Flipkart Big Billion Days Sale 2024 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 26 Sep 2024 11:28:14 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 రూ.7,499 కే లభిస్తోన్న POCO 5జీ ఫోన్, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/poco-5g-phone-is-available-for-just-rs-7499-know-full-details/ https://www.91mobiles.com/telugu/poco-5g-phone-is-available-for-just-rs-7499-know-full-details/#respond Thu, 26 Sep 2024 11:28:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=13764 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO నుంచి వచ్చిన 5జీ ఫోన్ POCO M6 5G ప్రస్తుతం ఆఫర్ లో తక్కువ ధరకే లభిస్తోంది. తక్కువ బడ్జెట్ లో 5జీ ఫోన్ కొనాలని భావిస్తోన్న వారికి ఇది మంచి అవకాశం. POCO M6 5G ని మీరు రూ.7,499 కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ గతేడాది భారత్‌లో లాంచ్ అయ్యింది. పోకో ఎమ్6 5జీ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ […]

The post రూ.7,499 కే లభిస్తోన్న POCO 5జీ ఫోన్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • పోకో ఎమ్6 5జీ పై డిస్కౌంట్
  • ఆఫర్ ధర రూ.7,499
  • ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO నుంచి వచ్చిన 5జీ ఫోన్ POCO M6 5G ప్రస్తుతం ఆఫర్ లో తక్కువ ధరకే లభిస్తోంది. తక్కువ బడ్జెట్ లో 5జీ ఫోన్ కొనాలని భావిస్తోన్న వారికి ఇది మంచి అవకాశం. POCO M6 5G ని మీరు రూ.7,499 కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ గతేడాది భారత్‌లో లాంచ్ అయ్యింది. పోకో ఎమ్6 5జీ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఓసారి ఆఫర్లు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

POCO M6 5G ఆఫర్లు, ధర

POCO M6 5G యొక్క 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ఆఫర్ లో రూ.7,499 కే లభిస్తోంది. రూ.500 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు.

మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు.

మీరు ఒకేసారి డబ్బు మొత్తాన్ని చెల్లించలేకపోతే, 3 నెలల కాలపరిమితితో నో కాస్ట్ ఈఎంఐ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. క్రింద ఇవ్వబడిన టీజర్ పోస్టర్ లో ఆఫర్ వివరాలను చూడండి.

POCO M6 5G ఫోన్‌ని ఎక్కడ కొనాలి?

ఫ్లిప్‌కార్ట్ లో రేపటి నుంచి మొదలయ్యే బిగ్ బిలియన్ డేస్ సేల్ లో POCO M6 5G ని ఆఫర్ లో కొనుగోలు చేయవచ్చు. అయితే, వీఐపీ కస్టమర్లకు నేటి నుంచే ఎర్లీ యాక్సెస్ ఉంది.

ఫ్లిప్‌కార్ట్ లింక్

మరో విషయం ఏంటంటే, ఈ ఫోన్ 3 స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. అవి: 4జిబి+128జిబి, 6జిబి+128జిబి, 8జిబి+256జిబి. వీటి ధరలు వరుసగా రూ.9,249, రూ.9,499 మరియు రూ.13,499 గా ఉన్నాయి.

POCO M6 5G స్పెసిఫికేషన్స్

స్క్రీన్: POCO M6 5G లో 6.74-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఉన్నాయి.

ప్రాసెసర్: POCO M6 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: POCO M6 5G 4జిబి/6జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: POCO M6 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఏఐ ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ: POCO M6 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: POCO M6 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. రెండేళ్ళు ఆండ్రాయిడ్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

కనెక్టివిటీ: POCO M6 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post రూ.7,499 కే లభిస్తోన్న POCO 5జీ ఫోన్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/poco-5g-phone-is-available-for-just-rs-7499-know-full-details/feed/ 0