Hero Vida V1 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Mon, 10 Oct 2022 05:25:43 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 165km రేంజ్ తో లాంచ్ అయిన Hero Vida V1 ఎలక్ట్రిక్ స్కూటర్ https://www.91mobiles.com/telugu/hero-vida-v1-e-scooter-launched-india-specs-price-availability/ Mon, 10 Oct 2022 05:25:43 +0000 https://www.91mobiles.com/telugu/?p=2817 హైలైట్స్: తన తొలి ఈ-స్కూటర్ Hero Vida V1 ని లాంచ్ చేసిన Hero MotoCorp Hero Vida V1 Plus, Hero Vida V1 Pro అనే రెండు వేరియంట్లలో లభించనున్న Hero Vida V1 Hero Vida V1 ఎక్స్-షోరూమ్ ధర రూ.1.45 లక్షల నుంచి ప్రారంభం ఇటీవలి కాలంలో భారత్ లో ఎలక్ట్రిక్ స్కూటర్లు బాగా పాపులర్ అవుతున్నాయి. అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారు అయిన Hero MotoCorp తన తొలి ఎలక్ట్రిక్ […]

The post 165km రేంజ్ తో లాంచ్ అయిన Hero Vida V1 ఎలక్ట్రిక్ స్కూటర్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • తన తొలి ఈ-స్కూటర్ Hero Vida V1 ని లాంచ్ చేసిన Hero MotoCorp
  • Hero Vida V1 Plus, Hero Vida V1 Pro అనే రెండు వేరియంట్లలో లభించనున్న Hero Vida V1
  • Hero Vida V1 ఎక్స్-షోరూమ్ ధర రూ.1.45 లక్షల నుంచి ప్రారంభం

ఇటీవలి కాలంలో భారత్ లో ఎలక్ట్రిక్ స్కూటర్లు బాగా పాపులర్ అవుతున్నాయి. అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారు అయిన Hero MotoCorp తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ Hero Vida V1 ని దేశంలో లాంచ్ చేసింది. Hero Vida V1 రెండు వేరియంట్లలో లభించనుంది. అవి: Hero Vida V1 Plus, Hero Vida V1 Pro. రెండు మోడల్స్ మధ్య బ్యాటరీ కెపాసిటీ ఒక్కటే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. Hero Vida V1 అక్టోబర్ 8 న Hero Vida V1 భారత్ లో లాంచ్ అయ్యింది.

భారత్ లో Hero Vida V1 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర, లభ్యత

Hero Vida V1 రెండు వేరియంట్లలో లభించనుంది. అవి: Hero Vida V1 Plus, Hero Vida V1 Pro. రూ.1.45 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో Hero Vida V1 Plus లాంచ్ అయ్యింది. మరోవైపు Hero Vida V1 Pro రూ.1.59 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో ఎంట్రీ ఇచ్చింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లకు బుకింగ్స్ అక్టోబర్ 10 నుంచి మొదలవ్వనున్నాయి. రూ.4,999 చెల్లించి ఆసక్తిగల వారు బండిని బుక్ చేసుకోవచ్చు.

Hero Vida V1 యొక్క రెండు వేరియంట్లు కూడా మూడు కలర్ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యాయి. అవి: మ్యాట్ వైట్, మ్యాట్ స్పోర్ట్స్ రెడ్, గ్లాస్ బ్లాక్. అయితే టాప్ వేరియంట్ అయిన Hero Vida V1 Pro మాత్రం అదనంగా మ్యాట్ అబ్రాక్స్ ఆరెంజ్ కలర్ ఆప్షన్ లో కూడా లభించనుంది.

Hero Vida V1 స్పెసిఫికేషన్స్

సరికొత్త Hero Vida V1 Plus ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. Hero Vida V1 Plus 3.44 కిలో వాట్ బ్యాటరీ కలిగి ఉంది. సింగిల్ చార్జ్ పై ఈ బండి 143 కిలో మీటర్ల దూరం పరిగెడుతుంది. మరోవైపు Hero Vida V1 Pro లో 3.94 కిలో వాట్ బ్యాటరీ అమర్చారు. ఈ బండి ఫుల్ చార్జ్ పై 165 కిలోమీటర్ల దూరం వెళ్తుంది. రెండు వేరియంట్లు కూడా 0 నుంచి 40 కేఎంపీహెచ్ వేగాన్ని చేరుకోవడానికి 3.2 సెకన్ల సమయం తీసుకుంటాయి. అలాగే ఈ రెండు స్కూటర్లు 80 కేఎంపీహెచ్ టాప్ స్పీడ్ ని కలిగి ఉన్నాయి.

ఇతర ఫీచర్ల గురించి తెలుసుకుందాం. Hero Vida V1 రెండు మోడల్స్ లో 7-ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కీలెస్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్, ఎస్ఓఎస్ అలర్ట్, టూ-వే థ్రాటిల్, ఓటీఏ అప్డేట్స్ ఉంటాయి. Hero Vida V1 ఎలక్ట్రిక్ స్కూటర్ లో మూడు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. అవి: ఇకో, రైడ్, స్పోర్ట్స్.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post 165km రేంజ్ తో లాంచ్ అయిన Hero Vida V1 ఎలక్ట్రిక్ స్కూటర్ first appeared on 91Mobiles Telugu.

]]>