GIZFIT Glow - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 26 Sep 2022 15:09:09 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 రూ.2,499 కే బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్: ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉన్న GIZFIT Glow Smartwatch https://www.91mobiles.com/telugu/gizfit-glow-smartwatch-bluetooth-calling-discount-price-flipkart/ Mon, 26 Sep 2022 15:09:09 +0000 https://www.91mobiles.com/telugu/?p=2579 హైలైట్స్: తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తోన్న Gizmore లేటస్ట్ వాచ్ GIZFIT Glow రూ.2,499 కే ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉన్న స్మార్ట్ వాచ్ 1.37-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే వంటి ఫీచర్లు కలిగిన GIZFIT Glow స్మార్ట్ వాచ్ Gizmore సంస్థ తాజాగా GIZFIT Glow అనే స్మార్ట్ వాచ్ ని భారత్ లో లాంచ్ చేసింది. 1.37-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లేతో ఈ వాచ్ లాంచ్ అయ్యింది. ఈ-కామర్స్ సైట్ […]

The post రూ.2,499 కే బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్: ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉన్న GIZFIT Glow Smartwatch first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తోన్న Gizmore లేటస్ట్ వాచ్ GIZFIT Glow
  • రూ.2,499 కే ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉన్న స్మార్ట్ వాచ్
  • 1.37-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే వంటి ఫీచర్లు కలిగిన GIZFIT Glow స్మార్ట్ వాచ్

Gizmore సంస్థ తాజాగా GIZFIT Glow అనే స్మార్ట్ వాచ్ ని భారత్ లో లాంచ్ చేసింది. 1.37-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లేతో ఈ వాచ్ లాంచ్ అయ్యింది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ వాచ్ ని కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో కొనసాగుతోన్న బిగ్ బిలియన్ డేస్ సేల్ లో ఈ ఫోన్ పై బంపర్ ఆఫర్లు వచ్చాయి. GIZFIT Glow కి సంబంధించిన మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం పదండి.

GIZFIT Glow స్పెసిఫికేషన్స్

Gizmore కంపెనీ లేటెస్ట్ గా లాంచ్ చేసిన GIZFIT Glow వాచ్ అమోలెడ్ డిస్ప్లే, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే తో మార్కెట్ లోకి అడుగు పెట్టింది. ఈ వాచ్ 1.37-ఇంచ్ సర్క్యులర్ డిస్ప్లే కలిగి ఉంది. అలాగే, ప్రీమియమ్ లెదర్ స్ట్రాప్ వాచ్ కి సూపర్బ్ లుక్ ఇస్తోంది. ఈ వాచ్ లోని అమోలెడ్ డిస్ప్లే 420*420 పిక్సెల్స్ రెజుల్యూషన్ కలిగి ఉంది. ఇకపోతే ఈ డిస్ప్లే 550 నిట్స్ బ్రైట్నెస్ కలిగి ఉంది. సన్ లైట్ లో కూడా ఈ వాచ్ పై పిక్చర్స్ స్పష్టంగా కనిపిస్తాయని కంపెనీ చెబుతోంది.

GIZFIT Glow ఫీచర్లు

GIZFIT Glow వాచ్ ఉత్తమమైన బ్యాటరీ బ్యాకప్ ని కలిగి ఉంది. ఈ వాచ్ ఐపీ68 సర్టిఫికేషన్ తో వస్తోంది. దీంతో ఈ వాచ్ వాటర్, స్వెట్, డస్ట్ ప్రూఫ్ గా నిలుస్తోంది. GIZFIT Glow లో అపరిమిత వాచ్ ఫేసెస్, కస్టమైజేషన్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. క్విక్ యాక్సెస్ కోసం GIZFIT Glow లో ఇంటెలిజెంట్ స్లిప్ స్క్రీన్ ఉంది. దీంతో పాటు, వాచ్ లో నేవిగేషన్ కోసం రొటేటింగ్ క్రౌన్ కంట్రోల్ ని అందించారు. అలాగే, బటన్ ని ప్రెస్ చేసి స్పోర్ట్స్ మోడ్ ని డైరెక్ట్ గా యాక్సెస్ అయ్యే ఫెసిలిటీ ఉంది. డబుల్ ట్యాప్ చేయడం ద్వారా యూఐ ని మార్చే ఆప్షన్ ఈ వాచ్ లో ఉంది. గూగుల్ వాయిస్ అసిస్టెంట్, ఆపిల్ సిరి GIZFIT Glow లో ఉన్నాయి.

GIZFIT Glow లో ఎస్పీఓ2 మానిటర్, హార్ట్ రేట్ మానిటర్, బ్లడ్ ప్రెషర్ మానిటర్, స్ట్రెస్ మానిటర్, స్లీప్ ట్రాకర్, మీడియేటివ్ బ్రీథింగ్ ఫీచర్ ఉన్నాయి. GIZFIT Glow వాచ్ లో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ కూడా ఉండటం విశేషం. ఈ వాచ్ లో బిల్ట్ ఇన్ మైక్రోఫోన్, స్పీకర్ ఉన్నాయి.

GIZFIT Glow ధర

GIZFIT Glow స్మార్ట్ వాచ్ ని బిల్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ లో రూ.2,499 కే కొనుగోలు చేయవచ్చు. సేల్ పూర్తయ్యాక ఈ వాచ్ ధర రూ.3,499 కి మారుతుంది. ఇకపోతే GIZFIT Glow బ్లాక్, బ్రౌన్, బర్గండీ మరియు ఇతర కలర్ ఆప్షన్స్ లో లభిస్తోంది.

Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్

GIZFIT Glow వాచ్ కాకుండా, ఇదే కంపెనీకి చెందిన ఇతర వాచెస్ ని కూడా బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. GIZFIT Ultra, GIZFIT Blaze స్మార్ట్ వాచెస్ ని స్పెషల్ ప్రైస్ లో రూ.1,499 కే కొనుగోలు చేయవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఆటోమొబైల్, టెక్నాలజీ, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post రూ.2,499 కే బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్: ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉన్న GIZFIT Glow Smartwatch first appeared on 91Mobiles Telugu.

]]>