Exynos 2300 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 12 Jul 2022 07:36:50 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో రానున్న Samsung Galaxy S23 సిరీస్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-s23-to-come-with-sd-8gen2-chipset-and-not-with-exynos2300-chipset/ Tue, 12 Jul 2022 07:36:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=909 హైలైట్స్: * శాంసంగ్ నుంచి రానున్న గెలాక్సీ ఎస్23 సిరీస్ లో Exynos ప్రాసెసర్ వాడటం లేదు. * సిరీస్ మొత్తం Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ తో వస్తుంది. * ఈ సిరీస్ లో గెలాక్సీ ఎస్23 స్టాండర్డ్ వేరియంట్, గెలాక్సీ ఎస్23+, గెలాక్సీ ఎస్23 అల్ట్రా ఉంటాయి శాంసంగ్ గెలాక్సీ ఎస్23 లాంచ్ కి ఇంకా చాలా సమయం ఉంది. కానీ, ఈలోపు లీక్స్ మాత్రం వస్తూనే ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 […]

The post స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో రానున్న Samsung Galaxy S23 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

* శాంసంగ్ నుంచి రానున్న గెలాక్సీ ఎస్23 సిరీస్ లో Exynos ప్రాసెసర్ వాడటం లేదు.

* సిరీస్ మొత్తం Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ తో వస్తుంది.

* ఈ సిరీస్ లో గెలాక్సీ ఎస్23 స్టాండర్డ్ వేరియంట్, గెలాక్సీ ఎస్23+, గెలాక్సీ ఎస్23 అల్ట్రా ఉంటాయి

శాంసంగ్ గెలాక్సీ ఎస్23 లాంచ్ కి ఇంకా చాలా సమయం ఉంది. కానీ, ఈలోపు లీక్స్ మాత్రం వస్తూనే ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 లైనప్ కి సంబంధించిన చిప్సెట్ విషయంలో పలు కథనాలు గతంలో నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. శాంసంగ్ తన సొంత చిప్సెట్ అయిన ఎగ్జినోస్ 2300 ని పక్కనబెట్టేసి, స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 వైపు మొగ్గు చూపనుందని టెక్ విశ్లేషకుడు మింగ్-చీ కువో అంచనా వేశాడు.

Samsung Galaxy S23 సిరీస్ ప్రాసెసర్

ఇండస్ట్రీ వ్యక్తి మింగ్-చీ కువో చెబుతున్న దాని బట్టి, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్ లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ను వాడనున్నట్లు సమాచారం. ఇది వరకు శాంసంగ్ తన ఫ్లాగ్ షిప్ ఫోన్స్ లో పలు మార్కెట్లలో ఒక్కోరకం చిప్సెట్ వాడే వారు. కానీ ఈసారి ఎస్23 సిరీస్ అన్ని మార్కెట్స్ కి స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో లభించనుంది.

క్వాల్కమ్ నుంచి వస్తున్న తదుపరి ఫ్లాగ్ షిప్ ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 (SM8550) ఈ నవంబర్ లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో డిసెంబర్ నుంచి పలు బ్రాండ్స్ ఈ చిప్సెట్ ని తమ ఫోన్స్ లో వాడనున్నాయి. ఇక శాంసంగ్ ఎస్23 వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి లో లాంచ్ అయ్యే అవకాశముంది. దీన్ని బట్టి, శాంసంగ్, ఎగ్జినోస్ 2300 చిప్సెట్ ను విడుదల చేయడం లేదని కాదు, చిప్సెట్ కు సంబంధించిన అభివృద్ధి పనులు ఇంకా కొనసాగుతున్నాయట. దీని కోడ్ నేమ్ క్వాడ్రా అని తెలుస్తోంది. ఇక శాంసంగ్ గెలాక్సీ ఎస్23 కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవ్వనున్నాయి.

The post స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో రానున్న Samsung Galaxy S23 సిరీస్ first appeared on 91Mobiles Telugu.

]]>