Google Pixel 8a - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 08 May 2024 06:19:02 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Google: 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌తో భారత్‌లో లాంచైన Pixel 8a https://www.91mobiles.com/telugu/google-pixel-8a-launched-in-india-with-2000-nits-peak-brightness/ Wed, 08 May 2024 06:19:02 +0000 https://www.91mobiles.com/telugu/?p=11405 ప్రముఖ టెక్ బ్రాండ్ Google భారతీయ మార్కెట్ లో Pixel 8a స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. మే 14 నుంచి ఈ ఫోన్ సేల్‌కి అందుబాటులో ఉంటుంది. టెన్సర్ జీ3 చిప్సెట్‌ని ఈ ఫోన్ లో వాడారు. ఇంకా ఈ ఫోన్ లో ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, ఓఎల్ఈడీ ప్యానెల్, 64ఎంపి కెమెరా, 4492 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి Google Pixel 8a యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో […]

The post Google: 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌తో భారత్‌లో లాంచైన Pixel 8a first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Google Pixel 8a లాంచ్
  • టెన్సర్ జీ3 చిప్సెట్
  • 64ఎంపి మెయిన్ కెమెరా

ప్రముఖ టెక్ బ్రాండ్ Google భారతీయ మార్కెట్ లో Pixel 8a స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. మే 14 నుంచి ఈ ఫోన్ సేల్‌కి అందుబాటులో ఉంటుంది. టెన్సర్ జీ3 చిప్సెట్‌ని ఈ ఫోన్ లో వాడారు. ఇంకా ఈ ఫోన్ లో ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, ఓఎల్ఈడీ ప్యానెల్, 64ఎంపి కెమెరా, 4492 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి Google Pixel 8a యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Google Pixel 8a ధర, సేల్ వివరాలు

Google Pixel 8a 128జిబి స్టోరేజీ బేస్ వేరియంట్ ధరను రూ.52,999 గా పెట్టారు. 256జిబి వేరియంట్ ధరను రూ.59,999 గా నిర్ణయించారు.

గూగుల్ సంస్థ ఈ ఫోన్ కొనుగోలుపై రూ.4,000 బ్యాంక్ ఆఫర్ మరియు ఎంపిక చేయబడిన బ్యాంక్ కార్డులపై నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్ ని అందిస్తోంది. పాత ఫోన్‌ని మార్చుకోవడం ద్వారా రూ.9,000 బోనస్ పొందవచ్చు.

Google Pixel 8a డివైజ్‌ యొక్క ప్రీ-ఆర్డర్ సేల్‌లో Pixel Buds A-సిరీస్‌ని రూ.999 కే సొంతం చేసుకోవచ్చు.

Google Pixel 8a స్మార్ట్‌ఫోన్ ఒబ్సిడియన్, పొర్సెలెన్, బే మరియు అలో కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Google Pixel 8a డివైజ్ అల్యూమినియమ్ ఫ్రేమ్, ఫింగర్-ప్రింట్ రెసిస్టంట్ కోటింగ్ తో వచ్చింది.

Google Pixel 8a స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

డిస్ప్లే: Google Pixel 8a లో 6.1-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1400 నిట్స్ హెచ్డీఆర్ బ్రైట్నెస్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ 3 ఉన్నాయి.

ప్రాసెసర్: Google Pixel 8a లో గూగుల్ టెన్సర్ జీ3 చిప్సెట్ వాడారు. ఈ చిప్‌కి జతగా టైటన్ ఎమ్2 సెక్యూరిటీ ప్రాసెసర్‌ని కూడా అందించారు.

ర్యామ్, స్టోరేజీ: Google Pixel 8a డివైజ్ 8జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 128జిబి/256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Google Pixel 8a లో 64ఎంపి ఓఐఎస్/ఈఐఎస్ మెయిన్ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. మెయిన్ కెమెరా 8x సూపర్ రెజ్ జూమ్ ఫీచర్‌ని కలిగి ఉంది. అల్ట్రావైడ్ లెన్స్ 120 డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ తో వచ్చింది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Google Pixel 8a లో పవర్ బ్యాకప్ కోసం 4492 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Google Pixel 8a డివైజ్‌కి ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది. 7 ఏళ్ళ పాటు ఓఎస్ అప్డేట్స్, సెక్యూరిటీ ప్యాచెస్ లభిస్తాయి.

ఇతర ఫీచర్లు: Google Pixel 8a లో ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్, వై-ఫై 6, ఇస్రో యొక్క నావిక్ జీపీఎస్, ఐపీ67 రేటింగ్ ఉన్నాయి.

The post Google: 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌తో భారత్‌లో లాంచైన Pixel 8a first appeared on 91Mobiles Telugu.

]]>
Google: లీకైన Pixel 8a స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/google-pixel-8a-specs-leaked/ Fri, 05 Apr 2024 18:29:38 +0000 https://www.91mobiles.com/telugu/?p=10954 ప్రముఖ టెక్ కంపెనీ Google నుంచి త్వరలో కొత్త పిక్సెల్ ఫోన్ లాంచ్ కానుంది. Google Pixel 8a పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. ఇటీవలె ఈ ఫోన్ కి సంబంధించి కొన్ని వివరాలు లీక్ అయ్యాయి. తాజాగా ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ మరోసారి లీక్ అయ్యాయి. అలాగే కొన్ని రోజుల క్రితం పిక్సెల్ 8ఏ బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఇప్పుడు టిప్‌స్టర్ ద్వారా పిక్సెల్ 8ఏ యొక్క పూర్తి […]

The post Google: లీకైన Pixel 8a స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మరోసారి లీకైన Google Pixel 8a స్పెసిఫికేషన్స్
  • మే 14న గూగుల్ ఐ/ఓ ఈవెంట్‌లో లాంచ్
  • 6.1-ఇంచ్ డిస్ప్లేతో వస్తోన్న డివైజ్

ప్రముఖ టెక్ కంపెనీ Google నుంచి త్వరలో కొత్త పిక్సెల్ ఫోన్ లాంచ్ కానుంది. Google Pixel 8a పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. ఇటీవలె ఈ ఫోన్ కి సంబంధించి కొన్ని వివరాలు లీక్ అయ్యాయి. తాజాగా ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ మరోసారి లీక్ అయ్యాయి.

అలాగే కొన్ని రోజుల క్రితం పిక్సెల్ 8ఏ బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఇప్పుడు టిప్‌స్టర్ ద్వారా పిక్సెల్ 8ఏ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు లాంచ్ టైమ్ లైన్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

Google Pixel 8a స్పెసిఫికేషన్స్ (లీక్)

Google Pixel 8a లో 6.1-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ ఓఎల్ఈడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయని టిప్‌స్టర్ యోగేశ్ బ్రార్ ద్వారా తెలుస్తోంది.

ఈ స్మార్ట్‌ఫోన్ లో టెన్సర్ జీ3 చిప్సెట్ వాడే అవకాశం ఉంది. ఇదే చిప్సెట్‌ని పిక్సెల్ 8 సిరీస్ లో వాడారు.

Google Pixel 8a డివైజ్ 128జిబి/256 స్టోరేజీ వేరియంట్స్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అవుతుందని సమాచారం.

Google Pixel 8a డివైజ్ 64ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 13ఎంపి ఫ్రంట్ కెమెరాతో వచ్చే అవకాశం ఉంది.

Google Pixel 8a స్మార్ట్‌ఫోన్ 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 27 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోందని లీక్స్ ద్వారా తెలుస్తోంది.

Google Pixel 8a లాంచ్ టైమ్‌లైన్, ధర

Google Pixel 8a మే నెలలో లాంచ్ అవుతుందని టిప్‌స్టర్ ద్వారా తెలుస్తోంది. గూగుల్ ఐ/ఓ 2024 ఈవెంట్ లో ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. మే 14వ తేదీన ఈవెంట్ జరుగుతుంది. గూగుల్ పిక్సెల్ 8ఏ ధర 500 డాలర్ల నుంచి 550 డాలర్ల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీన్ని భారతీయ కరెన్సీలో సుమారు రూ.41,635 అని చెప్పవచ్చు. మార్కెట్‌ని బట్టి ధరలో తేడా ఉంటుంది.

The post Google: లీకైన Pixel 8a స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>