ టాప్స్ లో పవర్ఫుల్ హార్డ్‌వేర్ ఉన్నాయి. Alienware m15 R7 ల్యాప్ టాప్ లో AMD Ryzen 6000 H సిరీస్ ప్రాసెసర్స్ వాడారు. అలాగే గ్రాఫిక్స్ కోసం Nvidia GeForce RTX 30 సిరీస్ జీపీయూ వినియోగించారు. అలాగే ఈ ల్యాప్ టాప్ క్లీన్ అండ్ స్లీక్ డిజైన్ తో వస్తోంది. గేమర్ ఫోకస్డ్ ఈస్తటిక్స్, పర్-కీ ఆర్జీబీ బ్యాక్‌లిట్ కీబోర్డ్ వంటి ఫీచర్లు ఈ ల్యాప్‌టాప్ లో ఉన్నాయి.

Alienware m15 R7 గేమింగ్ ల్యాప్‌టాప్ స్పెసిఫికేషన్స్, ధర

Alienware m15 R7 గేమింగ్ ల్యాప్‌టాప్ 15.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. ఏఎండీ రైజెన్ 7 6800హెచ్ ప్రాసెసర్, ఎన్విడియా జీఈఫోర్స్ ఆర్టీఎక్స్ 3060 జీపీయూ ఈ ల్యాప్ టాప్ లో ఉన్నాయి. Alienware m15 R7 లో 16జిబి DDR5 ర్యామ్, 512జిబి M.2 PCIe NVMe SSD స్టోరేజీ ఉన్నాయి. Alienware m15 R7 యొక్క మరొక వేరియంట్ లో Nvidia GeForce RTX 3070 Ti GPU మరియు 1TB M.2 PCIe NVMe SSD స్టోరేజీ ఉన్నాయి. మిగతా స్పెసిఫికేషన్స్ అన్నీ ఒకే విధంగా ఉన్నాయి.

Alienware m15 R7 గేమింగ్ ల్యాప్ టాప్ స్మూథ్ గేమ్ ప్లే అనుభూతిని అందించేందుకు Nvidia G-Sync మరియు Advanced Optimus టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. ఇవే కాకుండా, ఈ ల్యాప్ టాప్ లో డాల్బి విజన్, డాల్బి అట్మాస్ సపోర్ట్ ఉన్నాయి. ఈ ల్యాప్ టాప్ లో పర్-కీ ఆర్జీబీ ఏలియన్ఎఫ్ఎక్స్ బ్యాక్‌లిట్ కీబోర్డ్ ఉంది. ఏలియన్ కమాండ్ సెంటర్ ద్వారా ఈ కీబోర్డ్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు. థర్మల్స్ విషయానికి వస్తే, Alienware m15 R7 Cryo-Tech కూలింగ్ టెక్నాలజీతో వస్తోంది. ఇది మీరు చేసే పనిని బట్టి పవర్ సెట్టింగ్స్ ని అడ్జస్ట్ చేస్తూ పర్ఫామెన్స్ ని ఆప్టిమైజ్ చేస్తుంది.

ఇప్పుడే ఎవాల్స్ అవుతోన్న ఇండియన్ గేమింగ్ కమ్యూనిటీ కోసం Alienware m15 R7 గేమింగ్ ల్యాప్ టాప్ ని తీసుకొచ్చామని డెల్ కంపెనీ ప్రొడక్ట్-మార్కెటింగ్ ఇండియా కన్జూమర్ డైరెక్టర్ పుజన్ చడా చెప్పారు. ప్రీమియమ్ క్వాలిటీ, ఐకానిక్ డిజైన్, హై పెర్ఫామెన్స్ కలిగిన పవర్ఫుల్ గేమింగ్ ల్యాప్ టాప్స్ ని భవిష్యత్తులో మరిన్ని తీసుకొస్తామని పుజన్ తెలిపారు.

Alienware m15 R7 గేమింగ్ ల్యాప్ టాప్ యొక్క Nvidia GeForce RTX 3060 GPU మరియు 512GB SSD వేరియంట్ ధర రూ.1,59,990 గా ఉంది. ఇకపోతే, Nvidia GeForce RTX 3070 Ti GPU మరియు 1TB SSD వేరియంట్ ధర రూ.1,99,990 గా ఉంది. Alienware m15 R7 గేమింగ్ ల్యాప్ టాప్ డెల్ ఆన్‌లైన్ స్టోర్ తో పాటు, డెల్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్, ఇతర ఔట్‌లెట్స్ ద్వారా లభ్యమవుతుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post Alienware m15 R7 గేమింగ్ ల్యాప్‌టాప్ ని లాంచ్ చేసిన Dell first appeared on 91Mobiles Telugu.

]]>
4కే డిస్ప్లే తో లాంచ్ అయిన Dell XPS 13 Plus 9320 ల్యాప్ టాప్ https://www.91mobiles.com/telugu/dell-xps-13-plus-9320-laptop-launched-in-india/ Thu, 21 Jul 2022 10:51:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=1142 హైలైట్స్: భారత్ లో లాంచ్ అయిన డెల్ ఎక్స్పీఎస్ 13 ప్లస్ 9320 ల్యాప్ టాప్ 4కే డిస్ప్లే, 12th జనరేషన్ ఇంటెల్ కోర్ సీపీయూ, 1టీబీ ఎస్ఎస్డీ స్టోరేజీ, విండోస్ 11 ఓఎస్ ఈ ల్యాప్ టాప్ ప్రత్యేకతలు రూ.1,59,990 నుంచి మొదలు కానున్న డెల్ ఎక్స్పీఎస్ 13 ప్లస్ 9320 ధర డెల్ కంపెనీ యొక్క ఎక్స్పీఎస్ సిరీస్ లో భాగంగా, డెల్ ఎక్స్పీఎస్ 13 ప్లస్ 9320 ల్యాప్ టాప్ భారత్ లో […]

The post 4కే డిస్ప్లే తో లాంచ్ అయిన Dell XPS 13 Plus 9320 ల్యాప్ టాప్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • భారత్ లో లాంచ్ అయిన డెల్ ఎక్స్పీఎస్ 13 ప్లస్ 9320 ల్యాప్ టాప్
  • 4కే డిస్ప్లే, 12th జనరేషన్ ఇంటెల్ కోర్ సీపీయూ, 1టీబీ ఎస్ఎస్డీ స్టోరేజీ, విండోస్ 11 ఓఎస్ ఈ ల్యాప్ టాప్ ప్రత్యేకతలు
  • రూ.1,59,990 నుంచి మొదలు కానున్న డెల్ ఎక్స్పీఎస్ 13 ప్లస్ 9320 ధర

డెల్ కంపెనీ యొక్క ఎక్స్పీఎస్ సిరీస్ లో భాగంగా, డెల్ ఎక్స్పీఎస్ 13 ప్లస్ 9320 ల్యాప్ టాప్ భారత్ లో లాంచ్ అయ్యింది. ఇతర ఎక్స్పీఎస్ మోడల్స్ మాదిరి స్లిమ్ ప్రొఫైల్ కలిగిన ఎక్స్పీఎస్ 13 ప్లస్ ల్యాప్ టాప్ కేవలం 1.24 కేజీల బరువు మాత్రమే ఉంది. ఇక ఈ ల్యాప్ టాప్ 12 వ తరం ఇంటెల్ కోర్ సీపీయూ ని కలిగి ఉంది. ప్రస్తుత తరం సీపీయూ తో పోల్చితే 12వ తరం సీపీయూ అధిక సామర్థ్యం కలిగి ఉంటుంది.ఇక ఈ ల్యాప్ టాప్ 13 అంగుళాలు గల, వంద శాతం ఎస్ఆర్జీబీ కవరేజ్ తో కూడిన 4కే డిస్ప్లేను కలిగి ఉంది. అలాగే ఈ డిస్ప్లే 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంది. ఈ ల్యాప్ టాప్ పూర్తిగా రీసైక్లబుల్ అల్యూమినియమ్ మరియు గ్లాస్ తో తయారు చేయబడిందని డెల్ కంపెనీ చెబుతోంది.

ఇప్పుడు మరిన్ని ముఖ్యమైన ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. డెల్ ఎక్స్పీఎస్ 13 ప్లస్ లో 16జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 1టీబీ పీసీఎల్ఈ 4 ఎస్ఎస్డీ స్టోరేజీ, విండోస్ 11 ఓఎస్, 3-సెల్ 55 వాట్ బ్యాటరీ ఉన్నాయి. ఈ బ్యాటరీ గంట వ్యవధిలో 80 శాతం ఛార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.

భారత్ లో Dell XPS 13 Plus 9320 ధర, లభ్యత

డెల్ ఎక్స్పీఎస్ 13 ప్లస్ 9320 ల్యాప్ టాప్ ఇంటెల్ కోర్ ఐ5-1260పీ ప్రాసెసర్, 16జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీని కలిగి ఉంది. దీని ధర రూ.1,59,990. హై-ఎండ్ కోర్ ఐ7-1260పీ 12 కోర్స్ వర్షన్ ధర రూ.1,79,990. ఈ మోడల్ లో కూడా 16జిబి ర్యామ్, 1టీబీ స్టోరేజీ లభిస్తుంది. మరి ఈ ల్యాప్ టాప్ ని ఎక్కడ కొనుగోలు చేయవచ్చో ఇక్కడ తెలుసుకుందాం. జులై 23 నుంచి డెల్ ఇండియా వెబ్ సైట్ తో పాటు, ఈ-కామర్స్ సైట్ అమెజాన్ ద్వారా డెల్ ఎక్స్పీఎస్ 13 ప్లస్ 9320 ల్యాప్ టాప్ ను కొనుగోలు చేయవచ్చు.

Dell XPS 13 Plus 9320 స్పెసిఫికేషన్స్

డెల్ ఎక్ప్సీఎస్ 13 ప్లస్ ల్యాప్ టాప్ 13.4 అంగుళాల 4కే ఐపీఎస్ టచ్ స్క్రీన్ యాంటీ రిఫ్లెక్ట్ డిస్ప్లే ని కలిగి ఉంది. దీని రెజుల్యూషన్ 3820*2400, రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్, బ్రైట్నెస్ 500నిట్స్ గా ఉంది. ఇందులో వంద శాతం ఎస్ఆర్జీబీ కవరేజ్, ఐసేఫ్ టెక్నాలజీ (బ్లూ లైట్ ను తగ్గిస్తుంది) ఉన్నాయి. 12 వ తరం ఇంటెల్ కోర్ ఐ7-1260పీ సీపీయూ వరకు, 18ఎంబి క్యాచే, ఇంటెల్ ఐరిస్ ఎక్స్ఈ గ్రాఫిక్స్ ఈ ల్యాప్ టాప్ లో ఉన్నాయి. ఇంకా 16జిబి ఎల్పీడీడీఆర్5 డ్యూయల్ చానల్ ర్యామ్ (5200మెగాహెర్ట్జ్), 1టీబీ వరకు ఎమ్.2 జెన్ 4 పీసీఎల్ఈ ఎన్వీఎంఈ ఎస్ఎస్డీ స్టోరేజీ వంటి ఫీచర్లున్నాయి.

యూఎస్ మరియు ఇంటర్నేషనల్ వర్షన్స్ లైట్ గ్రే బ్యాక్ లిట్ కీబోర్డ్, ఫింగర్ ప్రింట్ రీడర్ తో వస్తున్నాయి. ఇక పోర్ట్స్ గురించి తెలుసుకుందాం. ఈ ల్యాప్ టాప్ థండర్ బోల్ట్ 4 (యూఎస్బీ టైప్-సీ, డిస్ప్లే పోర్ట్, పవర్ డెలివరీ) రెండు పోర్ట్స్, యూఎస్బీ-సీ టూ యూఎస్బీ-ఏ 3.0 అడాప్టర్, యూఎస్బీ-సీ టూ 3.5ఎంఎం అడాప్టర్ లతో వస్తోంది. 8 వాట్ ఔట్ పుట్ తో కూడిన నాలుగు స్పీకర్లు డెల్ ఎక్స్పీఎస్ 13 ప్లస్ లో ఉన్నాయి. వై-ఫై 6, బ్లూటూత్ 5.2 వంటి కనెక్టివిటీ ఫీచర్లున్నాయి. 720పి హెచ్డీ ఆర్జీబీ కెమెరాను ఇందులో అమర్చారు. ల్యాప్ టాప్ మెజర్మెంట్స్ 15.28*295.30*199.04 గా ఉన్నాయి. కాగా ల్యాప్ టాప్ బరువు 1.24 కేజీలు.

The post 4కే డిస్ప్లే తో లాంచ్ అయిన Dell XPS 13 Plus 9320 ల్యాప్ టాప్ first appeared on 91Mobiles Telugu.

]]>