Galaxy A04S 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 18 Jul 2022 13:40:50 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 శాంసంగ్ నుంచి తక్కువ ధరలో 5జీ ఫోన్, త్వరలో లాంచ్ కానున్న Galaxy A04S https://www.91mobiles.com/telugu/samsung-to-launch-budget-5g-phone-galaxy-a04s-after-5g-rollout-in-india/ Mon, 18 Jul 2022 13:40:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=1045 హైలైట్స్: భారత్ లో మొదలైన శాంసంగ్ గెలాక్సీ ఏ04ఎస్ ఫోన్ కి సంబంధించిన ఇంటర్నల్ టెస్టింగ్, త్వరలోనే లాంచ్. 4జీ, 5జీ వర్షన్స్ లో అందుబాటులోకి రానున్న ఏ04ఎస్. భారత్ లో 5జీ రోలౌట్ అయ్యాక లాంచ్ కానున్న శాంసంగ్ గెలాక్సీ ఏ04ఎస్. శాంసంగ్ గెలాక్సీ ఏ04ఎస్, కంపెనీ నుంచి త్వరలోనే లాంచ్ కానున్న బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్. ఇటీవలె ఈ ఫోన్ గీక్ బెంచ్ సర్టిఫికేషన్ సైట్ లో దర్శనమిచ్చింది. దీంతో స్పెసిఫికేషన్స్ పై కాస్త […]

The post శాంసంగ్ నుంచి తక్కువ ధరలో 5జీ ఫోన్, త్వరలో లాంచ్ కానున్న Galaxy A04S first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • భారత్ లో మొదలైన శాంసంగ్ గెలాక్సీ ఏ04ఎస్ ఫోన్ కి సంబంధించిన ఇంటర్నల్ టెస్టింగ్, త్వరలోనే లాంచ్.
  • 4జీ, 5జీ వర్షన్స్ లో అందుబాటులోకి రానున్న ఏ04ఎస్.
  • భారత్ లో 5జీ రోలౌట్ అయ్యాక లాంచ్ కానున్న శాంసంగ్ గెలాక్సీ ఏ04ఎస్.

శాంసంగ్ గెలాక్సీ ఏ04ఎస్, కంపెనీ నుంచి త్వరలోనే లాంచ్ కానున్న బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్. ఇటీవలె ఈ ఫోన్ గీక్ బెంచ్ సర్టిఫికేషన్ సైట్ లో దర్శనమిచ్చింది. దీంతో స్పెసిఫికేషన్స్ పై కాస్త అవగాహన వచ్చింది. శాంసంగ్ సొంత చిప్సెట్ ఎగ్జినోస్ 850 ప్రాసెసర్ తో ఈ ఫోన్ వస్తుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. అయితే శాంసంగ్ 5జీ వేరియంట్ పై కూడా పని చేస్తున్నట్లు 91మొబైల్స్ హిందీ తెలిపింది.

ఈ రిపోర్ట్ ని బట్టి ఇంకా తెలియవస్తున్నదేంటంటే, రూ.10 వేలు, రూ.11 వేల ధరల శ్రేణిలో 5జీ ఫోన్ ని తీసుకురావాలని శాంసంగ్ యోచిస్తోందట. ఇది నిజంగా అద్భుతమనే చెప్పాలి. ఎందుకంటే, ఈ ధరలో 5జీ ఫోన్స్ రావడమనేది చాలా తక్కువ శాతమే. మార్కెట్ లో కూడా పెద్దగా ఆప్షన్స్ లేవు. దీంతో శాంసంగ్ నుంచి రాబోవు గెలాక్సీ ఏ04ఎస్ ఫోన్ ఈ సెగ్మెంట్ లో మొదటిదని అనుకోవాలి.

Samsung Galaxy A04S 5G ఇండియా లాంచ్

శాంసంగ్ గెలాక్సీ ఎమ్13 మాదిరి, గెలాక్సీ ఏ04ఎస్ కూడా 4జీ మరియు 5జీ వేరియంట్లలో వస్తోంది. మరో విషయం ఏంటంటే, గెలాక్సీ ఏ04ఎస్ 4జీ, 5జీ వర్షన్స్ భారత్ లోనే తయారుకాబడి, వివిధ మార్కెట్లకు ఎగుమతి అవుతాయట. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న గెలాక్సీ ఏ04ఎస్ ఫోన్ లాంచ్ అయ్యే సరికి ఒక నెల నుంచి రెండు నెలల సమయం పడుతుందట.

సెప్టెంబర్ లో శాంసంగ్ గెలాక్సీ ఏ04ఎస్ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశముంది. 2021 ఆగస్టులో శాంసంగ్ ఏ03ఎస్ మోడల్ లాంచ్ అయిన సంగతి తెలిసిందే. జులై 26 న 5జీ స్పెక్ట్రమ్ వేలం పాట జరగనుంది. కాగా, ఆగస్టు 15 నుంచి భారత్ లో 5జీ సేవలు మొదలవుతాయని అంచనా వేస్తున్నారు. ఇక 5జీ సేవలు భారత్ లో లాంచ్ అయిన తర్వాతే, ఏ04ఎస్ ఫోన్ ని శాంసంగ్ లాంచ్ చేసే అవకాశముంది.

Samsung Galaxy A04S డిజైన్

ఇప్పుడు శాంసంగ్ గెలాక్సీ ఏ04ఎస్ ఫోన్ యొక్క డిజైన్ గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ పాలీకార్బొనేట్ బాడీని కలిగి ఉంది. ఈ ధరల శ్రేణిలో పాలీకార్బొనేట్ మెటీరియల్ తోనే వస్తాయని ఊహించవచ్చు. ఇక కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. అలాగే ఎల్ఈడీ ఫ్లాష్ ను అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సర్ సైడ్ ప్యానెల్ పై ఉంది. ఇక ముందు భాగాన వాటర్ డ్రాప్ నాచ్ ఉంది. ఇక యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్ ఈ ఫోన్లో ఉంటాయి.

Samsung Galaxy A04S స్పెసిఫికేషన్స్

గీక్ బెంచ్ లిస్టింగ్ ని బట్టి, శాంసంగ్ గెలాక్సీ ఏ04ఎస్ ఎగ్జినోస్ 850 చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం. ఇదొక 4జీ చిప్సెట్. దీంతో, 5జీ వర్షన్ వేరొక ప్రాసెసర్ ను కలిగి ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఇతర ఫీచర్లను చూస్తే, 3జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్, వన్ యూఐ 4.1 కోర్ యూఐ, 13ఎంపి ప్రైమరీ కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఈ ఫోన్లో ఉంటాయి.

The post శాంసంగ్ నుంచి తక్కువ ధరలో 5జీ ఫోన్, త్వరలో లాంచ్ కానున్న Galaxy A04S first appeared on 91Mobiles Telugu.

]]>