Eko Tejas - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 30 Nov 2022 10:57:08 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 150km రేంజ్, స్పేర్ బ్యాటరీ ఆప్షన్ తో వస్తోన్న E-Dyroth ఎలక్ట్రిక్ బైక్ https://www.91mobiles.com/telugu/eko-tejas-e-dyroth-muscle-electric-bike-specs-availability/ Wed, 30 Nov 2022 10:53:43 +0000 https://www.91mobiles.com/telugu/?p=3773 హైలైట్స్ త్వరలో E-Dyroth ఎలక్ట్రిక్ బైక్ ని లాంచ్ చేయనున్న Eko Tejas సంస్థ సింగిల్ చార్జ్ పై 150 కిలోమీటర్ల దూరం పరిగెట్టనున్న బైక్ స్పేర్ బ్యాటరీ ఆప్షన్ తో మొత్తం 300 కిలోమీటర్ల దూరం వెళ్ళనున్న బండి దేశీయ ఎలక్ట్రిక్ మోటర్‌సైకిల్ తయారీదారు అయిన Eko Tejas త్వరలో హైస్పీడ్ మోటర్ సైకిల్ E-Dyroth ని లాంచ్ చేయబోతోంది. ఇకో తేజస్ నుంచి వస్తున్న తొలి ఈ-బైక్ ఇదే కావడం విశేషం. మేక్ ఇన్ […]

The post 150km రేంజ్, స్పేర్ బ్యాటరీ ఆప్షన్ తో వస్తోన్న E-Dyroth ఎలక్ట్రిక్ బైక్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • త్వరలో E-Dyroth ఎలక్ట్రిక్ బైక్ ని లాంచ్ చేయనున్న Eko Tejas సంస్థ
  • సింగిల్ చార్జ్ పై 150 కిలోమీటర్ల దూరం పరిగెట్టనున్న బైక్
  • స్పేర్ బ్యాటరీ ఆప్షన్ తో మొత్తం 300 కిలోమీటర్ల దూరం వెళ్ళనున్న బండి

దేశీయ ఎలక్ట్రిక్ మోటర్‌సైకిల్ తయారీదారు అయిన Eko Tejas త్వరలో హైస్పీడ్ మోటర్ సైకిల్ E-Dyroth ని లాంచ్ చేయబోతోంది. ఇకో తేజస్ నుంచి వస్తున్న తొలి ఈ-బైక్ ఇదే కావడం విశేషం. మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ లో భాగంగా వస్తోన్న తొలి మజిల్ బైక్ E-Dyroth.

హైస్పీడ్ క్రూజర్ బైక్ అయిన E-Dyroth ఎలక్ట్రిక్ బైక్ 2022 డిసెంబర్ నుంచి అందుబాటులోకి వస్తుంది. భారతదేశపు మొదటి మేడ్ ఇన్ ఇండియా మజిల్ ఈ-మోటర్ సైకిల్ హార్లే డేవిడ్సన్ బైక్ మాదిరి లుక్ తో తయారైంది.

E-Dyroth ఎలక్ట్రిక్ బైక్ స్పెసిఫికేషన్స్

ఈ స్మార్ట్ వెహికిల్ బ్యాటరీ, కంట్రోలర్ మరియు క్లస్టర్ లకు నడుమ సీమ్లెస్ ఇంటిగ్రేషన్ ని కలిగి ఉంది. అలాగే మంచి డ్రైవింగ్ అనుభూతి కోసం అన్ని రకాల స్మార్ట్ ఫీచర్స్ ఈ బండిలో ఉన్నాయి. వెహికిల్ ని రైడర్ తన మొబైల్ ఫోన్ తో కనెక్ట్ చేసుకోవచ్చు. తద్వారా డ్యాష్ బోర్డ్ పై నోటిఫికేషన్స్, పాయింట్-టు-పాయింట్ నేవిగేషన్ తదితర ఫీచర్లను పొందవచ్చు.

ఇకో తేజస్ చెబుతున్న దాని ప్రకారం, సింగిల్ చార్జ్ పై E-Dyroth 150 కిలోమీటర్లు వెళ్తుంది. ఈ బండిలో స్పేర్ బ్యాటరీని పెట్టుకునే సౌకర్యం ఉంది. దీని వల్లన బండి మరొక 150 కిలోమీటర్ల దూరం వెళ్తుంది. అంటే మొత్తంగా 300 కిలోమీటర్ల రేంజ్ ని ఈ బండి కలిగి ఉంది.

E-Dyroth బండి కొనుగోలుతో పాటు 72 volts/60ah బెనిఫిట్ ని పొందుతారు. అదనంగా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కూడా లభిస్తుంది. వెహికిల్ కంపెనీ ఇచ్చే చార్జింగ్ స్టేషన్ తో పాటు వస్తుంది. ఈ చార్జింగ్ స్టేషన్ ని కంపెనీ డీలర్లు, కొనుగోలుదారుడు నివసించే అపార్ట్‌మెంట్ లోని అతని పార్కింగ్ స్థలంలో ఇన్‌స్టాల్ చేస్తారు.

E-Dyroth ఎలక్ట్రిక్ బైక్ 100 కేఎంపీహెచ్ టాప్ స్పీడ్ వెళ్తుంది. ఈ స్పీడ్ ని 4 కిలోవాట్ హై ఆర్పీఎం మిడ్ డ్రైవ్ మోటర్ సాయంతో చేరుకోవచ్చు.

భారతదేశపు మొదటి మజిల్ ఈ-బైక్ ని లాంచ్ చేస్తున్నందుకు సంతోషంగా ఉందని ఇకో తేజస్ డైరెక్టర్ కే వెంకటేశ్ తేజ వెల్లడించారు. ఇన్‌బిల్ట్ నేవిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్ నోటిఫికేషన్ ఫీచర్ తో ఈ బైక్ వస్తున్నట్లు వెంకటేశ్ తెలిపారు.

Eko Tejas డీలర్షిప్స్

ఇకో తేజస్ సంస్థకి భారతదేశంలోని 10 రాష్ట్రాల్లో డీలర్షిప్స్ ఉన్నాయి. అవి: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హర్యాన, మధ్యప్రదేశ్, బీహార్, ఒడిశా. ప్రస్తుతం E-Dyroth ప్రీ-బుకింగ్స్ జరుగుతున్నాయి. ఈ బండి ధరను ఇంకా కంపెనీ వెల్లడించలేదు. అయితే 1.50 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో పూర్తి స్పష్టత వస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post 150km రేంజ్, స్పేర్ బ్యాటరీ ఆప్షన్ తో వస్తోన్న E-Dyroth ఎలక్ట్రిక్ బైక్ first appeared on 91Mobiles Telugu.

]]>