Details leak - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 18 Sep 2024 11:26:18 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Samsung Galaxy A56: లాంచ్‌కి ముందు లీకైన గెలాక్సీ ఏ56 వివరాలు https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a56-5g-details-leaked-before-launch/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a56-5g-details-leaked-before-launch/#respond Wed, 18 Sep 2024 11:26:18 +0000 https://www.91mobiles.com/telugu/?p=13581 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో గెలాక్సీ ఏ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Samsung Galaxy A56 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇంకా ఈ ఫోన్ లాంచ్ కి సంబంధించిన ప్రకటనను శాంసంగ్ వెల్లడించాల్సి ఉంది. ఈలోపు, ఈ ఫోన్ యొక్క లాంచ్ టైమ్‌లైన్, మోడల్ నంబర్, చిప్సెట్ వివరాలు లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం. Samsung Galaxy A56 వివరాలు (లీక్) Samsung Galaxy […]

The post Samsung Galaxy A56: లాంచ్‌కి ముందు లీకైన గెలాక్సీ ఏ56 వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Samsung Galaxy A56 విడుదల
  • ఇంకా వెల్లడి కాని అధికార ప్రకటన
  • మోడల్ నంబర్ SM-A566B/DS

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో గెలాక్సీ ఏ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Samsung Galaxy A56 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇంకా ఈ ఫోన్ లాంచ్ కి సంబంధించిన ప్రకటనను శాంసంగ్ వెల్లడించాల్సి ఉంది. ఈలోపు, ఈ ఫోన్ యొక్క లాంచ్ టైమ్‌లైన్, మోడల్ నంబర్, చిప్సెట్ వివరాలు లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం.

Samsung Galaxy A56 వివరాలు (లీక్)

Samsung Galaxy A56 స్మార్ట్‌ఫోన్ యొక్క వివరాలను Smartprix వెబ్‌సైట్ తన కథనం ద్వారా రివీల్ చేసింది.

Samsung Galaxy A56 డివైజ్ ఇప్పటికే టెస్టింగ్‌ను పూర్తి చేసుకుని వచ్చే ఏడాది లాంచ్ కి సిద్ధంగా ఉన్నట్లు లీక్ ద్వారా తెలుస్తోంది.

Samsung Galaxy A56 స్మార్ట్‌ఫోన్ యొక్క మోడల్ నంబర్ SM-A566B/DS అని రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది.

గత మోడల్ Samsung Galaxy A55 మోడల్ నంబర్ SM-A556B/DS గా ఉంది. ఏ55 కంటే మెరుగైన ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ తో ఏ56 విడుదలయ్యే అవకాశం ఉంది.

Samsung Galaxy A56 లాంచ్ టైమ్‌లైన్ (లీక్)

Samsung Galaxy A56 స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం నెట్వర్క్ టెస్టింగ్ దశలో ఉన్నట్లు లీక్ ద్వారా తెలుస్తోంది. దీన్ని బట్టి, 2025 మొదటి త్రైమాసికంలో గెలాక్సీ ఏ56 లాంచ్ అవుతుందని అంచనా వేయవచ్చు. అంటే, మార్చిలో విడుదల ఉంటుందని భావించవచ్చు.

Samsung Galaxy A56 స్పెసిఫికేషన్స్ (లీక్)

Samsung Galaxy A56 స్మార్ట్‌ఫోన్ ఎగ్జినోస్ 1580 చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ప్రాసెసర్ గీక్‌బెంచ్ పై కనిపించింది. ఈ చిప్సెట్, స్నాప్‌డ్రాగన్ 888 కి సమానమైన స్కోర్ చేసింది. గ్రాఫిక్స్ విషయానికి వస్తే, ఎక్స్‌క్లిప్స్ 540 జీపీయూని ఈ చిప్సెట్ తో జత చేయనున్నారు. ఇప్పటికి స్పెసిఫికేషన్స్ గురించి తెలిసిన సమాచారం ఇంతే. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడి కావచ్చు.

Samsung Galaxy A55 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy A55 5G లో 6.6-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ సూపర్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy A55 5G లో ఎగ్జినోస్ 1480 చిప్సెట్, ఎక్స్‌క్లిప్స్ 530 జీపీయూ గ్రాఫిక్స్ ఉన్నాయి.

ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A55 5G డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Samsung Galaxy A55 5G లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 5ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy A55 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Samsung Galaxy A55 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Samsung Galaxy A56: లాంచ్‌కి ముందు లీకైన గెలాక్సీ ఏ56 వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a56-5g-details-leaked-before-launch/feed/ 0