EcoDryft - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 09 Mar 2023 13:06:36 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 భారతదేశపు చవకైన ఈ-బైక్ EcoDryft ని లాంచ్ చేసిన ప్యూర్ ఈవీ సంస్థ https://www.91mobiles.com/telugu/pure-ev-launches-ecodryft-electric-bike-in-india/ Tue, 31 Jan 2023 07:55:17 +0000 https://www.91mobiles.com/telugu/?p=4703 ప్యూర్ ఈవీ సంస్థ భారత్ లో EcoDryft అనే ఎలక్ట్రిక్ బైక్ ని లాంచ్ చేసింది. భారతదేశంలోనే చవకైన ఎలక్ట్రిక్ బైక్ గా EcoDryft నిలిచింది. ఈ ఎలక్ట్రిక్ బైక్ ని ప్యూర్ ఈవీ హైదరాబాద్ లోని తన మానుఫాక్చరింగ్ ఫెసిలిటీలో అభివృద్ధి చేసింది. EcoDryft బండి టాప్ స్పీడ్: 75km/h. ఈ బైక్ సింగిల్ చార్జ్ పై 130 కిలోమీటర్ల దూరం వెళ్తుంది. భారత్ లో EcoDryft e-bike ధర EcoDryft బైక్ నాలుగు కలర […]

The post భారతదేశపు చవకైన ఈ-బైక్ EcoDryft ని లాంచ్ చేసిన ప్యూర్ ఈవీ సంస్థ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • తక్కువ ధరలో ఈ-బైక్ ని తీసుకొచ్చిన ప్యూర్ ఈవీ కంపెనీ
  • ప్యూర్ ఈవీ తీసుకొచ్చిన లేటెస్ట్ ఈ-బైక్ పేరు EcoDryft
  • సింగిల్ చార్జ్ పై 130 కిలోమీటర్లు వెళ్ళనున్న EcoDryft బైక్, ఈ బండి గరిష్ట వేగం 75km/h

ప్యూర్ ఈవీ సంస్థ భారత్ లో EcoDryft అనే ఎలక్ట్రిక్ బైక్ ని లాంచ్ చేసింది. భారతదేశంలోనే చవకైన ఎలక్ట్రిక్ బైక్ గా EcoDryft నిలిచింది. ఈ ఎలక్ట్రిక్ బైక్ ని ప్యూర్ ఈవీ హైదరాబాద్ లోని తన మానుఫాక్చరింగ్ ఫెసిలిటీలో అభివృద్ధి చేసింది. EcoDryft బండి టాప్ స్పీడ్: 75km/h. ఈ బైక్ సింగిల్ చార్జ్ పై 130 కిలోమీటర్ల దూరం వెళ్తుంది.

భారత్ లో EcoDryft e-bike ధర

EcoDryft బైక్ నాలుగు కలర వేరియంట్స్ లో లభిస్తుంది. అవి: బ్లూ, రెడ్, బ్లాక్, గ్రే. EcoDryft ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధర రూ.99,999 (1,227 డాలర్లు) గా ఉంది. ఉపఖండపు దేశాల్లో EcoDryft బైక్ ధర రూ.1,14,999 (1,411 డాలర్లు) గా ఉంటుంది. రాష్ట్రాల వారీ సబ్సిడీలు, ఆర్టీవో ఫీజులను బట్టి ఆన్-రోడ్ ధర ఉంటుంది. దక్షిణాసియాతో మొదలై EcoDryft బైక్ ఇతర గ్లోబల్ మార్కెట్స్ లోకి కూడా అడుగు పెట్టనుంది.

భారతదేశ వ్యాప్తంగా ప్యూర్ ఈవీ కంపెనీ తన డీలర్ నెట్వర్క్ ని విస్తరింపజేస్తోంది. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాల్లో కూడా తన డీలర్ నెట్వర్క్ ని ఎక్స్‌ప్యాండ్ చేసే ఆలోచనలో ప్యూర్ ఈవీ సంస్థ ఉంది.

EcoDryft బైక్ 3 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటర్ ని కలిగి ఉంది. ఈ బైక్ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంటల్ క్లస్టర్ ఉన్నాయి. టెస్ట్ డ్రైవింగ్ కోసం, దేశ వ్యాప్తంగా ఉన్న తమ డీలర్షిప్స్ వద్ద EcoDryft యొక్క డెమో వర్షన్స్ ని అందుబాటులో ఉంచామని ప్యూర్ ఈవీ సంస్థ తెలిపింది. కస్టమర్ల నుంచి స్పందన అద్భుతంగా ఉందని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. మార్చి నుంచి డెలివరీలు మొదలవుతాయి.

ప్యూర్ ఈవీ సంస్థ భారత టూ-వీలర్ ఈవీ మార్కెట్ లో అగ్రభాగం షేర్ ని కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. కమ్యూట్ మోటర్ సైకిల్స్ ద్వారా భారత్ లో టూ-వీలర్ సేల్స్ అమాంతం పెరుగుతాయని ప్యూర్ ఈవీ కంపెనీ అంచనా వేస్తోంది. ఇకపోతే, EcoDryft కి భారతీయ కన్జూమర్ల నుంచి మంచి స్పందన వస్తుందని అంచనా వేస్తున్నారు. భారతదేశ వ్యాప్తంగా ప్యూర్ ఈవీ కంపెనీ తన డీలర్ నెట్వర్క్ ని విస్తరింపజేస్తోంది. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాల్లో కూడా తన డీలర్ నెట్వర్క్ ని ఎక్స్‌ప్యాండ్ చేసే ఆలోచనలో ప్యూర్ ఈవీ సంస్థ ఉంది.

ప్యూర్ ఈవీ కంపెనీ నుంచి వస్తోన్న ఇకో డ్రిఫ్ట్ ఎలక్ట్రిక్ మోటర్ సైకిల్ కి కస్టమర్ల నుంచి ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి. బైక్ చవకైనదని చెబుతున్నప్పటికీ, అంతకన్నా తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్లు వస్తుండటంతో, జనాలు అటువైపుగా వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఎలక్ట్రిక్ బైక్ కోసం చూసేవారికి EcoDryft మంచి ఆప్షన్ అవుతుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post భారతదేశపు చవకైన ఈ-బైక్ EcoDryft ని లాంచ్ చేసిన ప్యూర్ ఈవీ సంస్థ first appeared on 91Mobiles Telugu.

]]>