Hisense - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Wed, 12 Jul 2023 17:17:23 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 4K లేజర్ స్మార్ట్ టీవీతో సహా మొత్తం 4 మోడల్స్ లాంచ్ చేసిన Hisense https://www.91mobiles.com/telugu/hisense-company-launched-4-smart-tvs-india/ Wed, 12 Jul 2023 17:17:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=7177 Hisense కంపెనీ ఇటీవలి కాలంలో తన స్మార్ట్ టీవీ లతో హడావుడి చేస్తోంది. జనాలు ఈ కంపెనీ టీవీల పట్ల ఆకర్షితులవుతున్నాయి. తాజాగా ఈ సంస్థ మార్కెట్ లోకి తన కొత్త ఉత్పత్తులను లాంచ్ చేసింది. నాలుగు 4కే స్మార్ట్ టీవీలు భారతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. అవి: Laser TV, E7K Pro, Tornado A7K, A6K. లేజర్ టీవీ ప్రత్యేకత ఏంటంటే, ఈ టీవీ కొనుగోలుదారులు 120 ఆంబియెంట్ లైట్ రిజెక్షన్ టెక్నాలజీ […]

The post 4K లేజర్ స్మార్ట్ టీవీతో సహా మొత్తం 4 మోడల్స్ లాంచ్ చేసిన Hisense first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 4కే స్మార్ట్ టీవీలను పరిచయం చేసిన Hisense కంపెనీ
  • 120 యాంబియెంట్ లైట్ రిజెక్షన్ టెక్నాలజీతో వచ్చిన లేజర్ టీవీ
  • జులై 15 నుంచి మొదలు కానున్న సేల్

Hisense కంపెనీ ఇటీవలి కాలంలో తన స్మార్ట్ టీవీ లతో హడావుడి చేస్తోంది. జనాలు ఈ కంపెనీ టీవీల పట్ల ఆకర్షితులవుతున్నాయి. తాజాగా ఈ సంస్థ మార్కెట్ లోకి తన కొత్త ఉత్పత్తులను లాంచ్ చేసింది. నాలుగు 4కే స్మార్ట్ టీవీలు భారతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. అవి: Laser TV, E7K Pro, Tornado A7K, A6K. లేజర్ టీవీ ప్రత్యేకత ఏంటంటే, ఈ టీవీ కొనుగోలుదారులు 120 ఆంబియెంట్ లైట్ రిజెక్షన్ టెక్నాలజీ కలిగిన స్క్రీన్ ని పొందుతారు. సరే, ఓసారి ఈ టీవీల ధరలు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

ధర, లభ్యత

Hisense సంస్థ లేజర్ టీవీని రూ.499,999 ధరతో లాంచ్ చేసింది. అమెజాన్ పై 3 ఏళ్ళ పాటు నిరవధిక వ్యారంటీని కంపెనీ అందిస్తోంది. ఈ వ్యారంటీ మొదటి 7 రోజుల్లో టీవీని కొనుగోలు చేస్తేనే వర్తిస్తుంది.

  • ఇక టోర్నడో క్యూఎల్ఈడీ ఈ7కే టీవీ ధర రూ.49,999 గా ఉంది.
  • టోర్నడో ఏ7కే ధర రూ.47,999 నుంచి ప్రారంభమవుతుంది.
  • మరోవైపు ఏ6కే టీవీ ధర రూ.28,999 తో మొదలవుతుంది.
  • లేజర్ టీవీ, ఈ7కే ప్రో టీవీలు ఈ-కామర్స్ వెబ్ సైట్ అమెజాన్ పై జులై 15 న సేల్ కి వస్తున్నాయి. ఇక ఏ7కే టీవీ అదే తేదీ నుంచి ఫ్లిప్ కార్ట్ లో సేల్ కి అందుబాటులో ఉంటుంది. ఏ6కే టీవీ ఫ్లిప్ కార్ట్ మరియు అమెజాన్ వెబ్ సైట్స్ పై సేల్ కి వస్తోంది.

Hisense Laser TV ఫీచర్లు

  • డిస్ప్లే: Hisense Laser TV లో 120-ఇంచ్ స్క్రీన్, ఆర్జీబీ ట్రిపుల్ కలర్ లేజర్ లైట్ సోర్స్, ఏఎల్ఆర్ స్క్రీన్ ఉన్నాయి. ఈ టీవీలో 3840*2160 పిక్సెల్ రెజుల్యూషన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3000 లుమెన్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ర్యామ్: Hisense Laser TV లో 8జిబి స్టోరేజీ, 3జిబి ర్యామ్ ఉన్నాయి.
  • కనెక్టివిటీ: Hisense Laser TV లో హెచ్డీఎంఐ, యూఎస్బీ, బ్లూటూత్, 40 వాట్ స్టీరియో స్పీకర్స్, డాల్బి ఆడియో, డాల్బీ అట్మాస్ ఉన్నాయి.
  • ఓఎస్: Hisense Laser TV VIDAA U6 అనే ఆపరేటింగ్ సిస్టమ్ పై పని చేస్తుంది.

Hisense Tornado QLED E7K Pro TV

Hisense Tornado QLED E7K Pro TV బెజెల్-లెస్ డిస్ప్లే డిజైన్ తో వచ్చింది. ఈ టీవీ లో 55-ఇంచ్ 4కే అల్ట్రా హెచ్డీ డిస్ప్లే, 3840*2160 పిక్సెల్స్ రెజుల్యూషన్, 240 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. హెచ్డీఆర్ గేమ్ మోడ్ కూడా ఉంది. ఈ టీవీలో ఏఎండీ ఫ్రీసింక్ ప్రీమియమ్, ఏఎల్ఎల్ వీఆర్ఆర్ సపోర్ట్, డాల్బి విజన్ ఐక్యూ, హెచ్డీఆర్10, హెచ్డీఆర్10+, హెచ్‌ఎల్‌జీ ఉన్నాయి.

బెటర్ ఆడియో కోసం టీవీలో 49 వాట్ 2.1 చానల్ స్పీకర్స్ సబ్‌వూఫర్ తో సహా అందించారు. ఓఎస్ విషయానికి వస్తే, ఈ టీవీ VIDAA U6 ఆపరేటింగ్ సిస్టమ్ పై పని చేస్తుంది.

Hisense A7K ఫీచర్లు

Hisense A7K స్మార్ట్ టీవీలో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 50-ఇంచ్ డిస్ప్లే, 4కే (3840*2160 పిక్సెల్) రెజుల్యూషన్, డాల్బి విజన్, డాల్బి అట్మాస్, జేబీఎల్-61వాట్ బిల్ట్-ఇన్ వూఫర్ ఉన్నాయి. VIDAA Smart OS పై ఈ టీవీ పని చేస్తుంది.

Hisense A6K TV

ఈ HISENSE A6K TV గూగుల్ టీవీ ప్లాట్ఫామ్ పై పని చేస్తుంది. ఈ టీవీలో 43-ఇంచ్ డిస్ప్లే, 4కే రెజుల్యూషన్, ఏఐ అడాప్టివ్ డెప్త్ టెక్నాలజీ, హెచ్డీఆర్ డాల్బి విజన్, హెచ్డీఆర్10+ ఉన్నాయి.

The post 4K లేజర్ స్మార్ట్ టీవీతో సహా మొత్తం 4 మోడల్స్ లాంచ్ చేసిన Hisense first appeared on 91Mobiles Telugu.

]]>
2 కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసిన Hisense; TV కొంటే రూ.6,000 విలువగల 4K ఫైర్ టీవీ స్టిక్ ఉచితం https://www.91mobiles.com/telugu/hisense-launched-2-smart-tvs-india-price-specs-availability/ Mon, 26 Sep 2022 14:12:23 +0000 https://www.91mobiles.com/telugu/?p=2574 హైలైట్స్: మార్కెట్ లోకి 2 కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసిన Hisense కంపెనీ టీవీ కొనుగోలు పై రూ.5,999 విలువ గల 4K Fire TV Stick ఉచితం అమెజాన్ ద్వారా సేల్ కి వచ్చిన U7H TV, A7H Tornado 2.0 ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ Hisense నేడు భారత్ లో రెండు కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. U7H TV, A7H Tornado 2.0 అనే రెండు మోడల్స్ ని హైసెన్స్ […]

The post 2 కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసిన Hisense; TV కొంటే రూ.6,000 విలువగల 4K ఫైర్ టీవీ స్టిక్ ఉచితం first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • మార్కెట్ లోకి 2 కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసిన Hisense కంపెనీ
  • టీవీ కొనుగోలు పై రూ.5,999 విలువ గల 4K Fire TV Stick ఉచితం
  • అమెజాన్ ద్వారా సేల్ కి వచ్చిన U7H TV, A7H Tornado 2.0

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ Hisense నేడు భారత్ లో రెండు కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. U7H TV, A7H Tornado 2.0 అనే రెండు మోడల్స్ ని హైసెన్స్ మార్కెట్ లోకి వదిలింది. ఈ రెండు టీవీలు ప్రస్తుతం ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ లో అందుబాటులో ఉన్నాయి. కొత్తగా లాంచ్ అయిన ఈ టీవీల్లో 4కే ప్యానెల్, డాల్బి విజన్, డాల్బి అట్మాస్ ఆడియో సపోర్ట్ ఉన్నాయి.

ఇంకా 65-ఇంచ్ క్యూఎల్ఈడీ టీవీ అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ 4కే, హై వ్యూ ఇంజిన్ తో వస్తోంది. మరోవైపు, 55-ఇంచ్ వర్షన్ గూగుల్ టీవీ, గూగుల్ ప్లే స్టోర్ ఫుల్ యాక్సెస్ తో వస్తోంది. మరిన్ని వివరాలు తెలుసుకుందాం పదండి.

భారత్ లో U7H TV, A7H Tornado 2.0 స్మార్ట్ టీవీల ధరలు, లభ్యత

Hisense U7H సిరీస్ 55-ఇంచ్ టీవీ ధర రూ.51,990 గా ఉంది. ఇక 65-ఇంచ్ మోడల్ ధర రూ.71,990 గా ఉంది. A7H Tornado 2.0 ధర రూ.42,990 గా నిర్ణయించారు. ఈ మూడు వేరియంట్లు అమెజాన్ లో కొనుగోలుకి అందుబాటులో ఉన్నాయి.

Hisense U7H TV ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

Hisense U7H TV రెండు స్క్రీన్ సైజెస్ లో వస్తోంది. అవి: 55-అంగుళాలు, 65-అంగుళాలు. ఈ ఒక్క మార్పు తప్పితే, మిగతా స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఈ రెండు టీవీల్లో ఒకే విధంగా ఉంటాయి. Hisense U7H TV సిరీస్ 4కే అల్ట్రా స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, క్యూఎల్ఈడీ ప్యానెల్, లైట్ డిమ్మింగ్, లైట్ సెన్సింగ్ టెక్నాలజీ వంటి ఫీచర్లతో వస్తోంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉండటం ఈ టీవీలకు బిగ్ ప్లస్. ఎందుకంటే దాదాపుగా ఇతర టీవీలు ఏవీ ఈ రేంజ్ లో రిఫ్రెష్ రేట్ కలిగి లేవు.

ఇకపోతే, ఈ టీవీలు ఎంఈఎంసీ, వైడ్ కలర్ గేముత్, 6ఎంఎస్ రెస్పాన్స్ టైమ్, డాల్బి విజన్ ఐక్యూ, హెచ్డీఆర్10+, ఏఎండీ ఫ్రీసింక్ వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి. అదనంగా ఈ టీవీలు బాక్స్ లో ఫైర్ టీవీ స్టిక్ 4కే తో వస్తున్నాయి. యూట్యూబ్, ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, యప్‌టీవీ తదితర ఎన్నో యాప్స్ ఈ టీవీలో ఉన్నాయి. అయితే ఈ టీవీ ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్ లేదా గూగుల్ టీవీ పై పని చేయదు.

Hisense U7H TV లో 20వాట్ సౌండ్ ఔట్‌పుట్, డాల్బి అట్మాస్, డీటీఎస్ ఎక్స్, ఈఏఆర్సీ, డాల్బి డిజిటల్ సపోర్ట్ ఉన్నాయి. కనెక్టివిటీ విషయానికి వస్తే, ఇందులో 4హెచ్డీఎంఐ పోర్ట్స్ వర్షన్ 2.1, యూఎస్బీ 3.0, యూఎస్బీ 2.0 పోర్ట్, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.1 ఉన్నాయి.

Hisense A7H Tornado 2.0 టీవీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

ఈ 4కే టీవీ 3840*2160 అల్ట్రా హెచ్డీ రెజుల్యూషన్ తో వస్తోంది. అయితే ఇది 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ మాత్రమే కలిగి ఉంది. ఆడియో ఔట్‌పుట్ ఈ టీవీలో హైలైట్ పాయింట్ అని చెప్పాలి. Hisense A7H Tornado 2.0 టీవీ 102 వాట్స్ సౌండ్ ఔట్‌పుట్ ని కలిగి ఉంది. ఇందులో 6 జెబిఎల్ స్పీకర్స్ ఉన్నాయి. డాల్బి అట్మాస్ సపోర్ట్ కూడా ఈ టీవీలో ఉంది.

ఈ స్మార్ట్ టీవీ గూగుల్ టీవీ ఓఎస్ పై పని చేస్తుంది. గూగుల్ సర్వీసెస్ తో పాటు, 10 వేలకు పైగా యాప్స్, గేమ్స్ ని ఈ ఓఎస్ సాయంతో పొందవచ్చు. ఈ టీవీ డాల్బి విజన్, హెచ్డీఆర్10 సపోర్ట్ ని కలిగి ఉంది. హెచ్డీఎంఐ పోర్ట్స్, 2 యూఎస్బీ పోర్ట్స్, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.1 వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ టీవీలో ఉన్నాయి. క్రోమ్‌కాస్ట్, ఆపిల్ ఎయిర్‌ప్లే, హోమ్ కిట్, గేమ్ మోడ్ తదితర ఎన్నో ఇతర ఫీచర్లు Hisense A7H Tornado 2.0 లో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఆటోమొబైల్, టెక్నాలజీ, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

The post 2 కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసిన Hisense; TV కొంటే రూ.6,000 విలువగల 4K ఫైర్ టీవీ స్టిక్ ఉచితం first appeared on 91Mobiles Telugu.

]]>