Enigma E-Scooters - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Fri, 16 Sep 2022 08:35:50 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 6 కొత్త E-Scooters తో పాటు Cafe Race Bike ని పరిచయం చేసిన Enigma https://www.91mobiles.com/telugu/enigma-e-scooters-unveiled-launch-timeline/ Fri, 16 Sep 2022 08:35:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=2385 హైలైట్స్ 6 కొత్త ఈ-స్కూటర్లతో పాటు, ఎలక్ట్రిక్ కేఫే రేసర్ బైక్ ప్రోటోటైప్ ని పరిచయం చేసిన ఈవీ మేకర్ ఎనిగ్మా 160 కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉన్న ఎనిగ్మా తయారు చేసిన ఈ-స్కూటర్లు 2022 అక్టోబర్ మూడోవారంలో ఎనిగ్మా ఈ-స్కూటర్లు లాంచ్ అవుతాయని అంచనా ఈవీ మేకర్ ఎనిగ్మా 7 కొత్త హై స్పీడ్ ఎలక్ట్రిక్ టూ-వీలర్స్ ని ఈవీ ఇండియా ఎక్స్‌పో 2022 లో పరిచయం చేసింది. వీటిలో 6 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు, […]

The post 6 కొత్త E-Scooters తో పాటు Cafe Race Bike ని పరిచయం చేసిన Enigma first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • 6 కొత్త ఈ-స్కూటర్లతో పాటు, ఎలక్ట్రిక్ కేఫే రేసర్ బైక్ ప్రోటోటైప్ ని పరిచయం చేసిన ఈవీ మేకర్ ఎనిగ్మా
  • 160 కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉన్న ఎనిగ్మా తయారు చేసిన ఈ-స్కూటర్లు
  • 2022 అక్టోబర్ మూడోవారంలో ఎనిగ్మా ఈ-స్కూటర్లు లాంచ్ అవుతాయని అంచనా

ఈవీ మేకర్ ఎనిగ్మా 7 కొత్త హై స్పీడ్ ఎలక్ట్రిక్ టూ-వీలర్స్ ని ఈవీ ఇండియా ఎక్స్‌పో 2022 లో పరిచయం చేసింది. వీటిలో 6 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఒక ప్రోటోటైప్ ఎలక్ట్రిక్ బైక్ ఉన్నాయి. 6 ఎలక్ట్రిక్ స్కూటర్లు మాత్రం 2022 అక్టోబర్ మూడోవారంలో భారత మార్కెట్లో లాంచ్ అవ్వనున్నాయి. ఈ అన్ని స్కూటర్లు కూడా అందుబాటు ధరలో రానున్నాయి. అలాగే 90km నుంచి 160km మధ్య వీటి రైడింగ్ రేంజ్ ఉంటుంది. మల్టీపుల్ కలర్ ఆప్షన్స్, డ్రైవ్ మోడ్స్, డిస్క్ బ్రేక్స్, ఎల్ఈడీ లైటింగ్ తో ఈ స్కూటర్లు వస్తున్నాయి.

Enigma ఈ-స్కూటర్స్, ప్రోటోటైప్ ఈ-బైక్

మధ్య ప్రదేశ్ కి చెందిన ఈవీ మేకర్ అయిన ఎనిగ్మా ఈవీ ఇండియా ఎక్స్‌పో 2022 లో తాను తయారు చేసిన ఈ-స్కూటర్లను ప్రదర్శించింది.

Enigma Crink+

క్రింక్ ప్రోడక్ట్ లైనప్ తో Enigma Crink+ చేరిపోయింది. ఈ బండి లిథియమ్-అయాన్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. 120 కిలోమీటర్ల రైడ్ రేంజ్ ఈ బండి సొంతం. మూడున్నర గంటల్లో ఈ బండి వంద శాతం చార్జ్ అవుతుంది. Enigma Crink+ టాప్ స్పీడ్ 60కేఎంపీహెచ్. యెల్లో, వైట్, గ్రే, బ్లూ కలర్ ఆప్షన్స్ లో ఈ బండి లభిస్తుంది.

Enigma Crink Pro

క్రింక్ లైనప్ లో Enigma Crink Pro రెండో మోడల్. Enigma Crink Pro లో ఎల్ఎఫ్‌పి బ్యాటరీ టెక్నాలజీ ఉపయోగించారు. ఈ బండి రేంజ్ 90 – 110 కిలోమీర్లు. వంద శాతం చార్జ్ అవ్వడానికి ఈ బ్యాటరీ 3 గంటల సమయం తీసుకుంటుంది. Enigma Crink Pro టాప్ స్పీడ్ 70కేఎంపీహెచ్. రాయల్ బ్లూ, వైట్, గ్రే, గోల్డ్, మాట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ బండి లభిస్తుంది.

Enigma GT 450

సింగిల్ చార్జ్ తో Enigma GT 450 135 కిలోమీటర్ల దూరం పరిగెడుతుంది. ఈ బండి లెడ్ యాసిడ్, లిథియమ్ అయాన్ అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ ని కలిగి ఉంది. లెడ్ యాసిడ్ బ్యాటరీ పూర్తిగా చార్జ్ అవ్వడానికి 7 నుంచి 8 గంటల సమయం తీసుకుంటుంది. మరోవైపు లిథియమ్ అయాన్ బ్యాటరీ 100 శాతం చార్జ్ అవ్వడానికి 3 నుంచి 5 గంటల సమయం పడుతుంది. Enigma GT 450 బండి స్కై బ్లూ, గ్రే, గోల్డెన్, సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Enigma GT 450 Pro

Enigma GT 450 Pro బండిలో 2.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది సింగిల్ చార్జ్ పై 120 కిలోమీటర్ల దూరం పరిగెడుతుంది. Enigma GT 450 Pro టాప్ స్పీడ్ 70కేఎంపీహెచ్. Enigma GT 450 Pro బండి రూ.36,000 ఫేమ్-2 సబ్సిడీకి అర్హత కలిగి ఉంది. దీంతో చాలామంది కస్టమర్లకు ఈ డీల్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. Enigma GT 450 Pro బండి గోల్డ్, సిల్వర్, స్కై బ్లూ, గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Enigma Ambier

Enigma Ambier ఎక్స్-షోరూమ్ ధర రూ.52,250 అని కంపెనీ చెబుతోంది. ఈ బండి 160 కిలోమీటర్ల రేంజ్ ని ఆఫర్ చేస్తోంది. Enigma Ambier ఎలక్ట్రిక్ స్కూటర్ రెడ్, వైట్, బ్లూ, ఆరెంజ్, సిల్వర్, గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Enigma N8 Thunderstorm

Enigma N8 Thunderstorm 36Ah బ్యాటరీని కలిగి ఉంది. సింగిల్ చార్జి పై ఈ బండి 130 కిలోమీటర్లు పరిగెడుతుంది. ఈ బండి టాప్ స్పీడ్ 60కేఎంపీహెచ్. Enigma N8 Thunderstorm హోండా గ్రే, రాయల్ బ్లూ, బీఎండబ్ల్యూ గోల్డ్, వైట్, సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Enigma CR22 – ప్రోటోటైప్ ఎలక్ట్రిక్ బైక్

Enigma CR22 ప్రస్తుతం ప్రోటోటైప్ స్టేజీలో ఉంది. ఇది భారతదేశపు తొలి ఎలక్ట్రిక్ కెఫే రేసర్. ఈ ప్రోటోటైప్ 120 కేఎంపీహెచ్ టాప్ స్పీడ్ కలిగి ఉంది. సింగిల్ చార్జ్ పై ఈ బైక్ 105 కిలోమీటర్ల దూరం పరిగెడుతుంది.

ఈ ఏడాది ముగిసే నాటికి తన డీలర్షిప్స్ సంఖ్యను 54 నుంచి 100 కి పెంచుకోవాలని ఎనిగ్మా కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

లేటెస్ట్ ఆటోమొబైల్, స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post 6 కొత్త E-Scooters తో పాటు Cafe Race Bike ని పరిచయం చేసిన Enigma first appeared on 91Mobiles Telugu.

]]>