Electric bicycles - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 22 Sep 2022 13:53:11 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 మార్కెట్ లో అందుబాటులో ఉన్న బెస్ట్ ఎలక్ట్రిక్ సైకిల్స్ https://www.91mobiles.com/telugu/best-electric-bicycles-in-the-market/ Thu, 22 Sep 2022 13:53:11 +0000 https://www.91mobiles.com/telugu/?p=2511 హైలైట్స్: మీ ఆఫీస్ 10 కిలోమీటర్ల దూరం ఉంటే ఎలక్ట్రిక్ సైకిల్ కొనడం మేలు పర్యావరణాన్ని కాపడటంలో సైకిల్స్ ది ప్రముఖ పాత్ర వివిధ రకాల రేంజుల్లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ సైకిల్స్ బెస్ట్ ఎలక్ట్రిక్ సైకిల్స్: గత కొన్ని సంవత్సరాల నుంచి దేశంలోని యువతలో సైకిళ్ళ పట్ల క్రేజ్ పెరిగింది. ఎన్నో సైకిల్ తయారీ కంపెనీలు బ్యాటరీ-పవర్డ్ సైకిళ్ళను లాంచ్ చేశాయి. తక్కువ దూరాలకు ఈ సైకిళ్ళు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. మీరు కనుక కొత్త ఎలక్ట్రిక్ […]

The post మార్కెట్ లో అందుబాటులో ఉన్న బెస్ట్ ఎలక్ట్రిక్ సైకిల్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • మీ ఆఫీస్ 10 కిలోమీటర్ల దూరం ఉంటే ఎలక్ట్రిక్ సైకిల్ కొనడం మేలు
  • పర్యావరణాన్ని కాపడటంలో సైకిల్స్ ది ప్రముఖ పాత్ర
  • వివిధ రకాల రేంజుల్లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ సైకిల్స్
Pic Credit: felidaeelectric.com

బెస్ట్ ఎలక్ట్రిక్ సైకిల్స్: గత కొన్ని సంవత్సరాల నుంచి దేశంలోని యువతలో సైకిళ్ళ పట్ల క్రేజ్ పెరిగింది. ఎన్నో సైకిల్ తయారీ కంపెనీలు బ్యాటరీ-పవర్డ్ సైకిళ్ళను లాంచ్ చేశాయి. తక్కువ దూరాలకు ఈ సైకిళ్ళు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. మీరు కనుక కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ కొనాలనుకుంటే అందుకు సంబంధించిన సమాచారాన్ని మీకు మేం అందిస్తాం. మార్కెట్ లో ఏయే ఎలక్ట్రిక్ సైకిళ్ళు అందుబాటులో ఉన్నాయో ఇక్కడ తెలియజేస్తున్నాం. ఓసారి చూడండి.

బ్యాటరీ తో నడిచే సైకిళ్ళు:

  • Hero Lectro C8i
  • Smartron tbike OneX
  • Tresor e-cycle
  • Roadlark electric cycle
  • Stryder Contino ETB 100
  • Hero F2i and Hero F3i

1. Hero Lectro C8i

తక్కువ మరియు ఓ మోస్తరు దూరాలకు వెళ్ళి వచ్చే వారికి హీరో లెక్ట్రో సీ8ఐ ఎలక్ట్రిక్ సైకిల్ ఉత్తమమైనది. ఐస్మార్ట్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా, బ్లూటూత్ సాయంతో రైడర్ స్పీడ్, మ్యాప్స్, బ్యాటరీ చార్జ్, మోడ్, బ్యాటరీ డ్రెయిన్ ఇన్ఫర్మేషన్ వంటివి తెలుసుకోవచ్చు. ఈ సైకిల్ 35 కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉంది. ఈ సైకిల్ పై రూ.7500 సబ్సిడీ లభిస్తుంది. ఈ సైకిల్ లో 6.36ఏహెచ్ బ్యాటరీ ఉంది. దీని కెపాసిటీ 250వాట్. ఇక ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ధర రూ.39,999.

2. Smartron tbike OneX

ఈ సైకిల్ రేంజ్ 100 కిలోమీటర్లు. ఒక్కసారి చార్జ్ చేస్తే, వంద కిలోమీటర్లు నిర్విరామంగా పరిగెడుతుంది. ఈ సైకిల్ లో రేంజ్ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. ఇందులో స్వాపబుల్ బ్యాటరీ సౌకర్యం ఉంది. ఈ సైకిల్ ఫ్రేమ్ పై జీవితకాల వ్యారంటీని అందిస్తున్నారు. ఈ సైకిల్ బ్యాటరీ 5 ఏళ్ళకు పైగా నడుస్తుంది. అలాగే 1,00,000 కిలోమీటర్ల రైడింగ్ లైఫ్ ఇస్తుంది. ఈ సైకిల్ పై 125 కిలోల బరువుని తీసుకెళ్ళవచ్చు.ఇక దీని ధర జీఎస్టీ లేకుండా రూ.38,000.

3. Tresor e-cycle

ఈ సైకిల్ లో 250 వాట్ మోటర్ రిమూవబుల్ లిథియమ్-అయాన్ బ్యాటరీని అందించారు. సింగిల్ చార్జ్ పై ఈ బ్యాటరీ 60 నుంచి 80 కిలోమీటర్ల రేంజ్ ని అందిస్తుంది. టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు. ఈ సైకిల్ ధర రూ.55,999.

4. Stryder Contino ETB 100

భారత మార్కెట్ లో ఈ సైకిల్ ధర రూ.37,999. అలాగే ఈ సైకిల్ రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: బ్లాక్, బ్లూ. సైకిల్ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో డబుల్ డిస్క్ బ్రేక్స్, కీ-లాక్ బ్యాటరీ, స్మార్ట్ రైడ్, ఫ్రంట్ ఎల్ఈడీ నైట్ విజన్ ల్యాంప్, డిటాచబుల్ బ్యాటరీ, ఐపీ54 వాటర్/స్ప్లాష్ ప్రూఫ్ బాడీ ఉన్నాయి. సింగిల్ చార్జ్ పై ఈ సైకిల్ 60 కిలోమీటర్ల దూరం పరిగెడుతుంది.

5. Roadlark electric cycle

ఈ సైకిల్ లో బీఎల్‌డీసీ 250వాట్ 36వోల్ట్స్ మోటర్ అమర్చారు. పెడల్-అసిస్ట్ మోడ్ లో సైకిల్ 100 కిలోమీటర్ల వరకు నడుస్తుందని కంపెనీ చెబుతోంది. రోడ్ లార్క్ యొక్క టాప్ స్పీడ్ 25కేఎంపీహెచ్. 3 నుంచి 5 గంటల్లో ఈ సైకిల్ బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేయవచ్చు. ఈ సైకిల్ ధర రూ.44,083.

6. Hero F2i, Hero F3i

ఈ సైకిల్స్ సింగిల్ చార్జ్ పై 35 కిలోమీటర్లు పరిగెడతాయి. 7 గేర్ స్పీడ్ ఈ సైకిల్స్ లో అందుబాటులో ఉంది. ఈ సైకిల్స్ 100ఎంఎం సస్పెన్షన్, 27.5-ఇంచ్, 29-ఇంచ్ డబుల్ అల్లాయ్ రిమ్స్ తో వస్తున్నాయి. Hero F2i ధర రూ.39,999, Hero F3i ధర రూ.40,999.

లేటెస్ట్ ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, స్మార్ట్ ఫోన్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post మార్కెట్ లో అందుబాటులో ఉన్న బెస్ట్ ఎలక్ట్రిక్ సైకిల్స్ first appeared on 91Mobiles Telugu.

]]>