Hero MotoCorp - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 19 Sep 2022 13:03:07 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 అక్టోబర్ 7 న లాంచ్ అవుతోన్న Hero Vida Electric Scooter https://www.91mobiles.com/telugu/hero-motocorp-first-e-scooter-vida-launch-date/ Mon, 19 Sep 2022 13:03:07 +0000 https://www.91mobiles.com/telugu/?p=2428 హైలైట్స్: అక్టోబర్ 7 న లాంచ్ అవుతోన్న Hero Vida Electric Scooter సబ్-బ్రాండ్ విడా ను ప్రారంభిస్తోన్న హీరో మోటోకార్ప్ త్వరలో విడా బ్రాండ్ పేరుతో మార్కెట్ లోకి ఈ-స్కూటర్లను ప్రవేశపెట్టనున్న హీరో మోటోకార్ప్ Hero Vida Electric Scooter Launch Date: టూ-వీలర్ సెగ్మెంట్ లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న హీరో మోటోకార్ప్ త్వరలో సబ్-బ్రాండ్ విడా (Vida) పేరుతో మార్కెట్ లోకి ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. ఇకపై హీరో […]

The post అక్టోబర్ 7 న లాంచ్ అవుతోన్న Hero Vida Electric Scooter first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • అక్టోబర్ 7 న లాంచ్ అవుతోన్న Hero Vida Electric Scooter
  • సబ్-బ్రాండ్ విడా ను ప్రారంభిస్తోన్న హీరో మోటోకార్ప్
  • త్వరలో విడా బ్రాండ్ పేరుతో మార్కెట్ లోకి ఈ-స్కూటర్లను ప్రవేశపెట్టనున్న హీరో మోటోకార్ప్

Hero Vida Electric Scooter Launch Date: టూ-వీలర్ సెగ్మెంట్ లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న హీరో మోటోకార్ప్ త్వరలో సబ్-బ్రాండ్ విడా (Vida) పేరుతో మార్కెట్ లోకి ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. ఇకపై హీరో బ్రాండింగ్ లేకుండా విడా బ్రాండింగ్ తో ఎలక్ట్రిక్ స్కూటర్లు లాంచ్ కానున్నాయి. ఇప్పటికే డీలర్స్, ఇన్వెస్టర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కి లాంచ్ కి సంబంధించిన ఆహ్వాన లేఖలు అందినట్లు సమాచారం. రాజస్తాన్ రాజధాని అయిన జైపూర్ లో ఈ లాంచ్ ఈవెంట్ జరగనుంది. హీరో ఎలక్ట్రిక్ సంస్థతో ‘హీరో’ బ్రాండింగ్ పై జరిగిన ఒప్పందం మేరకు హీరో మోటోకార్ప్ తాను లాంచ్ చేయబోవు ఎలక్ట్రిక్ స్కూటర్లకు హీరో అనే బ్రాండింగ్ ను ఉపయోగించరాదు. దీంతో విడా అనే సబ్-బ్రాండ్ తో హీరో మోటోకార్ప్ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ని మార్కెట్ లోకి విడుదల చేస్తోంది.

ఇక విజయ్ ముంజాల్, ఆయన కుమారుడు నవీన్ ముంజాల్ హీరో ఎలక్ట్రిక్ సంస్థకు యజమానులుగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు హీరో మోటోకార్ప్ సంస్థకు పవన్ ముంజాల్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ ముంజాల్ Hero బ్రాండింగ్ వినియోగం విషయమై తన కజిన్ కి వ్యతిరేకంగా కోర్టుకి వెళ్ళగా, హీరో మోటోకార్ప్ నుంచి రాబోవు ఎలక్ట్రిక్ స్కూటర్లకు హీరో బ్రాండింగ్ ను వాడరాదని తెలిపింది. అలాగే సమస్యను ఇరువురు సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది. దీంతో హీరో మోటోకార్ప్ తన ఎలక్ట్రిక్ డివిజన్ పేరును విడా అనే బ్రాండ్ తో ప్రారంభించాలని నిర్ణయించింది.

Vida ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ఎంత?

రిపోర్ట్స్ ప్రకారం, హీరో మోటోకార్ప్ 2022 అక్టోబర్ 7 న తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే, లాంచ్ సమయంలోనే స్కూటర్ ధర, ఫీచర్లు బయటకు రానున్నాయి. అయితే లీకైన కథనాలను బట్టి, ధర రూ.1 లక్ష ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఇదివరకు విడుదలైన పిక్స్ ని బట్టి హీరో మోటోకార్ప్ నుంచి రాబోవు స్కూటర్లు, ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ల మాదిరే ఉంటాయని స్పష్టమవుతోంది. 10-ఇంచ్ రియర్ బ్లాక్ అల్లాయ్ వీల్, 12-ఇంచ్ ఫ్రంట్ అల్లాయ్ వీల్ ఇంకా ఎన్నో కొత్త ఫీచర్లు ఇందులో ఉంటాయని చెబుతున్నారు.

Battery Swapping టెక్నాలజీతో వస్తున్న Vida ఎలక్ట్రిక్ స్కూటర్

బ్యాటరీ స్వాపింగ్ ప్లాట్ఫామ్ ని అభివృద్ధి పరిచేందుకు తైవాన్ కి చెందిన గొగొరో అనే కంపెనీతో హీరో మోటోకార్ప్ ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా హీరో మోటోకార్ప్ నుంచి రానున్న ఈ-స్కూటర్లు ఉత్తమమైన బ్యాటరీ రేంజ్ కలిగి ఉంటాయని తెలుస్తోంది.

Hero MotoCorp నుంచి రానున్న తొలి ఎలక్ట్రిక్ బైక్ ఇప్పటికే మార్కెట్ లో ఉన్న బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్ తదితర స్కూటర్లతో పోటీ పడనుంది.

The post అక్టోబర్ 7 న లాంచ్ అవుతోన్న Hero Vida Electric Scooter first appeared on 91Mobiles Telugu.

]]>