EVTRIC Mighty Pro - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 08 Sep 2022 14:58:25 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 లాంచ్ అయిన రెండు EVTRIC ఎలక్ట్రిక్ స్కూటర్లు: ధర తక్కువ, రేంజ్ ఎక్కువ https://www.91mobiles.com/telugu/evtric-e-scooters-launched-india-price-specs/ Thu, 08 Sep 2022 14:58:25 +0000 https://www.91mobiles.com/telugu/?p=2207 హైలైట్స్: భారత్ లో లాంచ్ అయిన EVTRIC ఎలక్ట్రిక్ స్కూటర్లు తక్కువ ధరను కలిగి ఉన్న EVTRIC Ride HS, EVTRIC Mighty Pro 120 కిలోమీటర్ల రేంజ్ ని కలిగి ఉన్న EVTRIC ఎలక్ట్రిక్ స్కూటర్లు తక్కువ ధర కలిగిన రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు భారత్ లో లాంచ్ అయ్యాయి. మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ EVTRIC మోటార్స్ EVTRIC Ride HS, EVTRIC Mighty Pro అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింది. […]

The post లాంచ్ అయిన రెండు EVTRIC ఎలక్ట్రిక్ స్కూటర్లు: ధర తక్కువ, రేంజ్ ఎక్కువ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • భారత్ లో లాంచ్ అయిన EVTRIC ఎలక్ట్రిక్ స్కూటర్లు
  • తక్కువ ధరను కలిగి ఉన్న EVTRIC Ride HS, EVTRIC Mighty Pro
  • 120 కిలోమీటర్ల రేంజ్ ని కలిగి ఉన్న EVTRIC ఎలక్ట్రిక్ స్కూటర్లు

తక్కువ ధర కలిగిన రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు భారత్ లో లాంచ్ అయ్యాయి. మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ EVTRIC మోటార్స్ EVTRIC Ride HS, EVTRIC Mighty Pro అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింది. తక్కువ ధరలో బ్యాటరీతో నడిచే స్కూటీ కొనాలనుకునే వారు ఈ స్కూటర్లలో ఒక దానిని ప్రయత్నించవచ్చు. ఈ రెండు హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు 120 కిలో మీటర్ల రేంజ్ ని ఇస్తాయని కంపెనీ చెబుతోంది. తక్కువ ధరలో 120 కిలో మీటర్ల రేంజ్ తో ఈ బండ్లు రావడం విశేషమే.

లాంచ్ అయిన EVTRIC Ride HS, EVTRIC Mighty Pro

గ్రేటర్ నొయిడా లోని ఎక్స్‌పో సెంటర్ లో జరిగిన ఈవీ ఇండియా ఎక్స్‌పో 2022 లో ఈ రెండు ఈ-స్కూటర్లు లాంచ్ అయ్యాయి. ఉత్తమమైన ఫీచర్లు కలిగిన ఈ రెండు స్కూటర్లు అద్భుతమైన టెక్నాలజీతో వచ్చాయి. రెండు మోడల్స్ కూడా లిథియమ్-అయాన్ రిమూవబుల్ బ్యాటరీని కలిగి ఉన్నాయి. మరి ఇతర ఈ-స్కూటర్లకు వీటికి మధ్య ఉన్న తేడా ఏంటో ఇక్కడ చూద్దాం.

EVTRIC Ride HS, EVTRIC Mighty Pro ధర, బుకింగ్స్

EVTRIC Ride HS ధర రూ.81,838 గా కంపెనీ నిర్ణయించింది. ఇక EVTRIC Mighty Pro ధర రూ.79,567 గా ఉంది. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలని గమనించాలి. ధరను రివీల్ చేయడంతో పాటు, బుకింగ్ వివరాలను కూడా కంపెనీ వెల్లడించింది. రూ.10,000 బుకింగ్ అమౌంట్ గా నిర్ణయించారు. ఆసక్తిగల కస్టమర్లు కంపెనీ యొక్క అధికార వెబ్ సైట్ ద్వారా లేదా దగ్గర్లోని డీలర్షిప్ వద్ద రూ.10,000 బుకింగ్ అమౌంట్ చెల్లించి స్కూటర్ ని బుక్ చేసుకోవచ్చు. తక్కువ ధరలో ఎక్కువ రేంజ్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం చూస్తున్న వారికి EVTRIC ఎలక్ట్రిక్ స్కూటర్లు మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.

EVTRIC Ride HS స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

EVTRIC Ride HS బండి గురించి మాట్లాడితే, ఇది చూడటానికి ఎంతో ప్రీమియమ్ గా కనిపిస్తోంది. దీని టాప్ స్పీడ్ గంటకు 55 కిలోమీటర్లు. కాగా సింగిల్ చార్జి పై ఈ బండి 120 కిలోమీటర్ల దూరం వెళ్తుంది. 4 గంటల్లో పూర్తి చార్జ్ అవుతుంది. మూడు రంగుల్లో ఈ బండి లభ్యమవుతుంది. అవి: బ్లాక్, వైట్, గ్రే.

EVTRIC Mighty Pro స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

మరోవైపు, EVTRIC Mighty Pro అత్యధికంగా 65 కిలోమీటర్ల స్పీడ్ ని కలిగి ఉంది. ఒక్కసారి చార్జ్ చేస్తే, ఈ బండి 120 కిలోమీటర్లు వెళ్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు రంగుల్లో లభ్యమవుతుంది. అవి: రెడ్, వైట్, గ్రే. ఈ స్కూటర్లో లిథియమ్-అయాన్ బ్యాటరీ ఉంది.

లేటెస్ట్ ఆటోమొబైల్, స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ వార్తల కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post లాంచ్ అయిన రెండు EVTRIC ఎలక్ట్రిక్ స్కూటర్లు: ధర తక్కువ, రేంజ్ ఎక్కువ first appeared on 91Mobiles Telugu.

]]>